News


12,000 స్థాయికి నిఫ్టీ, టాప్‌ స్టాక్‌ సిఫార్సులు!

Saturday 19th October 2019
Markets_main1571463053.png-29001

-కొటక్‌ సెక్యురిటీస్‌, శ్రీకాంత్‌ చౌహాన్‌
తాజాగా మార్కెట్‌ పరిస్థితులను గమనిస్తే నిఫ్టీ 11,800, 12,000 స్థాయిల వద్ద గరిష్ఠాలను ఏర్పరిచే అవకాశాలు అధికంగా ఉన్నాయని కోటక్‌ సెక్యురిటీస్‌, సాంకేతిక విశ్లేషకులు, సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ శ్రీకాంత్‌ చౌహాన్‌ ఓ ఆంగ్ల చానెల్‌కిచ్చిన ఇంటర్యూలో అన్నారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లో..
మార్కెట్‌లో బుల్లిష్‌ ట్రెండ్‌ కొనసాగుతుంది...
గరిష్ఠ స్థాయిలయిన 12,103, 11,981, 11, 695 స్థాయిలను కలుపుతున్న ‘పడుతున్న ట్రెండ్‌ లైన్‌’ను తాజాగా నిఫ్టీ క్రాస్‌ చేసింది. ఈ బ్రేక్‌ఔట్‌ పద్ధతి మార్కెట్‌పై సానుకూలంగా పనిచేస్తుంది. తాజాగా నిఫ్టీ చేస్తున్న ర్యాలీలను చూస్తే, నిఫ్టీ 11,800, 12,000 వద్ద కొత్త గరిష్ఠాలను ఏర్పరుస్తుందనే అంచనాలు పెరిగాయి. ‘పడిపోయినప్పడు కొనుగోలు చేయడం’ అనేది మా స్వష్టమైన వ్యూహం. నిఫ్టీకి 11,400, 11,200 స్థాయిలు మధ్ధతుగా పనిచేస్తాయి. ఈ స్థాయిల దగ్గర్లో నిఫ్టీని కొనుగోలు చేయవచ్చు. ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా ఉన్న సమయంలో, కేంద్ర బడ్జెట్‌ వెలువడిన రోజున నిఫ్టీ ఎగువన 11,770 స్థాయి వద్ద బేరిష్‌ గ్యాప్‌ను ఏర్పరిచింది. తాజాగా ప్రభుత్వం తీసుకున్న పన్ను సంస్కరణలు, ఎఫ్‌ఐఐ(విదేశి సంస్థాగత ఇన్వెస్టర్లు), డీఐఐ(దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్లు)ల కొనుగోళ్లు పెరడగడంతో మార్కెట్‌ సెంటిమెంట్‌ బలపడింది. ఈ సెంటిమెంట్‌ నిఫ్టీ బేరిష్‌ గ్యాప్‌ను తగ్గించాడానికి సహాయపడుతోంది. 
ఆటో, ఎఫ్‌ఎంసీజీ..
ఆటో సెక్టార్‌ పుంజుకుంటోంది. ఆటో రంగంలో పడిపోయిన ఏ హెవీ వెయిట్‌ షేర్లనైనా కొనుగోలు చేయడం మంచిది. నిఫ్టీ ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్ మూవింగ్‌ కన్జ్యుమర్‌ గూడ్స్‌) నిలకడైన ప్రదర్శనను చేస్తోంది. ఈ విభాగంలో కొనుగోలు చేయాలనుకుంటే మారికో మా టాప్‌ ఎన్నిక. బ్రెక్సిట్‌ డీల్‌ అనిశ్చితి, యుఎస్‌-చైనా ట్రేడ్‌వార్‌ వంటి అంతర్జాతీయ అంశాలు మార్కెట్‌లను ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. పన్ను సంస్కరణల వలన దేశీయంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితియార్ధంలో కార్పోరేట్‌ లాభాలు పుంజుకునే అవకాశం ఉంది. 

7%-8% రాబడులను ఇవ్వగలిగే మూడు స్టాకులు...
పేజ్‌ ఇండస్ట్రీస్‌: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ. 21,498.45; స్టాప్‌ లాస్‌: రూ. 20,550; టార్గెట్‌ ధర: రూ. 23,000; అప్‌సైడ్‌: 7 శాతం
ఈ స్టాక్‌ రూ. 17,150 స్థాయి నుంచి రూ. 8,000 లాభపడి, తాజా గరిష్ఠమైన రూ. 25,088 స్థాయిని తాకింది. ప్రస్తుతం ఈ స్టాక్‌ పతనం నుంచి 50 శాతం వరకు తిరిగి పొందింది. ఇది కీలక మద్ధతు స్థాయిగా పనిచేస్తుంది. ఈ స్టాక్‌ ప్రస్తుత స్థాయి వద్ద కొనుకోళ్లు పెరిగే అవకాశం ఉంది. ఈ స్టాక్‌ వారపు చార్టులో ట్రెండ్‌ రివర్సల్‌ నమూనా ఏర్పరిచింది. ప్రస్తుత స్థాయి నుంచి అప్‌సైడ్‌ కదిలే అవకాశం ఉందనే విషయాన్ని ఇది తెలుపుతోంది.

