News


మరో 200 పాయింట్ల పతనం పక్కా?!

Tuesday 9th July 2019
Markets_main1562664423.png-26926

నిఫ్టీపై నిపుణుల అంచనా
దేశీయ మార్కెట్లు బడ్జెట్‌ అనంతరం కరెక‌్షన్‌ మూడ్‌లోకి మారాయి. సోమవారం సూచీలు భారీ పతనం నమోదు చేశాయి. మంగళవారం ట్రేడింగ్‌లో నెగిటివ్‌ ధోరణితో ఊగిసలాడుతున్నాయి. ఈ నేపథ్యంలో సూచీలు ఇప్పట్లో స్థిరపడవని, మరింత పతనం ముందుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాల్యూషన్లపరంగా సూచీల్లో మరికొంత కరెక‌్షన్‌ బాకీ ఉందంటున్నారు. కంపెనీల నిజపరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నాయని, బడ్జెట్లో ఇండస్ట్రీకి ఎలాంటి ప్రోత్సాహకాలు లేకపోవడం మార్కెట్‌ను నిరాశపరిచిందని చెబుతున్నారు. ఇవన్నీ ఎర్నింగ్స్‌పై ఒత్తిడి పెంచవచ్చని అంచనా వేస్తున్నారు. కేవలం బ్యాంకింగ్‌ రంగంలోనే కొంత మంచి ఫలితాలు కనిపించే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. వినిమయ ఆధారిత స్టాకులు మరింత పతనమయ్యే ఛాన్సులున్నట్లు అంచనా వేశారు. ఇలాంటి నిరాశాపూరిత వాతావరణం దృష్ట్యా వచ్చే రెండు నెలల్లో నిఫ్టీ మరో 200- 300 పాయింట్ల మేర పతనం కావచ్చని హెచ్చరించారు. సంవత్సరాంతానికి నిఫ్టీలో దాదాపు 500- 1500 పాయింట్ల కరెక‌్షన్‌కు ఛాన్సులున్నట్లు తెలిపారు. 
అనలిస్టుల అభిప్రాయాలు..
1. బుల్‌ మార్కెట్‌కు ప్రస్తుతం 40 శాతం మాత్రమే ఛాన్సుంది. వాల్యూషన్లు అధికంగా ఉన్నందున మరింత పతనం తప్పదు. వినిమయ రంగం బలహీనంగా ఉంది. క్రెడిట్‌ సంక్షోభం మధ్యలో ఉన్నందున మరో ఏడాది ఈ ప్రభావం ఉంటుంది.-  ఉమేశ్‌ మెహతా, సామ్‌కో సెక్యూరిటీస్‌.
2. ఎర్నింగ్స్‌ బలహీనతలను ఇంకా మార్కెట్‌ డిస్కౌంట్‌ చేయలేదు. ఎర్నింగ్స్‌ నిరాశపరచడం టీసీఎస్‌ ఫలితాలతోనే ఆరంభం కావచ్చు. నిఫ్టీ ఎర్నింగ్స్‌లో కేవలం 1.3 శాతం పెరుగుదలే ఉంటుందని అంచనా. అదికూడా బ్యాంకుల కారణంగానే స్వల్ప పెరుగుదల రావచ్చు. జూన్‌ త్రైమాసికంలో మాత్రం బ్యాంకులు కూడా బలహీనతనే చూపవచ్చు.- రస్ముక్‌ ఓజా, కోటక్‌ సెక్యూరిటీస్‌.
3. గత ఆరు త్రైమాసికాలుగా సూచీలకు ఎర్నింగ్స్‌ నుంచి దన్ను లభించలేదు. కేవలం స్థిర ప్రభుత్వంపై ఆశలతో సూచీలు పైకి ఎగుస్తూ వచ్చాయి. కానీ ఇకపై ఎర్నింగ్స్‌ అండ లేకుండా పరుగులు ఉండకపోవచ్చు. ప్రస్తుతానికి వీఐఎక్స్‌లో సూచీల పతనం ప్రతిబింబించకపోయినా, త్వరలో వీఐఎక్స్‌ పైకిపెరిగే ఛాన్సుంది. నిఫ్టీ స్వల్పకాలానికి 9,500 పాయింట్లను చేరే అవకాశం ఉంది.- సందీప్‌ రైచురా, ప్రభుదాస్‌ లీలాధర్‌. You may be interested

పన్ను పెరుగుదల మాత్రమే కాదు..!

Tuesday 9th July 2019

పతనానికి ఇంకా చాలా కారణాలున్నాయి అడ్రైన్‌ మోవత్‌ బడ్జెట్‌ అనంతరం మూడో రోజు కూడా మార్కెట్‌ నెగిటివ్‌ మూడ్‌లోనే కొనసాగుతోంది. చాలా మంది అనలిస్టులు ఈ పతనానికి కారణం అధికాదాయ వర్గాలపై పన్ను పెంచడమేనని అభిప్రాయపడుతున్నారు. హెచ్‌ఎన్‌ఐలపై పన్ను పెంచడం ఎఫ్‌పీఐలపై నెగిటివ్‌ ప్రభావం పడుతుందని విశ్లేషిస్తున్నారు. కానీ వర్దమాన మార్కెట్ల నిపుణుడు అడ్రైన్‌ మోవత్‌ మాత్రం పతనానికి ఇంకా చాలా కారణాలున్నాయని చెబుతున్నారు. కేవలం పన్ను పెంచారని మాత్రమే మార్కెట్లో అమ్మకాల

కనిష్ట స్థాయి నుంచి కోలుకున్న మార్కెట్‌

Tuesday 9th July 2019

వరుసగా మూడో రోజు నష్టాలతో ప్రారంభమైన దేశీ స్టాక్‌ మార్కెట్‌ నష్టాలు మిడ్‌సెషన్‌ సమయానికి పరిమితమయ్యాయి. ఉదయం సెషన్‌లో జరిగిన అమ్మకాలతో సెన్సెక్స్‌ ఒకదశలో 285 పాయింట్లు క్షీణించి 38,435.87 వద్ద స్థాయికి చేరకోగా, నిఫ్టీ ఇండెక్స్‌ 91 పాయింట్లను కోల్పోయి 11,461.00 వద్ద ఇంట్రాడే గరిష్టానికి చేరుకుంది. అనంతరం కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు కొనుగోలుకు పూనుకోవడటం, ట్రేడర్లు షార్ట్‌ కవరింగ్‌కు దిగవడంతో సూచీలు కనిష్టస్థాయిల నుంచి రికవరి

Most from this category