News


నిఫ్టీలో షార్ట్‌ స్ట్రాడిల్‌ వ్యూహం!

Monday 10th February 2020
Markets_main1581310254.png-31646

ఎఫ్‌అండ్‌ఓ నిపుణుల సూచన
ఈవారం పరిమిత శ్రేణిలో నిఫ్టీ కదలాడే ఛాన్సున్నందున షార్ట్‌స్ట్రాడిల్‌ వ్యూహం అవలంబించాలని నిపుణులు సూచిస్తున్నారు. వ్యూహంలో ఫిబ్రవరి 13న ఎక్స్‌పైరీ అయ్యే 12100 నిఫ్టీ కాల్‌ ఒకటి, పుట్‌ ఒకటి విక్రయిస్తారు. నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద బలమైన మద్దతు, 12200 పాయింట్ల వద్ద బలమైన నిరోధం ఉన్నందున ఈ వ్యూహం మంచి ఫలితాన్నిస్తుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ ఈ రేంజ్‌ను దాటితే మాత్రం వ్యూహంలో నష్టం భారీగా ఉంటుంది. అందువల్ల స్టాప్‌లాస్‌ కచ్ఛితంగా పాటించాలి. నిఫ్టీ 12100 పాయింట్ల వద్ద క్లోజయితే గరిష్ఠలాభం ఈ వ్యూహంలో వస్తుంది. దిగువన 11964, ఎగువన 12236 పాయింట్లు వ్యూహానికి పరిమితులు. వీటికి అవతల వ్యూహం నష్టాల్లోకి మరలుతుంది.

బడ్జెట్‌ సమయంలో 17పైన ఉన్న వీఐఎక్స్‌ తర్వాత వారంలో 13 స్థాయిలకు రావడం సూచీల్లో తగ్గిన ఆటుపోట్లను సూచిస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ తెలిపింది. ఈ సమయంలో నిఫ్టీ 12100 కాల్‌ ధర 57 శాతం, పుట్‌ ధర 66 శాతం పతనమయ్యాయి. ఇవి ఈ వారంలో మరింత పతనమయ్యే ఛాన్సులున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల షార్ట్‌స్ట్రాడిల్‌ వ్యూహం బెటరని ఇండియా చార్ట్స్‌ సూచించింది. ప్రస్తుతం నిఫ్టీ బాటమ్‌అవుట్‌ అయ్యేదిశగా కదులుతోందని తెలిపింది. 
పైన పేర్కొన్న వ్యూహంలో స్ట్రైక్‌ప్రైస్‌ శుక్రవారం క్లోజింగ్‌కు అనుగుణంగా వివరించడం జరిగింది. సోమవారం ధరల ఆధారంగా వ్యూహంలో మార్పులు చేసుకోవాలి.



You may be interested

ఎప్పుడైనా ఇన్వెస్ట్‌ చేసుకోతగినది.!

Monday 10th February 2020

మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బిజినెస్‌ ఫండ్‌ దీర్ఘకాలానికి ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు, అందులోనూ లార్జ్‌క్యాప్‌, మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌ పట్ల సానుకూలంగా ఉన్న వారు.. ఈ విభాగంలో మిరే అస్సెట్‌ ఎమర్జింగ్‌ బ్లూచిప్‌ ఫండ్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది ఆరంభం నుంచి ఇప్పటి వరకు మధ్యలో కొన్ని సంవత్సరాలు మినహాయిస్తే చక్కని పనితీరుతో దూసుకుపోతోంది. గతంలో మిడ్‌క్యాప్‌ స్టాక్స్‌లో ఎక్కువ ఎక్స్‌పోజర్‌తో ఉండే ఈ పథకం, మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల

మీ ‘పన్ను’ దారేది..?

Monday 10th February 2020

ఐటీ: కొత్తదా.. పాతదా? ఎవరికి ఏ పన్ను విధానం ప్రయోజనం... రూ.10 లక్షల ఆదాయంపై ప్రస్తుత విధానమే లాభం మినహాయింపులను పూర్తిగా వినియోగించుకోవాలి దాంతో పన్ను బాధ్యత లేకుండా చూసుకోవచ్చు సెక్షన్‌ 80సీ ఇన్వెస్ట్‌ చేయని వారికి పన్ను ఆదా ప్రయోజనాలు క్లెయిమ్‌ చేసుకోని వారికి నూతన పన్ను విధానం ప్రయోజనకరం ఎవరికి ఏదన్నది వారి ఆర్థిక ప్రణాళిక ప్రకారమే నిర్ణయం ఆదాయపన్ను రేట్లు తగ్గుతాయని ఆశగా ఎదురు చూసిన వారిని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ నూతన పన్ను రేట్లతో

Most from this category