News


ఆందోళనలకు త్వరలో చెక్‌- నిఫ్టీ రీబౌండ్‌

Wednesday 4th March 2020
Markets_main1583300271.png-32266

కరోనా వైరస్‌ వ్యాప్తితో ఇన్వెస్టర్లలో పెరిగిన ఆందోళనలు
నెల రోజుల్లో 15 శాతం పతనమైన ప్రపంచ మార్కెట్లు
నెల- రెండు నెలల్లో మార్కెట్లు రికవరీ బాట పట్టే చాన్స్‌
ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ అంచనాలు

చైనాలో పుట్టినప్పటికీ కొవిడ్‌-19.. ప్రపంచాన్ని వణికిస్తుండటంతో ఇన్వెస్టర్లలో ఆందోళనలు పెరుగుతున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ పేర్కొంది. ఇది ఎంతవరకూ ప్రభావం చూపుతుందన్న అంశంపై అంచనాలు లేకపోవడంతో ఇన్వెస్టర్లు భయాలకు లోనవుతున్నట్లు ఒక నివేదికలో తెలియజేసింది. అయితే దేశీయంగా రెండు లేదా మూడు నెలల్లోనే పరిస్థితులు సర్దుకునే వీలున్నట్లు అభిప్రాయపడింది. నివేదికలోని ఇతర అంశాలను చూద్దాం.. 

గతంలో సైతం
కరోనా వైరస్‌ భయాలతో అభివృద్ధి చెందిన మార్కెట్లతోపాటు వర్ధమాన దేశాలలోనూ ఈక్విటీలు నెల రోజుల్లో 15 శాతం పతనమయ్యాయి. దీంతో హెచ్చుతగ్గులను సూచించే వొలాటిలిటీ ఇండెక్సులు ఇటీవల కొన్నేళ్ల గరిష్టాలకు చేరాయి. అయితే గతంలో ఎదురైన విపత్కర పరిస్థితులు, మార్కెట్ల ట్రెండ్‌ను పరిశీలిస్తే.. దేశీయంగా రెండు, మూడు నెలల్లోనే మార్కెట్లు రీబౌండ్‌ అయ్యే వీలుంది. గత దశాబ్ద కాలంలో తలెత్తిన 9 రకాల ఆందోళనకర పరిస్థితులను పరిగణిస్తే.. ఆరు సందర్భాలలో రెండు నెలల్లోనే మార్కెట్లు బౌన్స్‌బ్యాక్‌ సాధించాయి. సమస్యాత్మక వాతావరణంలో సగటున 11-13 శాతం పతనమయ్యాక ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇండెక్స్‌ నిఫ్టీ బాటమవుట్‌ అవుతూ వస్తోంది. మిగిలిన మూడు సందర్భాలలో నిఫ్టీ సగటున 17 శాతం క్షీణించాక.. నాలుగు, ఐదు నెలల్లో రికవరీ బాట పట్టింది.

