News


సెప్టెంబర్‌ సీరిస్‌లో 10800- 11200 రేంజ్‌లో నిఫ్టీ!

Thursday 5th September 2019
Markets_main1567662049.png-28210

నిఫ్టీ సెప్టెంబర్‌ సీరిస్‌ మొత్తం 10800- 11200 పాయింట్ల శ్రేణిలోనే కదలాడవచ్చని టెక్నికల్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ శ్రేణిని ఛేదించడం జరిగితేనే నిఫ్టీలో తీవ్రకదలికలుంటాయని చెబుతున్నారు. ఉదాహరణకు దిగువన 10800 పాయింట్ల దిగువన వరుసగా రెండు రోజులు క్లోజయితే 10640- 10500 పాయింట్ల వరకు నిఫ్టీ దిగజారవచ్చని, ఒకవేళ 11200 పాయింట్లను దాటితే 11500- 11700 పాయింట్ల వరకు ఎగబాకవచ్చని తెలిపాపరు. ముఖ్యంగా 11150 పాయింట్లను దాటితే మంచి అప్‌మూవ్‌ ఉంటుందన్నారు. ఆప్షన్స్‌ డేటా సైతం ఇదే అంశాన్ని సూచిస్తోంది. 10800 పాయింట్ల వద్ద పుట్స్‌ అధికంగా, 11200 పాయింట్ల స్ట్రైక్‌ ప్రైస్‌ వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల ఈ రెండు స్థాయిల మధ్యనే నిఫ్టీ కదలికలు పరిమితం కావచ్చు.

ప్రస్తుతం నిఫ్టీ 50లో 13 స్టాకులు తమ 50 రోజుల డీఎంఏకు పైన, 15 స్టాకులు తమ 200 రోజుల డీఎంఏకు పైన ట్రేడవుతున్నాయి. అంటే దాదాపు అన్ని స్టాకులు తమ స్వల్పకాలిక(5, 10, 15) డీఎంఏలకు దిగువకు చేరడం మార్కెట్‌పై బేర్స్‌ పట్టు ఇంకా ఉందని సూచిస్తోంది. నిఫ్టీ  50, 100 రోజుల డీఎంఏలు 10800- 11200 పాయింట్ల మధ్యనే ఉన్నాయి. గతేడాది నవంబర్‌ నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా నిఫ్టీ 10550- 11000 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. అందువల్ల ఈ శ్రేణి మంచి మద్దతు స్థాయిగా నిలుస్తుందని అంచనా. టెక్నికల్‌ ఇండికేటర్లలో ఆర్‌ఎస్‌ఐ నెగిటివ్‌గా ఉంది. 



You may be interested

లాభాల్లో ఆటో షేర్లు..టాటామోటర్స్‌ 5 శాతం అప్‌

Thursday 5th September 2019

యుఎస్‌-చైనా మధ్య మరో రౌండ్‌ వాణిజ్య చర్చలు అక్టోబర్‌ నెల ప్రారంభంలో జరగనున్నాయని చైనా వాణిజ్య మంత్రి ప్రకటించడంతో గురువారం అంతర్జాతీయ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. అంతేకాకుండా దేశియ బెంచ్‌మార్క్‌ సూచీలు పాజిటివ్‌గా ట్రేడవుతుండడంతో ఉదయం 11.34 సమయానికి నిఫ్టీ ఆటో ఇండెక్స్‌ 1.68 శాతం లాభపడి 6,896.10 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో హెవివెయిట్‌ షేర్లయిన  మారుతి సుజుకీ 1.43 శాతం లాభపడి రూ. 5,914.00 వద్ద,

పసిడి ర్యాలీకి బ్రేక్‌..!

Thursday 5th September 2019

అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చల అంశంపై స్పష్టత రావడంతో ప్రపంచ మార్కెట్లో పసిడి ధర గురువారం దిగివస్తుంది. ఆసియాలో నేటి ఉదయం ఔన్స్‌ పసిడి ధర 10డాలర్ల మేర నష్టపోయి 1,553.80 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అక్టోబర్ మొదట్లో ఉన్నత స్థాయి చర్చలకు సన్నాహకంగా తమ వాణిజ్య బృందం సెప్టెంబర్ మధ్యలో యుఎస్ వాణిజ్య అధికారలతో చర్చలు జరుపుతుందని చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ గురువారం ప్రకటించింది.

Most from this category