News


అక్టోబర్‌లో 12వేలకు నిఫ్టీ?!

Monday 30th September 2019
Markets_main1569840277.png-28633

వారం క్రితం అనూహ్య ర్యాలీ అనంతరం నిఫ్టీ కన్సాలిడేషన్‌ మూడ్‌లోకి వెళ్లింది. వీక్లీ చార్టుల్లో డోజి క్యాండిల్‌ ఏర్పడడం మార్కెట్లో అస్పష్టతకు సంకేతం. గతవారం నిఫ్టీ ముగింపు అంతకుముందు పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయికి పైన జరిగింది. అందువల్ల సూచీల్లో ఇకముందు కూడా బలం కనిపించవచ్చని నిపుణులు భావిస్తున్నారు. చార్టుల్లో హయ్యర్‌టాప్‌, బాటమ్‌ ఏర్పరచడం కూడా ఇందుకు సంకేతంగా చెబుతున్నారు. ప్రస్తుత ప్యాట్రన్‌ ప్రకారం నిఫ్టీ 11620 పాయింట్ల పైన ముగిస్తే క్రమంగా ఈ నెల చివరి నాటికి 12వేల పాయింట్లను చూడవచ్చని అంచనా వేస్తున్నారు. కానీ నిఫ్టీ 11400 పాయింట్ల మద్దతును నిలబెట్టుకోలేకపోతే మాత్రం మరో మారు ప్రాఫిట్‌ బుకింగ్‌ జరిగి క్రమంగా 11250 పాయింట్ల వరకు దిగజారే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుతం నిఫ్టీ తన స్వల్పకాలిక డీఎంఏలకు పైన కదలాడుతోంది. ఈ కన్సాలిడేషన్‌ రేంజ్‌ను దిగువకు బ్రేక్‌ చేస్తే తాజా పాజిటివ్‌ లక్షణాలు కనుమరుగవుతాయి. ఈవారానికి నిఫ్టీ 11300- 11800 రేంజ్‌లో కదలాడవచ్చని అంచనా. ఆప్షన్‌డేటా చూస్తే 11600, 11700 వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఈ రెండిటి వద్ద కాల్‌రైటింగ్‌ కూడా ఎక్కువగా కనిపిస్తోంది. దిగువన 11500, 11000 పాయింట్ల వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. 
బ్యాంకు నిఫ్టీ...
గతవారం మొత్తం బ్యాంకు నిఫ్టీ స్వల్ప రేంజ్‌లో కన్సాలిడేట్‌ అయింది. వీక్లీ చార్టుల్లో లాంగ్‌ లెగ్‌ డోజీ క్యాండిల్‌ ఏర్పరిచింది. హయ్యర్‌టాప్‌, బాటమ్‌ ఏర్పరుస్తూ ఉండడం మాత్రం ఇంకా పాజిటివ్‌ లక్షణానికి నిదర్శనంగా నిపుణులు భావిస్తున్నారు. బ్యాంకు నిఫ్టీ బలం పుంజుకొని 30400 పాయింట్లపైన బలంగా ముగిస్తే క్రమంగా 31000 పాయింట్ల వరకు ర్యాలీ చేయవచ్చు. దిగువన 29400 పాయింట్లను కాపాడుకోలేకపోతే క్రమంగా 28500 పాయింట్ల వరకు పతనం ఉండొచ్చు. ఈవారానికి బ్యాంకు నిఫ్టీ 29000- 30850 పాయింట్ల రేంజ్‌లో కదలాడవచ్చని అంచనా. 

 



You may be interested

మిడ్‌క్యాప్స్‌ ప్రదర్శన ఆరంభమవుతుంది!

Monday 30th September 2019

సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా బుల్‌మార్కెట్‌ తొలిదశలో టాప్‌ క్వాలిటీ ఉన్న బ్లుచిప్‌ స్టాకులు ముందుకు కదులుతాయని, తద్వారా బుల్లిష్‌ సెంటిమెంట్‌ విస్తరించి మిడ్‌, స్మాల్‌క్యాప్స్‌ సైతం పాజిటివ్‌ వాతావరణంలోకి వస్తాయని సామ్‌కో సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ ఉమేశ్‌ మెహతా చెప్పారు. బుల్‌మార్కెట్‌ కొంతగడిచిన తర్వాత పెద్ద స్టాకులు ఖరీదైనవిగా మారతాయని, దీంతో ఇన్వెస్టర్లు చిన్న స్టాకులపై దృష్టి పెడతారని చెప్పారు. బుల్‌మార్కెట్‌ మంచి దశకు చేరేటప్పటికి మిడ్‌క్యాప్స్‌

పీఎంసీ స్కామ్‌.. 2008లోనే బీజాలు!!

Monday 30th September 2019

పంజాబ్‌ మహరాష్ట్ర కోఆపరేటివ్‌ బ్యాంక్‌(పీఎంసీ)లో తాజాగా వెలుగు చూసిన కుంభకోణం ఆర్‌బీఐ ఊహించినదానికన్నా చాలా లోతైనదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. దీనికి బీజాలు 2008లోనే పడ్డాయని చెబుతున్నారు. ఆ సమయంలో హెచ్‌డీఐఎల్‌ను ఆదుకునేందుకు బ్యాంకు అధికారులే పలు అకౌంట్లను సృష్టించారని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించినట్లు ఎకనమిక్‌ టైమ్స్‌ తెలిపింది. బ్యాంకు మొత్తం రుణాల్లో దాదాపు 73 శాతం రుణాలను కేవలం ఒక్క కంపెనీ(హెచ్‌డీఐఎల్‌)కు మంజూరు చేయడం బయటపడడంతో

Most from this category