News


నిఫ్టీ ర్యాలీ ఎక్కడి వరకు..?

Thursday 28th November 2019
Markets_main1574963480.png-29935

మూడు వారాల కన్సాలిడేషన్‌ అనంతరం ఈ వారం మార్కెట్లు నూతన గరిష్టాలకు దూసుకెళ్లాయి. నిఫ్టీ 12,159 పాయింట్ల చారిత్రక స్థాయిని నమోదు చేసింది. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఒప్పందానికి అవకాశాలు బలపడడం, ఎఫ్‌ఐఐల పెట్టుబడులు మార్కెట్ల ర్యాలీకి దోహద పడుతున్నాయి. మూడు వారాల కన్సాలిడేషన్‌ (స్థిరీకరణ) అనంతరం బ్రేకవుట్‌ కావడంతో నిఫ్టీ టార్గెట్‌ను రానున్న నెలలకు 12,400గా సవరిస్తున్నట్టు ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. 

 

‘‘ప్రభుత్వం కార్పొరేట్‌ పన్ను తగ్గింపు తర్వాత.. సెప్టెంబర్‌ 20 నుంచి నిఫ్టీ-50సూచీ 13 శాతానికి పైగా ర్యాలీ చేసింది. సెప్టెంబర్‌ నుంచి టెక్నికల్‌ చార్ట్‌లను పరిశీలించినా కానీ.. వరుసగా మూడో నెలలోనూ నెలవారీ చార్ట్‌లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు దిశగా సాగుతోంది. ఇకపై నిఫ్టీ కీలక మద్దతు స్థాయి 11,800-11,700ని కోల్పోకపోవచ్చు’’ అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ వివరించింది. నాణ్యమైన స్టాక్స్‌పై దృష్టి పెట్టాలని సూచించింది. మెటల్స్‌, ఇన్‌ఫ్రా, ఫార్మా, క్యాపిటల్‌ గూడ్స్‌ స్టాక్స్‌ మంచి కొనుగోలు అవకాశాలుగా పేర్కొంది. అలాగే, బ్యాంకులు, టెలికం, రియాలిటీ రంగాలు కూడా మంచి పనితీరు చూపిస్తాయని అంచనా వేసింది. రానున్న రోజుల్లో ఇండెక్స్‌తో పోలిస్తే తక్కువ పనితీరు ఐటీ రంగంలోనే ఉండొచ్చని పేర్కొంది.

 

రానున్న నెలల్లో బెంచ్‌మార్క్‌తో పోలిస్తే మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ మంచి పనితీరు చూపిస్తాయని ఐసీఐసీఐ డైరెక్ట్‌ పేర్కొంది. ‘‘మిడ్‌క్యాప్‌ సూచీ 200 రోజుల ఎస్‌ఎంఏ 16,840 వద్ద ఉంది. దీర్ఘకాలిక ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌ 17,150 వద్ద ఉంది. ఈ ఫాలింగ్‌ ట్రెండ్‌లైన్‌ బ్రేకవుట్‌ నమోదైతే తదుపరి అప్‌మూవ్‌(సుమారు 8 శాతం)కు తలుపులు తెరుచుకున్నట్టే’’అని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. నిఫ్టీ బ్యాంక్‌ సూచీ కూడా రానున్న రోజుల్లో 33,000 దిశగా ర్యాలీ చేస్తుందని అంచనా వేసింది. నెలవారీ చార్ట్‌లో గరిష్టంలో కనిష్టాలను నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నామని, కీలకమైన మద్దతు స్థాయి 30,000-30,300ను స్వల్పకాలంలో కోల్పోకపోవచ్చని ఐసీఐసీఐ డైరెక్ట్‌ తెలిపింది. 



You may be interested

రిలయన్స్‌ @ రూ.10 లక్షల కోట్లు

Friday 29th November 2019

ఈ స్థాయి విలువ సాధించిన తొలి కంపెనీ ఇంట్రాడేలో జీవిత కాల గరిష్ట స్థాయికి చేరిన షేరు  జియో, రిటైల్‌ విభాగాల జోరు  (అప్‌డేట్‌...) న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ గురువారం మరో అరుదైన ఘనతను సాధించింది. ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.10 లక్షల కోట్లకు చేరింది. ఈ స్థాయి మార్కెట్‌ క్యాప్‌ సాధించిన తొలి, ఏకైక భారత కంపెనీగా నిలిచింది. ఇంట్రాడేలో ఆల్‌టైమ్‌ హై, రూ.1,584ను తాకిన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేర్‌ చివరకు 0.6

ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ ఐపీవో.. ముఖ్యమైన వివరాలు..

Thursday 28th November 2019

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌కు చెందిన సబ్సిడరీ.. ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంకు (ఉజ్జీవన్‌ ఎస్‌ఎఫ్‌బీ) ఐపీవో సోమవారం (డిసెంబర్‌ 2న) ప్రారంభం కానుంది. 4వ తేదీన ఇష్యూ ముగుస్తుంది. రూ.750 కోట్లను ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ ద్వారా సమీకరించనుంది. ఒక్కో షేరు ధరల శ్రేణిని రూ.36-37గా కంపెనీ ఖరారు చేసింది. ఒక రిటైల్‌ ఇన్వెస్టర్‌ కనీసం 400 షేర్లకు (ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక లాట్‌

Most from this category