News


బడ్జెట్‌ వరకు 11600-11900 పాయింట్ల రేంజ్‌లో నిఫ్టీ!

Monday 1st July 2019
Markets_main1561965018.png-26712

బడ్జెట్‌ వరకు నిఫ్టీ 11600- 11900 పాయింట్ల రేంజ్‌లోనే కదలాడుతుందని ఇండియానివేశ్‌ సెక్యూరిటీస్‌ అనలిస్టు మెహుల్‌ కొఠారి అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం నిఫ్టీ 11600 పాయింట్ల పైన ఉన్నంత వరకు ట్రెండ్‌బలంగానే ఉంటుందని చెప్పారు. గతవారం బుల్స్‌ చిన్నపాటి బ్రేకవుట్‌ సాధించారని చెప్పారు. ఈ స్థితిలో నిఫ్టీ 11911 పాయింట్ల వద్ద మధ్యంతర హైని సాధించిందన్నారు. డైలీ చార్టుల్లో నిఫ్టీ షూటింగ్‌ స్టార్‌క్యాండిల్‌ను ఏర్పరిచింది. అది కూడా 78.6 శాతం ఫిబోనాక్కి రిట్రేస్‌మెంట్‌ స్థాయి వద్ద ఏర్పడడంతో ట్రెండ్‌రివర్సల్‌ ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల చిన్న పాటి ప్రాఫిట్‌ బుకింగ్‌ జరగవచ్చు. కానీ 11600 పాయింట్లను కాపాడుకున్నంత వరకు ప్రధాన ట్రెండ్‌ బుల్లిష్‌గానే ఉంటుందన్నారు. పైన 11920ని బలంగా దాటితో మరో మారు లైఫ్‌టైమ్‌ హైని నమోదు చేయగలదని కొఠారీ చెప్పారు. ఈ వారాంతవరకు మాత్రం రేంజ్‌లోనే కన్సాలిడేషన్‌ జరగవచ్చని తెలిపారు. స్టాక్స్‌ పరంగా టాటా మోటర్స్‌, మాజెస్కో, కెనెరా బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీలైఫ్‌, ఎస్‌బీఐ, బజాజ్‌ఫిన్‌సర్వ్‌, ఇన్ఫోఎడ్జ్‌ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నట్లు చెప్పారు. 



You may be interested

అమ్మకానికి అనిల్‌ అంబాని హెడ్‌ క్వార్టర్స్‌: భారీ నష్టాల్లో షేర్లు

Monday 1st July 2019

పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన అనిల్‌ అంబాని హెడ్‌క్వార్టర్స్‌ను అమ్మకానికి సిద్ధమయ్యారు. ప్రస్తుతం అనిల్‌ అంబాని ముంబైలో వెస్ట్రన్‌ ఎక్స్‌ప్రెస్‌ హైవేలోని శాంటాక్రూజ్‌ గ్రూప్‌ హెడ్‌క్వార్టర్స్‌ ద్వారా తన కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. పెరిగిన రుణభారాల్ని తగ్గించుకునే ప్రక్రియలో భాగంగా కంపెనీ 7లక్షల చదరపు అడుగులు విస్తీర్ణం కలిగిన ఈ భవన సముదాయాన్ని విక్రయం లేదా ధీర్ఘకాలికానికి లీజుకు ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. ఇందుకు గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థ బ్లాక్‌ స్టోన్‌తో పాటు

ఏడాది కనిష్ఠానికి 67 స్టాక్‌లు

Monday 1st July 2019

ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీలో  67 స్టాక్‌లు తమ 52 వారాల కనిష్ఠ స్థాయిని సోమవారం తాకాయి. ఏక్సిలియ సొల్యుషన్స్‌ ఇండియా, అరవింద్‌ స్మార్ట్‌ స్పేసస్‌, కాస్ట్రోల్‌ ఇండియా, బర్న్‌పుర్‌ సిమెంట్‌, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ ఏడాది కనిష్ఠాన్ని తాకిన స్టాక్‌లలో ఉన్నాయి. వీటితో పాటు దన్సేరి ఇన్వెస్ట్‌మెంట్స్‌, ఈరోస్‌ ఇంటర్నేషనల్‌ మీడియా, గ్లెన్‌ మార్క్‌ పార్మా, హెల్త్‌ కేర్‌ గ్లోబల్‌ ఎంటర్‌ప్రైజెస్‌, హిందుస్థాన్‌ మీడియా వెంచర్స్‌, విండ్సర్‌ మిషెన్స్‌ కూడా తమ ఏడాది

Most from this category