News


12000 దాటితే 12400 పాయింట్లకు నిఫ్టీ!

Tuesday 12th November 2019
Markets_main1573539462.png-29528

నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా
నిఫ్టీ రాబోయే రోజుల్లో 12వేల పాయింట్లను బలంగా దాటితే క్రమంగా 12400 పాయింట్ల వరకు ఎగబాకుతుందని నార్నొలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ ప్రతినిధి షబ్బీర్‌ ఖయ్యూం అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ తన స్వల్ప, దీర్ఘకాలిక డీఎంఏలకు పైన ట్రేడవుతూ బుల్లిష్‌గా కనిపిస్తోందన్నారు. కానీ గరిష్ఠాల వద్ద బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడడం అప్రమత్తతను సూచిస్తోందని చెప్పారు. నిఫ్టీకి 11700 పాయింట్ల వద్ద బలమైన మద్దతుందన్నారు. ప్రస్తుతానికి ఇండికేటర్లు స్వల్ప కన్సాలిడేషన్‌, కరెక‌్షన్‌ను సూచిస్తున్నాయని, కానీ సమీప భవిష్యత్‌లో మాత్రం నిఫ్టీ ముందుకే కొనసాగుతుందని చెప్పారు. బ్యాంకునిఫ్టీ ఈ వారానికి 31200- 29500 పాయింట్ల మధ్య కదలాడవచ్చన్నారు.
స్వల్పకాలానికి మూడు షేర్లను ఆయన రికమండ్‌ చేశారు...
1. హిండాల్కో: టార్గెట్‌ రూ. 216. స్టాప్‌లాస్‌ రూ. 187. వీక్లీ చార్టుల్లో డబుల్‌ బాటమ్‌ ఏర్పరచింది. అధోముఖ వాలు రేఖను బ్రేకవుట్‌ చేసేందుకు రెడీగా ఉంది. ఎంఏసీడీలో బుల్లిష్‌ క్రాసోవర్‌ కనిపిస్తోంది.
2. సిప్లా: టార్గెట్‌ రూ. 495. స్టాప్‌లాస్‌ రూ. 435. ఇటీవలే ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్స్‌ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. అనంతర కన్సాలిడేషన్‌లో కొత్త కొనుగోళ్లకు అవకాశం ఇస్తోంది.
3. ఎంఅండ్‌ఎం: టార్గెట్‌ రూ. 620. స్టాప్‌లాస్‌ రూ. 555. ఇటీవలే స్వల్పకాలిక రేంజ్‌ నుంచి పాజిటివ్‌ బ్రేకవుట్‌ సాధించి తదుపరి ర్యాలీకి రెడీ అయింది. 

 

 



You may be interested

టాప్‌ 12 టెక్నికల్‌ సిఫార్సులు

Tuesday 12th November 2019

వివిధ బ్రోకరేజిల సాంకేతిక నిపుణులు సమీప కాలానికి గాను టాప్‌ స్టాకులను సిఫార్సు చేస్తున్నారు. అవి.. (ముస్తాఫా నదీమ్‌, సీఈఓ, ఎపిక్‌ రిసెర్చ్‌) యస్‌ బ్యాంక్‌: కొనచ్చు; టార్గెట్‌ ధర: రూ. 82; స్టాప్‌ లాస్‌: రూ. 59 కనిష్ఠ స్థాయిల నుంచి ర్యాలీ చేశాక, ప్రస్తుతం ఈ స్టాక్‌ కన్సాలిడేషన్‌ దశలో ఉంది. ఈ షేరు ధర అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో 50 రోజుల చలన సగటు(డీఎంఏ) కంటే పైన ముగిసింది. ఇది ఈ

మరింత తగ్గిన పసిడి

Tuesday 12th November 2019

అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్ల ధర మంగళవారం 3నెలల కనిష్టం వద్ద ట్రేడ్‌ అవుతోంది. నేడు ఆసియాలో ట్రేడింగ్‌లో ఔన్స్‌ పసిడి ధర అరడాలరు స్వల్ప నష్టంతో 1,456.80 డాలరు వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనాతో వాణిజ్య చర్చల్లో భాగంగా తొలి దశ ఒప్పందంపై ట్రంప్‌ స్పష్టమైన వైఖరి కోసం ఇన్వెస్టర్లు ఎదురుచూస్తున్నారు. అయితే హాంగ్‌కాంగ్‌లో నెలకొన్న రాజకీయ అనిశ్చితి పరిస్థితులు పసిడి కొంత మద్దతునిస్తున్నాయి. అమెరికా మార్కెటు నిన్నరాత్రి రికార్డు

Most from this category