News


కరెక్షన్‌కు అవకాశం... లాంగ్‌ పొజిషన్లకు దూరం...!

Wednesday 29th May 2019
Markets_main1559154583.png-25986

నిఫ్టీ 12,000 మార్క్‌ను అధిగమించి ఇంట్రాడేలో 12,041 రికార్డు స్థాయిని గత వారంలో నమోదు చేసిన తర్వాత సూచీలు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు. లాంగ్‌ పొజిషన్లకు ట్రేడర్లు దూరంగా ఉండడమే మంచిదన్న సూచన వారి నుంచి వినిపిస్తోంది. నిఫ్టీ ఈ నెల 28న హ్యాంగింగ్‌ మ్యాన్‌ పాటర్న్‌ను నమోదు చేసిందని, దీన్ని బేరిష్‌ రివర్సల్‌‍ ప్యాటర్న్‌గా పేర్కొంటున్నారు. నిఫ్టీ 12,000-12,041 వద్ద మధ్యంతర గరిష్టాన్ని నమోదు చేసిందని, సూచీల్లో లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండడం మంచిదని సూచిస్తున్నారు. ఇన్వెస్టర్లు నాణ్యమైన స్టాక్స్‌ను పడినప్పుడు కొనుగోలు చేసుకోవడానికి సరైన తరుణమని పేర్కొంటున్నారు.

 

నిఫ్టీ తదుపరి దశ పతనానికి సన్నద్ధం అవుతుందన్న అభిప్రాయం నిపుణుల నుంచి వినిపిస్తోంది. ‘‘రిస్క్‌-రాబడుల నిష్పత్తి బేర్స్‌కు అనుకూలంగా ఉంది. దిగువవైపు నిఫ్టీ రానున్న కొన్ని సెషన్లలో 11,615-11,590 వరకు చేరుకోవచ్చు’’ అని బీఎన్‌పీ పారిబాస్‌కు చెందిన షేర్‌ఖాన్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ గౌరవ్‌ రత్నపార్కి పేర్కొన్నారు. ​బేర్స్‌ షార్ట్‌ చేయడానికి రిస్క్‌-రాబడుల నిష్పత్తి అనుకూలంగా ఉందన్నారు. ఎగువైపున నిఫ్టీ 12,041 పాయింట్లను అధిగమించి క్లోజ్‌ అయితే బేరిష్‌ రివర్సల్‌ కావచ్చన్న విశ్లేషణను తెలియజేశారు. అర్థవంతమైన ట్రిగ్గర్లు ఏవీ లేని ప్రస్తుత సమయంలో నిఫ్టీ ఇప్పటికిప్పుడు 12,000ను బ్రేక్‌ చేయడం కష్టమేనని, ఇన్వెస్టర్లు కొత్తగా నూతన లాంగ్‌ పొజిషన్లను ఇండెక్స్‌లో చేయకుండా ఉండడం సూచనీయమన్నారు. 

 

నిఫ్టీ 11,866లోపు క్లోజ్‌ అయితే తదుపరి 11,818 వరకు పడిపోవచ్చని చార్ట్‌వ్యూ ఇండియా టెక్నికల్‌ రీసెర్చ్‌ అండ్‌ ట్రేడింగ్‌ అడ్వైజరీ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజార్‌ మహమ్మద్‌ పేర్కొ‍న్నారు. గత మూడు సెషన్లలో అప్‌మూవ్‌ అన్నది ఎగువవైపు కరెక్షన్‌కు రియాక్షన్‌గానే కనిపిస్తోందన్నారు. నిఫ్టీ స్వల్పకాలానికి 12,000 గరిష్టాన్ని నమోదు చేసే తీరులో కనిపిస్తోందని, ట్రేడర్లు ఇండెక్స్‌లో లాంగ్‌ పొజిషన్లకు దూరంగా ఉండాలని సూచించారు.You may be interested

స్మాల్‌క్యాప్‌లో ఈ ఫండ్స్‌ బెటర్‌: ధీరేంద్రకుమార్‌

Thursday 30th May 2019

స్మాల్‌క్యాప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారి ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేవే స్మాల్‌క్యాప్‌ ఫండ్స్‌. పదేళ్లు, అంతకంటే ఎక్కువ కాలం పాటు ఇ‍న్వెస్ట్‌ చేయగలిగిన వారు అధిక రాబడులు సొంతం చేసుకునేందుకు వీటిల్లో అవకాశం ఉంటుంది. ఈ విభాగంలో బిర్లా సన్‌లైఫ్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌, యాక్సిస్‌ స్మాల్‌క్యాప్‌ ఫండ్‌, ఫ్రాంక్లిన్‌ ఇండియా స్మాలర్‌ కంపెనీస్‌ ఫండ్‌ పథకాలను ప్రముఖ మార్కెట్‌ నిపుణుడు, వ్యాల్యూరీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్రకుమార్‌ సూచించారు. ఈ మేరకు

పీపీఎఫ్‌ఏఎస్‌ నుంచి ముచ్చటగా మూడో ఫండ్‌

Wednesday 29th May 2019

పరాగ్‌ పారిఖ్‌ లాంగ్‌టర్మ్‌ ఈక్విటీ ఫండ్‌ను తీసుకొచ్చిన ఆరేళ్ల తర్వాత మరో ఈ‍క్విటీ పథకాన్ని పీపీఎఫ్‌ఏఎస్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ తీసుకురానుంది. కాకపోతే పన్ను ఆదా కోసం ఉపకరించే ఈఎల్‌ఎస్‌ఎస్‌ పథకం ఇది. దీని పేరు పరాగ్‌ పారిఖ్‌ ట్యాక్స్‌ సేవర్‌ ఫండ్‌. మిగిలిన అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు పీపీఎఫ్‌ఏఎస్‌కు మధ్య ఎంతో భిన్నత్వం కనిపిస్తుంది. ఎందుకంటే గత ఆరేళ్లలో ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీ 62 ఈక్విటీ పథకాలను

Most from this category