News


10900- 11250 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 19th August 2019
Markets_main1566197108.png-27862

యాక్సిస్‌ సెక్యూరిటీస్‌
నిఫ్టీ స్వల్పకాలానికి పరిమిత రేంజ్‌లోనే కదలాడుతుందని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ రిసెర్చ్‌ హెడ్‌ రాజేశ్‌ పల్వియా అభిప్రాయపడ్డారు. సూచీల కదలికలపై ఆయన అంచనాలు ఇలా ఉన్నాయి...
నిఫ్టీ గతవారం స్వల్ప రేంజ్‌లో కదలాడి చివరకు స్వల్ప నష్టంతో ముగిసింది. వీక్లీ చార్టుల్లో నిఫ్టీ బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పరిచింది. ప్రస్తుతం సూచీలు లోయర్‌టాప్‌, లోయర్‌ బాటమ్‌ ఫార్మేషన్‌లో కదలాడుతున్నాయి. ట్రెండ్‌ ఇంకా బలహీనంగానే కనిపిస్తోంది. చార్టుల ప్రకారం నిఫ్టీ 11100 పాయింట్ల పైన స్థిరంగా కదలాడితే కొనుగోళ్లు పెరిగి 11200- 11260 పాయింట్ల వరకు చేరవచ్చు. ఒకవేళ 11900 పాయింట్ల దిగువకు వస్తే అమ్మకాల ఒత్తిడి పెరిగి క్రమంగా 11800 వరకు పతనం కావచ్చు. ప్రస్తుతం నిఫ్టీ తన కీలక డీఎంఏ స్థాయిలకు దిగువన ట్రేడవుతోంది. ఇది స్వల్పకాలిక నెగిటివ్‌నెస్‌ను సూచిస్తోంది. నిఫ్టీ క్రమానుగత పెరుగుదల చూపుతుంటే తగినప్పుడు కొను సూత్రాన్ని పాటించవచ్చు. ఈ వారానికి చూస్తే నిఫ్టీ 10900- 11250 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడుతుంది.
షార్ట్‌టర్మ్‌ సిఫార్సులు
1. ఎంఅండ్‌ఎం ఫిన్‌సర్వ్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 340. స్టాప్‌లాస్‌ రూ. 298.
2. హీరోమోటోకార్‌‍్ప: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 2810. స్టాప్‌లాస్‌ రూ. 2545.
3. ఐడీఎఫ్‌సీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 50. స్టాప్‌లాస్‌ రూ. 42. 



You may be interested

రాణిస్తున్న రియల్టీ రంగ షేర్లు

Monday 19th August 2019

మార్కెట్‌లో నెలకొన్న కొనుగోళ్ల మద్దతులో భాగంగా రియల్టీ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌ఎస్‌ఈలో రియల్టీ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 1.50శాతానికి పైగా ర్యాలీ చేసింది. నేడు నిఫ్టీ రియల్టీ ఇండెక్స్‌ 266.40 వద్ద ప్రారంభమైంది. మార్కెట్‌ ప్రారంభం నుంచి రియల్టీ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభిస్తుండంతో ఇండెక్స్‌ ఒక దశలో 1.60శాతం ర్యాలీకి చేసి 269.35 స్థాయిని అందుకుంది. అత్యధికంగా ప్రెస్టేజ్‌ ఎస్టేట్స్‌ ప్రాజెక్ట్స్‌

డిస్కౌంట్‌లో స్పందన స్ఫూర్తి లిస్టింగ్‌

Monday 19th August 2019

మైక్రోఫైనాన్స్ కంపెనీ స్పందన స్పూర్తి మార్కెట్‌లో లిస్ట్‌యిన మొదటి రోజే తన ఇష్యు ధర కంటే 3 శాతం పైగా డిస్కౌంట్‌ ధరతో ప్రారంభమైంది. ఈ కంపెనీ షేరు సోమవారం ఎన్‌ఎస్‌ఈ(నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ)లో 3.6 శాతం డిస్కౌంట్‌తో(ఇష్యు ధర కంటే) రూ. 825 వద్ద, బీఎస్‌ఈలో 3.7 శాతం డిస్కౌంట్‌తో రూ. 823 వద్ద  ప్రారంభమైంది. కాగా ఈ ఫైనాన్స్‌ సంస్థ జారీచేసిన పబ్లిక్‌ ఇష్యూకు రూ. 850 (షేరుకు) ఆఫర్‌ ధర

Most from this category