News


11900 పాయింట్ల వరకు నిఫ్టీ ర్యాలీ!

Monday 28th October 2019
Markets_main1572253892.png-29181

నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు క్రమంగా నెగిటివ్‌ మూడ్‌లోనుంచి బయటకు వస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయని నిపుణులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గట్లే కొత్త సంవత్‌ను సూచీలు పాజిటివ్‌గా ఆరంభించాయి. పూర్తిగా ఎకానమీలో పరిస్థితులు మారకపోయినా, బుల్స్‌ క్రమంగా తమ పట్టు బిగించడానికే యత్నిస్తున్నారు. దీంతో రాబోయే రోజుల్లో సూచీలు క్రమంగా ముందుకే కొనసాగే అవకాశముందని నిపుణుల అంచనా. 
నిఫ్టీపై మార్కెట్‌ పండితుల అంచనాలు...
1. సమిత్‌ చవాన్‌, ఏంజల్‌ బ్రోకింగ్‌: చార్టుల్లో నిఫ్టీ కీలక నిరోధ ప్యాట్రన్‌ నుంచి బ్రేకవుట్‌ సాధించింది. ఈ పరిస్థితుల్లో నిఫ్టీ 11100 పాయింట్ల పైన కదలాడినంతకాలం అప్‌మూవ్‌కు అవకాశాలు సజీవంగా ఉంటాయి. నిఫ్టీకి 11350- 11450 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు ఉంది. ఎగువన 11800 -11990 పాయింట్ల వద్ద నిరోధం కనిపిస్తోంది. దీన్ని దాటగలిగితే 12100 పాయింట్ల వరకు నిఫ్టీ పెరగవచ్చు. ఇందు కోసం నిఫ్టీ తక్షణ నిరోధం 11700 పాయింట్లను దాటాల్సిఉంటుంది. నిఫ్టీ అప్‌మూవ్‌కు బ్యాంకు నిఫ్టీ నుంచి పెద్దగా సహకారం లభించడంలేదు. ఒక్కసారి ఈ సూచీలో కదలిక మొదలైతే క్రమంగా ప్రధాన సూచీలు చెలరేగుతాయి. ఆటో, బ్యాంక్స్‌, పెయింట్స్‌ రంగాలపై బుల్లిష్‌.
2. అన్‌దీప్‌ పోర్వాల్‌, ఆషికా బ్రోకింగ్‌: పండుగసీజన్‌, ఎన్నికల ఫలితాలు... మార్కెట్‌లో జోష్‌ పెంచుతాయి. నిఫ్టీ కీలకమైన ఫిబోనాక్కి స్థాయికి దిగువనే కదలాడుతోంది. సూచీలో పాజిటివ్‌ జోరు పెరగాలంటే తక్షణం 11715 పాయింట్ల నిరోధాన్ని విజయవంతంగా దాటాల్సిఉంది. దిగువన 11300 పాయింట్ల వద్ద పటిష్ఠ మద్దతు కనిపిస్తోంది. నిఫ్టీ కీలకమైన బ్రేకవుట్‌ లేదా బ్రేక్‌డౌన్‌ సాధించేవరకు ఇన్వెస్టర్లు వేచిచూడడం మంచిది. ఐటీలో కొన్ని స్టాకులు, ఎస్‌బీఐపై బుల్లిష్‌.
3. భవేన్‌ మెహతా, దోలత్‌ క్యాపిటల్‌: కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ప్రకటన అనంతరం నిఫ్టీ రెండు రోజుల్లో దాదాపు వెయ్యి పాయింట్లు ర్యాలీ జరిపింది. అనంతరం 21 సెషన్లుగా కన్సాలిడేషన్‌లో కదలాడుతోంది. నిఫ్టీ 11600- 11700పాయింట్లపైన విజయవతంగా ముగిసేందుకు పలు యత్నాలు చేసింది. ఈ దఫా సఫలం కావచ్చని అంచనా. లాంగ్స్‌కు 11300- 11400 పాయింట్లను స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి. కొత్త లాంగ్స్‌ను 11650 పాయింట్లపైన నిఫ్టీ ముగిస్తే ఆరంభించవచ్చు. బ్రేకవుట్‌ సంభవిస్తే 12000 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు. ఆటో, ప్రైవేట్‌ బ్యాంకులు, మెటల్స్‌లో కొన్ని, పీఎస్‌యూల్లో కొన్ని స్టాకులపై బుల్లిష్‌. You may be interested

పసిడి ర్యాలీకి ప్రస్తుతానికి బ్రేక్‌

Monday 28th October 2019

పసిడి ధర అంతర్జాతీయ మార్కెట్లో1,550డాలర్ల స్థాయి నుంచి మరింత పెరగకపోవొచ్చని, ఆ స్థాయి నుంచి క్రమేపీ తగ్గవచ్చని యస్‌సెక్యూరిటీస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హితేశ్‌ జైన్‌ అభిప్రాయపడుతున్నారు. వాణిజ్య సమస్యలు, ప్రపంచ ఉత్పాదక కార్యకలాపాలలో క్షీణత, సెంట్రల్‌ బ్యాంక్‌ వడ్డీరేట్ల తగ్గింపు, సావరిన్‌బాండ్ల ఈల్డ్‌ పతనం కావడం వంటి అంశాలతో  పసిడి ధర సెప్టెంబర్‌లో ఆరేళ్ల గరిష్టాన్ని అందుకుంది. పైన పేర్కొన్న ప్రతికూలాంశాలన్నింటినీ బంగారం ఇప్పటికే ఇముడ్చుకుంది. ఈ రకంగా పరిస్థితులేవైనప్పటికీ.., పసిడి

పసిడిలో పెట్టుబడులా? ఈ అంశాలు చూడండి

Monday 28th October 2019

రానున్న ఏడాది కాలంలో మూడు అంతర్జాతీయ అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేస్తాయని జియోజిత్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ కమోడిటీ హెడ్‌ హరీష్‌  తెలిపారు.  ఆయన కాలమ్‌ ద్వారా వ్యక్తపర్చిన అభిప్రాయాలిలా వున్నాయి.....     గత ఏడాది ద్వితియార్ధం నుంచి ఇప్పటి వరకు గమనిస్తే బంగారం ధరలు 30 శాతానికి పైగా లాభపడ్డాయి. దీనిని బట్టి అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఎంత బలహీనంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద దేశాల

Most from this category