News


ట్రేడ్‌ వార్‌ ఎఫెక్ట్‌ : నష్టాల్లో మెటల్‌ షేర్లు

Wednesday 29th May 2019
Markets_main1559125114.png-25982

మెటల్‌ షేర్లు బుధవారం భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌లో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4.50శాతం నష్టపోయింది. అమెరికా- చైనాల మధ్య రోజురోజుకూ ముదురుతున్న వాణిజ్య యుద్ధం కారణంగా ప్రపంచ ఆర్థిక వృద్ధి మందగమనం ఆందోళనల రేకిత్తిన నేపథ్యంలో మెటల్‌ షేర్లకు డిమాండ్‌ను తగ్గించనట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సెయిల్‌ 3.50శాతం, జిందాల్‌ స్టీల్‌, జేఎస్‌ఎల్‌ హిస్సార్‌, టాటా స్టీల్‌ 3శాతం నష్టపోయాయి. వేదాంత, వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌, హిందాల్కో, నాల్కో, హిందూస్థాన్‌ జింక్‌, మొయిల్‌ 1శాతం క్షీణించాయి. ఏపీఎల్‌ అపోలో, కోల్‌ ఇండియా షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు ఎన్‌ఎండీసీ, హిందూస్థాన్‌ కాపర్‌ షేర్లు అరశాతం నుంచి 1శాతం లాభపడ్డాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 1.86శాతం నష్టంతో 2,937.30 వద్ద స్థిరపడింది. 



You may be interested

కొత్త ఆర్థిక మంత్రి పియాష్‌ గోయిల్‌?

Wednesday 29th May 2019

కేబినెట్‌ బాధ్యతలు అప్పగించవద్దంటూ నరేంద్ర మోదికి అరుణ్‌ జైట్లీ లేఖ  ఎన్‌డీఏ-2 ప్రభుత్వంలో కొత్త ఆర్థిక మంత్రిగా పియూష్‌ గోయిల్‌ ఎంపికయ్యే అవకాశాలున్నాయని మార్కెట్‌వర్గాలు భావిస్తున్నారు.  కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో తనకు మంత్రి వర్గంలో చోటు కల్పించవద్దంటూ ఎన్‌డీఏ-1లో  ఆర్థిక శాఖమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన అరుణ్‌ జైట్లీ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా తనకు మంత్రి బాధ్యతలు అప్పగించవద్దంటూ బుధవారం జైట్లీ లేఖరాసిన నేపథ్యంలో ఇప్పటివరకూ విద్యుత్‌ శాఖను నిర్వహిస్తున్న పియూష్‌ గోయల్‌ను

పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 2.50శాతం డౌన్‌

Wednesday 29th May 2019

మార్కెట్‌ మిడ్‌సెషన్‌ సమయానికి నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నష్టాల మార్కెట్లో భాగంగా ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీ అమ్మకాలు ఒత్తిడికి లోనవుతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ 2.50శాతం నష్టపోయింది. ఇండెక్స్‌లో అత్యధికంగా పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌  5శాతం నష్టపోయింది. ఎస్‌బీఐ 3శాతం, అలహబాద్‌ 2.50శాతం క్షీణించాయి. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కెనరా బ్యాంక్‌ షేర్లు 2శాతం పతనమయ్యాయి.

Most from this category