News


ఈవారంలో 12200పాయింట్లకు నిఫ్టీ!

Monday 16th December 2019
Markets_main1576470358.png-30244

నిపుణుల అంచనా
నిఫ్టీ వీక్లీ చార్టుల్లో లోయర్‌ షాడోతో కూడిన పొడవైన బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ పాట్రన్‌ ఏర్పడిన అనంతరం వెంటనే ఈ బుల్లిష్‌ కాండిల్‌ ఏర్పడడం పాజిటివ్‌ సంకేతంగా నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇలాంటి ఫార్మేషన్‌ స్వల్పకాలిక అప్‌ట్రెండ్‌కు సంకేతంగా చెబుతున్నారు. నిఫ్టీ 12158 పాయింట్లపైన స్థిరంగా కొనసాగితే నెగిటివ్‌ లక్షణాలు పోతాయని అభిప్రాయపడుతున్నారు. ఈ వారం నిఫ్టీ 12150- 12200 పాయింట్లను చేరవచ్చని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజు చెప్పారు. ఆ స్థాయిల వద్ద అమ్మకాల ఒత్తిడి ఎదురుకావచ్చన్నారు. నిఫ్టీ ఆప్షన్స్‌ చూస్తే ఈ వారానికి 11950- 12250 పాయింట్ల రేంజ్‌లో కొనసాగే అవకాశాలున్నాయని తెలిపారు. ఒకసారి నూతన గరిష్ఠం చేరాక కన్సాలిడేషన్‌ లేదా కరెక‌్షన్‌ రావచ్చన్నారు.

ఎఫ్‌ఐఐలు పొజిషన్లు తీసుకోవడం, 12వేల పాయింట్ల వద్ద భారీ పుట్‌ రైటింగ్‌, ఐవీ తక్కువగా ఉండడం తదితర కారణాలు అప్‌మూవ్‌కు సంకేతాలని చెప్పారు. నిఫ్టీ డిసెంబర్‌ 19 ఆప్షన్‌ డేటా చూస్తే 11956 పాయింట్ల దిగువకు వచ్చే అవకాశాలు చాలా స్వల్పంగా ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 12244 పాయింట్లను దాటితే నిఫ్టీలో పెద్ద అప్‌మూవ్‌ ఉండొచ్చన్నారు. నిఫ్టీలో 12000, 12100 పాయింట్ల వద్ద షార్ట్‌కవరింగ్‌ కారణంగా కొత్త గరిష్ఠాన్ని చేరవచ్చని, తదుపరి కన్సాలిడేషన్‌ ఉండొచ్చని మోతీలాల్‌ఓస్వాల్‌ ప్రతినిధి చందన్‌ తపారియా చెప్పారు. ఈ వారానికి 12023, 12098, 12115 పాయింట్లు కీలకంగా వ్యవహరించనున్నాయి. 



You may be interested

ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు

Monday 16th December 2019

ట్రేడింగ్‌ ప్రారంభంలో ఐటీ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుంది. ఐటీ షేర్ల మద్దతుతోనే సెన్సెక్స్‌ ఇండెక్స్‌ కొత్త ఆల్‌టైం హైని తాకింది. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ 15,263.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. స్టాక్‌ మార్కెట్‌ ప్రభావానికి ముందు ఫారెక్స్‌ మార్కెట్లో నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ శుక్రవారం ముగింపు(70.81)తో పోలిస్తే 6పైసల బలపడి 70.75 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ఐటీరంగానికి చెందిన

ప్రారంభంలో సెన్సెక్స్‌ కొత్త రికార్డు

Monday 16th December 2019

బీఎస్‌ఈ సెన్సెక్స్‌ సోమవారం ప్రారంభంలోనే 159 పాయింట్లు జంప్‌చేసి 41,168 పాయింట్ల వద్ద కొత్త రికార్డును సృష్టించింది. నవంబర్‌ 28 నాటి 41,164 పాయింట్ల స్థాయిని అధిగమించడం ద్వారా సెన్సెక్స్‌ ఈ ఫీట్‌ సాధించింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 45 పాయింట్ల గ్యాప్‌అప్‌తో 12,131 పాయింట్ల వద్ద మొదలయ్యింది. నిఫ్టీ కొత్త రికార్డును నెలకొల్పాలంటే 12,158 పాయింట్ల స్థాయిని దాటాల్సివుంటుంది. 

Most from this category