News


కొద్ది రోజుల్లో 11800 పాయింట్ల వరకు పతనం !?

Tuesday 7th January 2020
Markets_main1578371197.png-30724

నిపుణుల అంచనా
పశ్చిమాసియా ఉద్రిక్తతలతో సోమవారం దేశీయ సూచీలు భారీగా పతనమయ్యాయి. అయితే మంగళవారం సూచీలు వేగంగా రీబౌన్స్‌ అవుతున్నాయి. నిఫ్టీ కీలక 12100 పాయింట్ల పైన ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిఫ్టీ కీలక మద్దతులు కోల్పోయినందున రాబోయే రోజుల్లో 11800- 11850 పాయింట్ల వరకు పతనం కావచ్చని మార్కెట్‌ నిపుణులు అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారితే పతనం 11600 పాయింట్ల వరకు ఉండొచ్చంటున్నారు.
1. ఎడెల్‌వీజ్‌ అనలిస్టు సాగర్‌: వేవ్‌ సిద్ధాంతం ప్రకారం రెండు రకాల పరిణామాలుండొచ్చు. ఒకటో ఫలితం: మైనర్‌ వేవ్‌2లో ధర ఉన్నట్లైతే పతనం 11850 పాయింట్ల వరకు ఉంటుంది. అక్కడ నుంచి వేవ్‌ 3 ఆరంభమై నిఫ్టీ 12800 పాయింట్లపై వరకు అప్‌మూవ్‌ చూపవచ్చు. రెండో ఫలితం: నిఫ్టీ 11832 దిగువన క్లోజయితే అప్పుడు మేజర్‌ వేవ్‌ 1లో ఉన్నట్లు పరిగణించాలి. ఈ వేవ్‌లో 11630 పాయింట్ల వరకు పతనం ఉంటుంది. అనంతరం వేవ్‌2 ఆరంభమై పతనం 11400 పాయింట్ల వరకు కొనసాగుతుంది. రెండింటిలో ఏదైనా ముందు మాత్రం నిఫ్టీ 11850 పాయింట్ల వరకు దిగిరావడం ఖాయంగా కనిపిస్తోంది. వీఐఎక్స్‌ సూచీ 18 స్థాయి వరకు పెరగవచ్చు. 
2. ఏంజల్‌ బ్రోకింగ్‌ అనలిస్టు సమిత్‌: నిఫ్టీ కీలక 12000 పాయింట్ల దిగువన క్లోజవడం స్వల్పకాలిక బేరిష్‌నెస్‌కు సంకేతం. నిఫ్టీ ఈ పతనంలో కీలక అప్‌సైడ్‌ ట్రెండ్‌ వాలురేఖ దిగువకు చేరింది. ఇది బుల్స్‌కు మంచిది కాదు. నిఫ్టీ 12150 దిగువన ఉన్నంత వరకు బేర్స్‌దే ఆధిపత్యం ఉండొచ్చు. పరిస్థితులు దిగజారితే పతనం 11800- 11850 పాయింట్ల వరకు ఉంటుంది. ఇంకా దిగజారితే 200 రోజుల డీఎంఏ 11600 పాయింట్ల రేంజ్‌లో మద్దతు దొరకవచ్చు. 
3. ఐఐఎఫ్‌ఎల్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు జయేశ్‌: నిఫ్టీ ఆరు నెలల్లో అతిపెద్ద ఒకరోజు పతనం సోమవారం నమోదు చేసింది. వీఐఎక్స్‌ తిరిగి 14 స్థాయిలకు చేరింది. వీఐఎక్స్‌ 200 డీఎంఏ 15.5 వద్ద ఉంది. దీని పైన స్థిరపడితే సూచీలు బేరిష్‌గా మారతాయి. నిఫ్టీ తాజా బ్రేక్‌డౌన్‌లో 11832 పాయింట్లను పరీక్షించవచ్చు.
4. సుశీల్‌ ఫైనాన్స్‌ అనలిస్టు స్వప్నీల్‌: నిఫ్టీలో సోమవారం వచ్చిన పతనం బహిర్గత కారణాల వల్ల వచ్చింది. బాల్కోట్‌ దాడుల సమయంలో కూడా ఇలాంటి పతనం చూశాము. ఆపై వెనువెంటనే కోలుకుంది. ప్రస్తుతం నిఫ్టీ 12100- 12150 పాయింట్ల వరకు రికవరీ కావచ్చు. దిగువన 11890 -11940 పాయింట్ల వద్ద మద్దతు దొరుకుతుంది. నిఫ్టీ దిగువకు వచ్చినా, లాంగ్‌ట్రెండ్‌ మాత్రం పాజిటివ్‌గానే ఉంది. You may be interested

పసిడి: ఏడేళ్ల గరిష్టం నుంచి వెనక్కి..!

Tuesday 7th January 2020

ప్రపంచమార్కెట్లో పసిడి ఫ్యూచర్స్‌ ధర మంగళవారం ఏడేళ్ల గరిష్టం నుంచి వెనక్కి వచ్చాయి. ఆసియాలో ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఔన్స్‌ పసిడి ధర దాదాపు 8డాలర్లు(అరశాతం) నష్టపోయి 1,560.95డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. గరిష్ట స్థాయి వద్ద ఇన్వెస్టర్లు, ట్రేడర్లు లాభాల స్వీకరణకు పూనుకోవడం, పశ్చిమాసియాలో ఉద్రిక్త వాతావరణం పరిస్థితులు కొంత చల్లబటం తదితర కారణాలు పసిడి ఫ్యూచర్ల డిమాండ్‌ను తగ్గించాయి. పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంతో నిన్నటి ట్రేడింగ్‌లో

బ్యాంక్‌ నిఫ్టీ జోరు

Tuesday 7th January 2020

పీఎస్‌యూ, ప్రయివేట్‌ రంగ బ్యాంక్‌ స్టాక్స్‌కు డిమాండ్‌ ప్రపంచ స్టాక్‌ మార్కెట్ల ప్రోత్సాహంతో మంగళవారం దేశీ స్టాక్‌ మార్కెట్లు జోరందుకున్నాయి. ఉదయం 9.30 ప్రాంతంలో సెన్సెక్స్‌ 500 పాయింట్లు జంప్‌చేసింది.  41,176కు చేరింది. ఈ బాటలో నిఫ్టీ సైతం 145 పాయింట్లు ఎగసి 12,137 వద్ద ట్రేడవుతోంది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ టెక్నాలజీ దిగ్గజాల అండతో సోమవారం అమెరికా స్టాక్‌ ఇండెక్సులు 0.25-1 శాతం మధ్య పుంజుకున్నాయి. ఇక ప్రస్తుతం ఆసియా

Most from this category