మారికో: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ. 391.85; స్టాప్‌ లాస్‌: రూ. 379; టార్గెట్‌ ధర: రూ. 420; అప్‌సైడ్‌: 7 శాతం
మార్కెట్‌ అనిశ్చితి సమయంలో ఎఫ్‌ఎంసీజీ షేర్లు తక్కువగా ప్రభావితమయ్యాయి. ప్రభుత్వ పన్ను సంస్కరణల వలన ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌ భారీగా లాభపడుతుంది. ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌లో మారికోపై ప్రాధాన్యతను కలిగివున్నాం. ఈ కంపెనీ స్టాక్‌ గరిష్ఠస్థాయిల వద్ద ఏకికృతమవుతోంది. అంతేకాకుండా రోజువారి చార్టులో ప్లాగ్‌ నమూనాను ఏర్పరిచింది. ఇది బుల్లిష్‌ దృక్పథాన్ని తెలుపుతోంది.

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌: కొనచ్చు; ప్రస్తుత ధర: రూ. 1,229; స్టాప్‌ లాస్‌: రూ. 1,179; టార్గెట్‌ ధర: రూ. 1,330; అప్‌సైడ్‌: 8 శాతం
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ లార్జ్‌క్యాప్‌ అయినప్పటికి, స్థిరంగా మంచి ప్రదర్శనను చేస్తోంది. నిఫ్టీ 11,700 స్థాయికి దిగువన ట్రేడవుతున్నప్పటికి, ఈ స్టాక్‌ మాత్రం రోజువారి చార్టులో ‘హయ్యర్‌ హై- హయ్యర్‌ లో’ నమూనాను ఏర్పరిచింది. ఇది స్టాక్‌ పాజిటివ్‌గా కదులుతుందనడానికి సంకేతం. ఈ స్టాక్‌ రూ. 1,084 స్థాయి నుంచి రూ. 1,280 స్థాయి వరకు ర్యాలీ చేసినప్పుడు, రూ. 1,180-1,190 స్థాయిని పొందగలిగింది. ఇది కీలకమైన మద్ధతు స్థాయిగా పనిచేస్తుంది. ఈ స్టాకును ప్రస్తుత స్థాయి వద్ద కొనుగోలు చేయడానికి ఇన్వెస్టర్లకు, ట్రేడర్లకు మంచి అవకాశం.You may be interested

ఫ్లాట్‌గా ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 19th October 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం ఫ్లాట్‌గా ముగిసింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11670.00 పాయింట్లతో పోలిస్తే అర పాయింటు నష్టంతో 11,669.50 నష్టంతో ఉంది. ఇక వచ్చేవారంలో స్టాక్‌ మార్కెట్ 4రోజులు మాత్రమే పనిచేస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో సోమవారం(21న) మార్కెట్లకు సెలవు ప్రకటించారు. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ పనిచేయవు. నిన్నటి రోజు బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 246 పాయింట్ల లాభంతో 39,298

రివర్స్‌ గేర్‌లో ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు

Saturday 19th October 2019

సెప్టెంబర్‌లో 20% తగ్గుదల న్యూఢిల్లీ: గత నెల ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) రిటైల్‌ విక్రయాలు 20.1 శాతం తగ్గినట్లు ఫెడరేషన్‌ ఆఫ్‌ ఆటోమొబైల్‌ డీలర్స్‌ అసోసియేషన్స్‌ (ఎఫ్‌ఏడీఏ) వెల్లడించింది. సెప్టెంబర్‌ అమ్మకాలు 1,57,972 యూనిట్లు కాగా, అంతక్రితం ఏడాది ఇదేకాలంలో నమోదైన 1,97,653 యూనిట్లతో పోల్చితే ఈ మేరుకు తగ్గుదల ఉన్నట్లు వివరించింది. గతంలో ఎన్నడూ లేని విధంగా పండుగల సీజన్‌ ఆఫర్లను కంపెనీలు ప్రకటించినప్పటికీ.. ఆశించిన స్థాయి ఫలితం లేకపోయిందని

Most from this category