News


కొద్ది రోజుల్లో నూతన శిఖరాలకు నిఫ్టీ...జియోజిత్‌

Thursday 13th February 2020
Markets_main1581584447.png-31763

జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ అంచనా
ఫిబ్రవరి 11 నిఫ్టీ చార్టుల్లో గ్రేవ్‌స్టోన్‌ డోజీ ఏర్పడిందని, అయితే మరుసటి రోజే బుల్లిష్‌ క్యాండిల్‌ ఏర్పడడం బుల్స్‌ బలానికి సంకేతమని జియోజిత్‌ ఫిన్‌సర్వ్‌ తెలిపింది. నిఫ్టీ తన 60 రోజుల ఈఎంఏ స్థాయి నుంచి మంగళవారం మంచి అప్‌మూవ్‌ నమోదు చేసేలా బుల్స్‌ కీలకపాత్ర వహించారు. అయితే బుధవారం తిరిగి బుల్స్‌ జోరు కనిపించలేదు. కానీ సూచీలు పెద్దగా పతనం కాలేదు. మంగళవారం నిఫ్టీ 12 రోజుల గరిష్ఠాన్ని తాకడం గమనిస్తే అప్‌మూవ్‌ కొనసాగింపే కనిపిస్తోంది. ఈ అప్‌మూవ్‌లో భాగంగా తొలుత బోలింగర్‌ బ్యాండ్‌ పై అవధి 12313 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చు. సోమ, మంగళవారాల్లో కదలికలు గతర్యాలీకి 23.6, 38.2 శాతం రిట్రేస్‌మెంట్స్‌కు లోపే ఉన్నందున బుల్లిష్‌నెస్‌ కొనసాగింపు ఖాయమని చెప్పవచ్చు. ఫిబ్రవరి 3న ఏర్పడిన మీన్‌రివర్షన్‌ సూచీల్లో బలానికి సంకేతం. అందువల్ల త్వరలో మరో కొత్త రికార్డు స్థాయిని సూచీలు తాకవచ్చు. స్వల్పకాలానికి నిఫ్టీ 12850- 13200 పాయింట్ల రేంజ్‌ను చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆప్షన్‌ డేటా చూస్తే 12000 పుట్స్‌ వద్ద అసాధారణ ఓఐ పెరుగుదల కనిపిస్తోంది. 12300 పాయింట్లను దాటితే ఆప్షన్‌ ఐవీల్లో మార్పు రాగలదు. ప్రస్తుత మాక్జిమం పెయిన్‌ స్థాయి 12100 పాయింట్ల వద్ద ఉంది. 12300 పాయింట్లను దాటితే ఈ స్థాయి పైకి కదులుతుంది. బ్యాంకు నిఫ్టీలో బుల్స్‌ హవా చూస్తే ఈ సీరిస్‌లోనే రెండు ప్రధాన సూచీలు పరుగులు తీస్తాయని అంచనాకు రావచ్చు. 



You may be interested

1-3 నెలలకు.. 5 స్టాక్స్‌!

Thursday 13th February 2020

దేశ, విదేశీ అంశాల నేపథ్యంలో దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్లకు లోనవుతూ కదులుతున్నాయి. వెరసి ఎన్‌ఎస్‌ఈ ఇండెక్స్‌ నిఫ్టీ 12,000 పాయింట్ల స్థాయిలో ఒడిదొడుకులను చవిచూస్తోంది. నిఫ్టీ 12,272 పాయింట్లను అధిగమిస్తే.. 12,500వైపునకు కదలవచ్చు. మరోపక్క వెనకడుగు వేస్తే.. 12,100 పాయింట్ల వద్ద మద్దతు లభించవచ్చు. తదుపరి బలహీనపడితే 11,990 వద్ద మరోసారి సపోస్ట్‌ కనిపించే వీలుంది. ఈ అంచనాలతోపాటు చార్టుల ఆధారంగా ఐదు స్టాక్స్‌ బ్రేకవుట్‌ సాధించాయని చెబుతున్నారు

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం క్రాష్‌...

Thursday 13th February 2020

ప్రైవేట్‌ రంగ బ్యాంక్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడికిలోనవ్వడంతో గురువారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ మిడ్‌సెషన్‌ సమయానికి 1శాతం నష్టాన్ని చవిచూసింది. నేడు ఈ ఇండెక్స్‌ 31,586.55 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మార్కెట్‌ ప్రారంభం నుంచి ప్రైవేట్‌ రంగ షేర్ల అమ్మకాలకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇండెక్స్‌ ఒకదశలో 1శాతం నష్టచవిచూసి 31180 వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.2:20ని.లకు ఇండెక్స్‌ క్రితం ముగింపు(31,492.90)తో పోలిస్తే 0.91శాతం నష్టంతో 31,206.00 వద్ద

Most from this category