2015 తదుపరి
2015 తదుపరి మార్కెట్లు 10 శాతం హెచ్చుతగ్గుల మధ్యే కదులుతూ వచ్చాయి. అయితే ఇటీవల తిరిగి 25 శాతం ఆటుపోట్లను చవిచూస్తున్నాయి. వొలాటిలిటీ 30 శాతం స్థాయికి చేరాక తగ్గుముఖం పట్టవచ్చు. ఇది మార్కెట్లకు బాటమ్‌గా భావించవచ్చు. 2011 జులైలో నిఫ్టీ.. 5740 పాయింట్ల గరిష్టం నుంచి డిసెంబర్‌కల్లా 4531కు నీరసించింది. ఇది 21 శాతం పతనంకాగా.. ఇందుకు 5 నెలల కాలం పట్టింది. 2013 మే -సెప్టెంబర్‌ మధ్య 18 శాతం వెనకడుగు వేసింది. తద్వారా 4 నెలలు తీసుకుంది. తదుపరి 2015 ఆగస్ట్‌- సెప్టెంబర్‌ మధ్య 13 శాతం నష్టపోయింది. తద్వారా నెల రోజుల్లోనే సర్దుకుంది. ఈ బాటలో 2016 జనవరి- ఫిబ్రవరి మధ్య 14 శాతం, 2016 సెప్టెంబర్‌- డిసెంబర్‌ మధ్య 12 శాతం, 2018 పిబ్రవరి-ఏప్రిల్‌ మధ్య 11 శాతం చొప్పున నిఫ్టీ క్షీణించింది. ఇదే విధంగా 2018 సెప్టెంబర్‌- అక్టోబర్‌ మధ్య నిఫ్టీ 15 శాతం పతనంకాగా.. 2019 జూన్‌- ఆగస్ట్‌ మధ్య 12 శాతం, 2020 జనవరి-ఫిబ్రవరి మధ్య 10 శాతం నీరసించింది. 2011లో యూరోపియన్‌ రుణ సంక్షోభం, 2015లో చైనా కరెన్సీ విలువ తగ్గింపు, 2016లో చమురు ధరల పతనం, డీమానిటైజేషన్‌, 2018లో అమెరికా, చైనా వాణిజ్య వివాదాలు వంటి పలు అంశాలు మార్కెట్లలో అమ్మకాలకు కారణమయ్యాయి.

10,800 వద్ద సపోర్ట్‌
ప్రస్తుతం కొవిడ్‌-19 ఆందోళనలతో నిఫ్టీ 10 శాతం తిరోగమించింది. 10,800 పాయింట్ల స్థాయిలో నిఫ్టీకి మద్దతు లభించవలసి ఉన్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ రీసెర్చ్‌ పంకజ్‌ పాండే అంచనా వేస్తున్నారు. లేదంటే తదుపరి 10,400 స్థాయిలో నిలకడను సాధించే వీలున్నట్లు పాండే భావిస్తున్నారు. 
 You may be interested

ఈ స్టాక్స్‌.. టెక్నికల్‌ బయ్స్‌

Wednesday 4th March 2020

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్‌ రిజర్వ్‌ అత్యవసర ప్రాతిపదికన వడ్డీ రేట్లను తగ్గించింది. ఫండ్స్‌ రేట్లలో 0.5 శాతం కోత పెట్టింది. అయినప్పటికీ మంగళవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు 3 శాతం పతనమయ్యాయి. మరోపక్క చైనా, జపాన్‌, యూరోపియన్‌ దేశాల కేంద్ర బ్యాంకులు, జీ7 దేశాల ఆర్థిక మంత్రులు సైతం కరోనాపై యుద్ధానికి సన్నద్ధతను వ్యక్తం చేశారు. అయితే గతంలోలేని విధంగా

నేటి వార్తల్లోని షేర్లు

Wednesday 4th March 2020

వివిధ వార్తలకు అనుగుణంగా బుధవారం స్టాక్‌ మార్కెట్లో ప్రభావితమయ్యే షేర్లు  ఎన్‌బీసీసీ: జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ను సొంతం చేసుకునేందుకు ఎన్‌బీసీసీ తీర్మానం చేసిన ప్రణాలికను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌ ఆమోదించింది. జేపీ ఇన్‌ఫ్రాటెక్‌ మాతృ సంస్థ జయప్రకాశ్‌ అసోసియేట్స్‌ సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేసిన రూ.750 కోట్లు తీర్మాన ప్రణాళికలో భాగంగా ఉండాలని ఆదేశించింది. యునైటెడ్‌ బ్రూవరీస్‌: విజయ్‌ మాల్యా చెల్లించాల్సిన మొత్తంలో  కొంత మేర రికవరీ చేసేందుకు యూనైటెడ్‌ బ్రూవరీస్‌లో 2.8

Most from this category