News


11100 పాయింట్ల వరకు పతనం?!

Monday 22nd July 2019
Markets_main1563785433.png-27232

కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా
రెండు వారాల్లో నిఫ్టీ ఒక్కపాటున 11700 నుంచి 11300 పాయింట్లకు పతనమైంది. ఈ నేపథ్యంలో నిఫ్టీకి 11320- 11280 పాయింట్ల మధ్య బహుళ మద్దతు స్థాయిలున్నాయని, ఈ స్థాయిలను కోల్పోతే వేగంగా 11100 పాయింట్ల వరకు పతనమైతుందని కోటక్‌ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది.  సాధారణ ఎన్నికల ఫలితాలకు ముందు 11100 పాయింట్లు గట్టి మద్దతుగా నిలిచిందని, 11300 పాయింట్లను కోల్పోవడం నిఫ్టీని ఇక్కడివరకు తీసుకువస్తుందని తెలిపింది. 2016 ఫిబ్రవరి నుంచి ఎలాంటి బేరిష్‌ ట్రెండైనా గరిష్ఠంగా రెండు నెలలు మాత్రమే కొనసాగిందని, అదేవిధంగా ఈ సారి కూడా రెండు వారాల్లో సూచీలు బాటమ్‌ అవుట్‌ అవుతాయని అంచనా వేసింది. బాటమ్‌ అవుట్‌ పూర్తయ్యాక క్రమానుగతంగా కోలుకుంటాయని, దీంతో ఇప్పటి నష్టాలను దాటి సూచీలు ముందుకు సాగుతాయని అభిప్రాయపడింది. గతంలో కూడా ఆగస్టు, సెప్టెంబర్‌ నెలలు సూచీలకు పాజిటివ్‌గా ఉన్నాయని తెలిపింది. కానీ ప్రస్తుతానికి మాత్రం రాబోయే రెండు వారాలు సూచీలకు కష్టాలు తప్పవని వెల్లడించింది. నిఫ్టీ 11100 పాయింట్లకు వస్తే ఇటీవల కాలంలో ఇదే  అతిపెద్ద బ్రేక్‌డౌన్‌గా చెప్పవచ్చని పేర్కొంది. పైస్థాయిలో నిఫ్టీకి 11500- 11560 పాయింట్ల వద్ద బలమైన నిరోధం వస్తుందని, దీన్ని దాటితే 11800- 11860 పాయింట్ల వరకు ర్యాలీ ఉండొచ్చని అంచనా వేసింది. వచ్చే రెండు నెలలకు ఇదే నిరోధ స్థాయిగా వుంటుందని తెలిపింది. ట్రేడర్లు కచ్ఛితమైన స్థాయిలను ఫాలో కావాలని, మిడ్‌టర్మ్‌ ఇన్వెస్టర్లు 11300- 11100 పాయింట్ల వద్ద ఎంపిక చేసిన లార్జ్‌క్యాప్స్‌ను కొనొచ్చని సిఫార్సు చేసింది. ఈవారం హెచ్‌యూఎల్‌, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటామోటర్స్‌ వంటి దిగ్గజాలు క్యు1 ఫలితాలు వెల్లడించనున్నాయి. You may be interested

మిశ్రమంగా మెటల్‌ షేర్లు..

Monday 22nd July 2019

నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 1.56 శాతం లాభపడి 2,784.55 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. ఈ ఇండెక్స్‌లో  వేదాంత  3.97 శాతం, సెయిల్‌ 3.36 శాతం, హిందల్కో ఇండస్ట్రీస్‌ లి. 2.30 శాతం, జిందాల్‌ స్టీల్‌ 2.24 శాతం, జేఎస్‌డబ్యూ స్టీల్‌ 2.07 శాతం, హిందుస్థాన్‌ జింక్‌ లి.1.86 శాతం, టాటా స్టీల్‌ 1.54 శాతం, నేషనల్‌ అల్యూమినియం కార్పోరేషన్‌ 0.44 శాతం లాభపడి ట్రేడవుతుండగా,

ఈ ప్రోత్సాహకాలు...లాభాన్నిచ్చేవే

Monday 22nd July 2019

మ్యూచుఫల్‌ ఫండ్స్‌లో టాపప్‌ సిప్‌ సేవిం‍గ్స్‌ ఖాతా కంటే లిక్విడ్‌ ఫండ్స్‌ బెటర్‌ ఇన్వెస్టింగ్‌ను సులభం చేసే బ్యాలన్స్‌డ్‌ ఫండ్స్‌ బ్యాంకుల్లోనూ అధిక రాబడులకు స్వీప్‌ అకౌంట్లు ఉన్న బీమా పాలసీల్లోనే కవరేజీ పెంపు ప్రభుత్వం ఇచ్చే పన్ను రాయితీలతోనూ ప్రయోజనమే  కొన్ని ఆప్షన్లు కంపెనీలకే కాదు... వినియోగదారులకూ మేలు చేస్తాయి. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అనేది, పెరిగే బాధ్యతలకు అనుగుణంగా కవరేజీ దానంతట అదే పెరుగుతూ వెళితే ఎంత సౌకర్యంగా ఉంటుందో ఆలోచించిండి. అలాగే, సెక్షన్‌

Most from this category