News


నష్టాల్లో మెటల్‌ షేర్లు..హిందల్కో 3% డౌన్‌

Thursday 3rd October 2019
Markets_main1570080418.png-28692

యుఎస్‌ స్థూల ఆర్థిక డేటా బలహీనంగా ఉండడంతోపాటు, యూరోప్‌ దేశాలలో కార్పోరేట్‌ లాభాలు తగ్గడంతో యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వలన అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మాంధ్యంలోకి వెళుతుందనే అంచనాలు పెరిగాయి. ఫలితంగా అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్‌లు గురువారం ట్రేడింగ్‌లో నష్టాల్లో ట్రేడవుతున్నాయి. దీంతో దేశీయ ఈక్విటీ మార్కెట్‌లు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఆర్థిక మాంధ్యం భయాల కారణంగా అంతర్జాతీయంగా మెటల్‌ షేర్లు​ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ఉదయం 10.41 సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.88 శాతం నష్టపోయి 2,352.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 3.50 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ 3.06 శాతం, కోల్‌ ఇండియా 2.83 శాతం, వేదాంత 2.38 శాతం, ఏపీఎల్‌ అపోలో ట్యూబ్స్‌1.52 శాతం, వెల్సపన్‌ కార్ప్‌ 1.48 శాతం, టాటా స్టీల్‌ 1.44 శాతం, హిందుస్థాన్‌  కాపర్‌ 1.04 శాతం, మొయిల్‌ 0.97 శాతం నష్టపోయి ట్రేడవుతున్నాయి. వీటితోపాటు నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌(ఎన్‌ఎమ్‌డీసీ) 0.88 శాతం, జిందాల్‌ స్టీల్‌ 0.82 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ 0.75 శాతం, సెయిల్‌ 0.62 శాతం కూడా నష్టపోయి ట్రేడవుతుండగా,  జేఎస్‌డబ్యూ స్టీల్‌ 0.61 శాతం, రత్నమని మెటల్స్‌ అండ్‌ టూబ్స్‌ 0.68 శాతం మాత్రం లాభపడి ట్రేడవుతున్నాయి.
  కాగా ఇదే సమయానికి నిఫ్టీ 50 55 పాయింట్లు కోల్పోయి 11,304.90 పాయింట్ల వద్ద, సెన్సెక్స్‌ 200.57 పాయింట్లు నష్టపోయి 38,104.84 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి.You may be interested

ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్ల ర్యాలీ..బీపీసీఎల్‌ 4% అప్‌

Thursday 3rd October 2019

అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పడిపోవడంతో దేశీయ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు గురువారం పాజిటివ్‌గా ట్రేడవుతున్నాయి. ఉదయం 11.06 సమయానికి హెచ్‌పీసీఎల్‌(హిందుస్తాన్‌ పెట్రోలియం) షేరు  4.38 శాతం లాభపడి రూ. 323.00 వద్ద ట్రేడవుతోంది.   చమురు ధరలు తగ్గడం, డిజిన్వెస్ట్‌మెంట్లో భాగంగా ప్రభుత్వం, బీపీసీఎల్‌(భారత్‌ పెట్రోలియం)లోని తన పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయం తీసుకోవడంతో బీపీసీఎల్‌ షేరు గత కొన్ని సెషన్ల నుంచి ర్యాలీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ

మళ్లీ 1500డాలర్ల పైకి పసిడి

Thursday 3rd October 2019

మూడు సెషన్ల తర్వాత పసిడి ఫ్యూచర్ల ధర మళ్లీ 1500 డాలర్ల స్థాయి అందుకుంది. అమెరికాలో నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు ఆ దేశ ఈక్విటీ మార్కెట్లను నష్టాల్లోకి నెట్టాయి. అలాగే అమెరికా తాజాగా యూరప్‌ దేశాల దిగుమతులపై తాజా సుంకాల విధింపుతో వాణిజ్య వివాదాలకు తెరలేపింది. ఈ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు సంక్షోభ సమయాల్లో రక్షణాత్మక సాధనమైన పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ఫలితంగా నిన్నరాత్రి అక్కడి మార్కెట్‌లో

Most from this category