News


బడ్జెట్‌లోపు నిఫ్టీ 13,000 పాయింట్లకు!

Wednesday 25th December 2019
Markets_main1577263666.png-30429

బుల్లిష్‌ ధోరణి కొనసాగే వీలుంది
ట్రేడింగ్‌ బెల్స్‌ సీఈవో అమిత్‌ గుప్తా అంచనా

ప్రస్తుతం దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట బుల్‌రన్‌ కనిపిస్తోంది. సాంకేతికంగా ఈ బుల్లిష్‌ ధోరణి ఇకపైనా కొనసాగే అవకాశముందంటున్నారు ట్రేడింగ్‌బెల్స్‌ సహవ్యవస్థాపకులు, సీఈవో అమిత్‌ గుప్తా. ఒక ఆంగ్లఛానల్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో నిఫ్టీ కదలికలపై బుల్లిష్‌ అంచనాలు ప్రకటించారు. వివరాలు......

కన్సాలిడేషన్‌
దేశీ స్టాక్‌ మార్కెట్లలో పటిష్ట బుల్లిష్‌ మొమెంటమ్‌ నెలకొని ఉంది. దీంతో బడ్జెట్‌ కంటే ముందుగానే  ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ 13,000 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. సమీప కాలంలో నిఫ్టీకి 12350-12500 పాయింట్ల వద్ద నిఫ్టీకి రెసిస్టెన్స్‌ కనిపించవచ్చు. ఇదే విధంగా 12150-12050 వద్ద మద్దతు(సపోర్ట్‌) లభించే సంకేతాలున్నాయి. 2019 ముగియనున్న నేపథ్యంలో వచ్చే వారం కొంతమేర కన్సాలిడేషన్‌కు అవకాశముంది. క్రిస్మస్‌, కొత్త ఏడాది సెలవుల సందర్భంగా విదేశీ పెట్టుబడులు మందగించవచ్చు. అయితే మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌లో కొంతమేర యాక్టివిటీ కనిపించే వీలుంది.

ర్యాలీ పరిమితమే
ప్రస్తుతం కొన్ని కౌంటర్లకే పరిమితమై మార్కెట్లలో ర్యాలీ కొనసాగుతోంది. ఆయా రంగాలలో మార్కెట్‌ లీడర్లయిన కౌంటర్లలోకే పెట్టుబడులు ప్రవహిస్తున్నాయి. ఆర్థిక వ్యవస్థ మందగమనంలోనూ ఈ కంపెనీలు పటిష్ట పనితీరును చూపగలవన్న అంచనాలు దీనికి కారణంకాగా.. ఈ ట్రెండ్‌ గురించి ఆందోళన చెందాల్సిన అవసరంలేదు. ఈ ధోరణి నుంచి మార్కెట్‌ బయటపడే అవకాశముంది. ఆర్థిక మందగమన ఆందోళనలు ఉపశమించే పరిస్థితులు నెలకొన్నప్పుడు ర్యాలీ ఇతర కౌంటర్లకూ పాకే వీలుంది. ఈ ట్రెండ్‌ కొంతవరకూ గత వారాంతాన కనిపించింది కూడా. ప్రధానంగా బ్లూచిప్‌ కంపెనీలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఎల్‌అండ్‌టీ, మారుతీ సుజుకీ ఇండెక్సులకు జోష్‌నిస్తున్నాయి. ఈ కౌంటర్లు కరెక‌్షన్‌కు లోనైనప్పుడు వీటిలో పెట్టుబడి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు.You may be interested

వచ్చే డిసెంబర్‌కల్లా 1620 డాలర్లస్థాయికి పసిడి

Wednesday 25th December 2019

వచ్చే ఏడాదిలో పసిడి ధర 1600 డాలర్ల పైన ట్రేడ్‌ అయ్యే అవకాశం ఏఎన్‌జెడ్‌ బ్యాంకింగ్‌ గ్రూప్‌ తన నివేదికలో తెలిపింది. ఈ ఏడాది మాదిరిగానే 2020లో పసిడి అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తుందని, ఇతర విలువైన కమోడిటీల కంటే 2020లో ఎక్కువ లాభాల్ని ఇన్వెస్టర్లకు పంచుతుందని బ్యాంకింగ్‌ గ్రూప్‌ అభిప్రాయపడింది. వచ్చే ప్రారంభం నుంచి పసిడి ధర క్రమంగా పెరుగుతూ ఏడాది చివరి నెల డిసెంబర్‌ నాటికి 1620 డాలర్ల

నేడు మార్కెట్లకు సెలవు

Wednesday 25th December 2019

 క్రిస్మస్‌ సందర్భంగా బుధవారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు. హోల్‌సేల్‌ కమోడిటీ, మెటల్‌, బులియన్‌ మార్కెట్లు పనిచేయవు. అలాగే ఫారెక్స్‌ మార్కెట్‌, కమోడిటీ ఎక్స్‌ఛేంజ్‌లకు కూడా నేడు సెలవు దినం. భారత ఆర్థిక వ్యవస్థ మందగమన ప్రభావం తీవ్రంగానే ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి(ఐఎమ్‌ఎఫ్‌) హెచ్చరించడంతో స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ బలహీనపడటం, ముడి చమురు ధరలు స్వల్పంగా పెరగడం లాంటి అంశాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.

Most from this category