News


కరుగుతున్న మెటల్‌ షేర్లు

Friday 2nd August 2019
Markets_main1564730029.png-27499

నష్టాల మార్కెట్లో భాగంగా శుక్రవారం మెటల్‌ షేర్లు కరిగిపోతున్నాయి. ఎన్‌ఎస్‌ఈలోని నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా మెటల్‌ ధరలకు డిమాండ్‌ తగ్గడంతో పాటు, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికి వరకు ప్రధాన మెటల్‌ ఉత్పత్తి కంపెనీల ఆదాయాలు నిరాశపరచడంతో సెంటిమెంట్‌ను బలహీనపరుస్తోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అలాగే చైనా ఆర్థికమందమనం, ట్రేడ్‌వార్‌ ఉద్రిక్తతలు కొనసాగుతుండటం కూడా మెటల్‌ షేర్ల ట్రేడింగ్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. ప్రస్తుతం అల్యూమినియం ధరలు కొన్ని ఏళ్ల కనిష్ట ధర ఉన్నాయి. నేడు నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ 2,474.70 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి మెటల్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనవుడంతో ఇండెక్స్‌ ఒకదశలో 3శాతం నష్టపోయి 2,430.35 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.12:20ని.లకు ఇండెక్స్‌ గతముగింపు(2,507.05)తో పోలిస్తే 1.71శాతం నష్టంతో 2,464.20 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఇదే సమయానికి జిందాల్‌ స్టీల్‌ అత్యధికంగా 4.50శాతం నష్టపోయింది. ఎన్‌ఎండీసీ 3.50శాతం, సెయిల్‌ 3శాతం, టాటాస్టీల్‌, కోల్‌ ఇండియా, హిందాల్కో, వేదాంత షేర్లు 2శాతం నష్టపోయాయి. జిందాల్‌హిస్సార్‌ స్టీల్‌, హిందూస్థాన్‌కాపర్‌, నాల్కో, ఏపిల్‌ అపోలో షేర్లు 1.50శాతం పతనమయ్యాయి. మెయిల్‌ షేర్లు అరశాతం క్షీణించాయి. మరోవైపు ఇదే ఇండెక్స్‌లోని వెల్‌స్పన్‌ కార్పోరేషన్‌ 1శాతం నష్టపోయింది. హిందూస్థాన్‌ జింక్‌ అరశాతం, జేఎస్‌డబ్ల్యూస్టీ్‌ల్‌ షేర్లు అరశాతం లాభపడ్డాయి. నెల రోజుల్లో మెటల్‌ ఇండెక్స్‌ 16శాతానికి పైన క్షీణించింది. 



You may be interested

సెన్సెక్స్‌ టార్గెట్‌ 39,500..తగ్గించిన సిటీ గ్రూప్‌

Friday 2nd August 2019

మార్కెట్లు వరుస సెషన్లలో భారీ పతనాలకు గురవుతున్న నేపథ్యంలో సిటీ గ్రూప్ గ్లోబల్ మార్కెట్స్ తన మార్చి 2020 సెన్సెక్స్ టార్గెట్‌ను 41,000 స్థాయి నుంచి 39,500 కు తగ్గించింది. కార్పొరేట్ ఆదాయ వృద్ధి అంచనాలను డౌన్‌గ్రేడ్‌ చేయడానికి ఇది కారణమైంది. మార్కెట్ క్షీణత ప్రారంభమైన తర్వాత నుంచి ఇప్పటి వరకు ఏ బ్రోకరేజ్ సంస్థ కూడా సెన్సెక్స్ టార్గెట్‌ను తగ్గించలేదు. కాగా ఈ ఏడాది బడ్జెట్ (జూలై 5) లో

చమురు..భారీ పతనం

Friday 2nd August 2019

మిగిలిన 300 బిలియన్‌ డాలర్ల చైనా దిగుమతులపై ఈ సెప్టెంబర్‌ 1 నుంచి 10 శాతం సుంకాలు విధిస్తామని యుఎస్‌ అధ్యక్షుడు ట్రంప్‌ తెలపడంతో గురువారం సెషన్‌లో ముడి చమురు ధరలు భారీగా పడిపోయాయి. కాగా శుక్రవారం(అగష్టు 02) ట్రేడింగ్‌లో చమురు ధరలు పతనం నుంచి కోలుకుంటున్నాయి. బ్రెంట్ క్రూడ్‌ 2.7 శాతం పెరిగి బ్యారెల్కు 62.12 డాలర్ల వద్ద, డబ్ల్యుటిఐ క్రూడ్‌ 2.1 శాతం పెరిగి 55.10 డాలర్ల

Most from this category