News


వచ్చే మార్చికల్లా 13500కు నిఫ్టీ!

Thursday 5th March 2020
Markets_main1583402866.png-32306

కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ చర్యలతో కరోనాకు చెక్‌
విదేశీ పెట్టుబడులకు ధీటుగా దేశీ సిప్స్‌
కొటక్‌ సెక్యూరిటీస్‌ తాజా అంచనా


ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్‌ ప్రభావంతో దేశీ స్టాక్‌ మార్కెట్లు సైతం​మరింత బలహీనపడే వీలున్నట్లు బ్రోకింగ్‌ సంస్థ కొటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేస్తోంది. అయితే వైరస్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలతో మార్కెట్లు బాటమవుట్‌ అయ్యే అవకాశమున్నదని అభిప్రాయపడింది. కొటక్‌ సెక్యూరిటీస్‌ నివేదికలోని ఇతర అంశాలు చూద్దాం..

చైనాలో పుట్టి ఇతర దేశాలకూ పాకుతున్న కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు పతనమయ్యాయి. ఈ బాటలో దేశీ మార్కెట్లు సైతం గత వారం డీలాపడ్డాయి. అంతర్జాతీయ స్థాయిలో కరోనా ప్రభావం తగ్గేవరకూ మార్కెట్లలో బలహీన ధోరణి కొనసాగే వీలుంది. తాజాగా దేశీయంగానూ కరోనా కేసులు నమోదవుతుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నాయి. అయితే మార్కెట్లు కొంతమేర పతనం తదుపరి బాటమవుట్‌ అవుతాయి. కరోనా ప్రభావాన్ని అడ్డుకునేందుకు అటు కేంద్ర బ్యాంకులు, ఇటు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. తద్వారా గ్లోబల్‌ ఎకానమీ రికవరీ సాధించేందుకు మార్గమేర్పడుతుంది. ఇప్పటికే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అర శాతం వడ్డీ రేట్లను తగ్గించింది. ఇకపై యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లండ్‌ తదితరాలు సైతం చర్యలు తీసుకోనున్నాయి. రానున్న కాలంలో దేశీ ప్రభుత్వంతోపాటు.. ఆర్‌బీఐ సైతం తగిన విధానాలు అవలంబించే అవకాశముంది.

ఎఫ్‌పీఐల యూటర్న్‌
కేంద్ర బ్యాంకుల వడ్డీ రేట్ల కోతలు, లిక్విడిటీ కారణంగా వర్ధమాన మార్కెట్లలోకి మరిన్ని విదేశీ పెట్టుబడులు వచ్చే వీలుంది. అయితే కరోనా నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు తరలిపోయినప్పటికీ దేశీయంగా సిప్‌(SIP) పెట్టుబడులు ఈక్విటీ మార్కెట్లను ఆదుకునే అవకాశముంది. కరోనా వ్యాప్తితో ఇటీవల ఎఫ్‌ఐఐలు గత ఏడు రోజుల్లోనే రూ. 16,000 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించారు. కాగా.. సమీప కాలంలో ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీకి 11,000, 10,500 పాయింట్ల స్థాయిలో పటిష్ట మద్దతు లభించవచ్చు. రికవరీ ఏర్పడితే.. వచ్చే మార్చికల్లా నిఫ్టీ 13,000-13,500 పాయింట్ల స్థాయిని అందుకునే అవకాశముంది. ఇప్పటికే గరిష్టం నుంచి నిఫ్టీ 10 శాతం పతనమైంది. దీంతో 6 శాతం డౌన్‌సైడ్‌ రిస్కును అంచనా వేస్తున్నాం. బాండ్ల ఈల్డ్స్‌ నీరసించడం కూడా ఈక్విటీలకు మద్దతునివ్వగలదని భావిస్తున్నాం.



You may be interested

ఈపీఎఫ్‌ వడ్డీ రేట్లు తగ్గాయ్‌!

Thursday 5th March 2020

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌(ఈపీఎఫ్‌) ఖాతాదారులకు వడ్డీరేటును తగ్గించినట్లు చేదు వార్త చెప్పింది. ఒకేసారి 15 బేసిస్‌ పాయింట్లు తగ్గించడంతో ఖాతాదారులకు వచ్చే వడ్డీ తగ్గనుంది. ప్రస్తుతం 8.65 శాతంగా ఉన్న వడ్డీ రేటును 8.50 శాతానికి తగ్గిస్తూ ఈపీఎఫ్‌ఓకు చెందిన సెంట్రల్‌​ బోర్డ్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ కుమార్‌ గంగ్వార్‌ వెల్లడించారు. తాజాగా తగ్గించిన వడ్డీ ఈ ఆర్థిక సంవత్సరం అమలులో

ఏడాది కాలానికి ఈ షేర్లు కొనొచ్చు

Thursday 5th March 2020

వివిధ బ్రోకరేజ్‌ సంస్థ నుంచి ఏడాది కాలానికి టాప్‌-5 రికమెండేషన్లు ఇవి..! 1.బ్రోకరేజ్‌ సంస్థ: ఎమ్‌కే రికమెండేషన్స్‌ షేరు పేరు: గెయిల్‌ రేటింగ్‌: కొనొచ్చు టార్గెట్‌ ధర: రూ.160 కాలపరిమితి: ఏడాది  విశ్లేషణ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందవచ్చు. ఎంఏటీ క్రిడెట్స్‌, ఇతర ప్రయోజనాల కారణంగా 2019-20 ఆర్థిక సంవత్సరంలో కార్పొరేట్‌ ‌పన్ను తగ్గింపు ప్రయోజనాన్ని పొందలేకపోయింది. కరోనా వైరస్‌ వ్యాధి వ్యాప్తి కారణంగా క్రూడాయిల్‌ ధరలు ధీర్ఘాకాలికంగా కొనసాగినట్లైతే... స్వల్పకాలం పాటు ఆదాయాలు

Most from this category