News


12,400పైన నిలిస్తే నిఫ్టీ జోరు?!

Monday 20th January 2020
Markets_main1579494245.png-31040

ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ అంచనా

ఎన్‌ఎస్‌ఈ ప్రధాన ఇం‍డెక్స్‌ నిఫ్టీ 12,400 పాయింట్లకు ఎగువన నిలవగలిగితే.. తదుపరి మరింత జోరందుకునే వీలున్నట్లు ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ తాజాగా అంచనా వేసింది. అంచనాలు ఇలా.. గత వారం నిఫ్టీ కొత్త గరిష్టాలకు చేరింది. 13,352 వద్ద ముగిసింది. వారపు చార్టుల ప్రకారం చిన్న బుల్లిష్‌ కేండిల్‌ కనిపిస్తోంది. అయితే బ్యాంక్‌ నిఫ్టీ రికార్డ్‌ గరిష్టానికి చేరడంలో విఫలమైంది. గత వారం నికరంగా 1.6 శాతం క్షీణించి 31,591 వద్ద నిలిచింది. కాగా.. నిఫ్టీకి 12,400 పాయింట్ల వద్ద రెసిస్టెన్స్‌ ఎదురయ్యే వీలుంది. ఈ స్థాయికి ఎగువన నిఫ్టీ నిలవగలిగితే.. ప్రస్తుతం కనిపిస్తున్న అప్‌ట్రెండ్‌ కొనసాగవచ్చు. ఫలితంగా సమీపకాలంలో 12,600 వరకూ నిఫ్టీ పెరిగే అవకాశముంది. ఒకవేళ 12,400 దిగువకు చేరితే.. అమ్మకాల ఒత్తిడి కారణంగా 12,200 స్థాయికి దిగిరావచ్చు. 

ఓపెన్‌ ఇం‍ట్రస్ట్‌
నిఫ్టీ ఆప్షన్స్‌లో 12,000 పీఈ, 12,200 పీఈలలో అత్యధిక ఓపెన్‌ ఇంట్రస్ట్‌(ఓఐ) నమోదైంది. దీంతో 12,000- 12,200 స్థాయిలో నిఫ్టీకి పటిష్ట మద్దతు లభించవచ్చు. ఈ స్థాయికంటే దిగువకు చేరితే కొనుగోళ్లకు మంచి అవకాశంగా భావించవచ్చు. అయితే 12,500 సీఈ, 12,400 సీఈలో గరిష్ట ఓఐ కారణంగా రానున్న సెషన్లలో 12,400-12,500 పాయింట్ల వద్ద నిఫ్టీకి గట్టి రెసిస్టెన్స్‌ ఎదురుకావచ్చు. ప్రస్తుత చార్టుల ప్రకారం 12,400ను దాటగలిగితే.. మరింత బలపడే వీలుంది. అలాకాకుండా ఈ స్థాయిని కోల్పోతే కొంతమేర లాభాల స్వీకరణ జరగవచ్చు. 

ఫార్మా కౌంటర్లలలో
స్టాక్స్‌ విషయానికివస్తే.. సాంకేతికంగా అలెంబిక్‌ ఫార్మా, డాక్టర్‌ రెడ్డీస్‌, జీఎస్‌పీఎల్‌, సుదర్శన్‌ కెమికల్‌ కౌంటర్లలో లాంగ్‌ పొజిషన్లు తీసుకోచవచ్చు. అయితే ప్రస్తుత ముగింపు ధరలతో పోలిస్తే 5-7 శాతం దిగువన స్టాప్‌లాస్‌ పెట్టుకోవలసి ఉంటుంది.



You may be interested

స్వల్పంగా తగ్గిన పసిడి

Monday 20th January 2020

దేశీయ ఎంసీఎక్స్‌ మార్కెట్లో సోమవారం పసిడి ఫ్యూచర్ల ధర స్వల్ప నష్టాల్లో ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఫిబ్రవరి కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర రూ.20ల నష్టంతో రూ.39927.00 వద్ద కదలాడుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధర పరిమితి శ్రేణిలో కదలాడటం, నేడు డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఫ్లాట్‌ ప్రారంభం, దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీలు సెన్సెక్స్‌, నిఫ్టీలు రికార్డు స్థాయి వద్ద ప్రారంభం కావడం పసిడి

12400పైన నిఫ్టీ ప్రారంభం

Monday 20th January 2020

300 పాయింట్లు లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్‌  అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూలతలకు తోడు దేశీయ కార్పోరేట్‌ దిగ్గజాలైన రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, టీసీఎస్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ల మూడో త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ వర్గాలను అంచనాలను అందుకోవడంతో సోమవారం స్టాక్‌ మార్కెట్‌ లాభంతో మొదలైంది. ప్రధాన ఇండెక్స్‌లైన సెన్సెక్స్‌ 318 పాయింట్ల లాభంతో 42,263 వద్ద  నిఫ్టీ 78 పాయింట్ల లాభంతో 12400పై 12,430 వద్ద మొదలయ్యాయి. డాలర్‌ మారకంలో రూపాయి ఫ్లాట్‌గా ప్రారంభం

Most from this category