News


బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం బెటరు

Monday 12th August 2019
Markets_main1565600379.png-27715

నిపుణుల సూచన
నిఫ్టీ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. గతవారం నిఫ్టీ 11100 పాయింట్ల పైన క్లోజయింది. వీఐఎక్స్‌ 19.4 స్థాయి నుంచి 16.25 స్థాయికి దిగివచ్చింది. నిఫ్టీ ప్రస్తుతం పరిమిత శ్రేణి పైఅవధి వద్ద కదలాడుతోంది. ఈ వారం మార్కెట్‌ ట్రేడింగ్‌ దినాలు తక్కువ కావడంతో స్వల్పకాలిక కదలికలే ఉండొచ్చని నిపుణుల అంచనా. వీక్లీ నిఫ్టీ ఆప్షన్స్‌ పరిశీలిస్తే 11000 పాయింట్ల వద్ద పుట్స్‌, 11200, 11300 పాయింట్ల వద్ద కాల్స్‌ ఎక్కువగా ఉన్నాయ. నెలవారీ ఆప్షన్స్‌ చూస్తే 11000 వద్ద పుట్స్‌ ఎక్కువగా ఉన్నాయి. ఈ స్థాయి ప్రస్తుతానికి స్వల్పకాలిక బాటమ్‌గా పనిచేయవచ్చు. నిఫ్టీ 11300 పాయింట్లపైన నిలదొక్కుకుంటే మరింత షార్ట్‌కవరింగ్‌ ఉంటుంది. 
ఈ పరిస్థితులను పరిశీలిస్తే ఇప్పుడు బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహం అవలంబించడం మంచిదని టెక్నికల్‌ నిపుణులు సలహా ఇస్తున్నారు. స్వల్పకాలిక అప్‌మూవ్‌ తప్పక ఉంటుందనే సమయంలో ఈ వ్యూహం అనుసరిస్తారు. ఇందులో దిగువ స్టై‍్రక్‌ ప్రైస్‌ వద్ద ఒక కాల్‌ కొని , అధిక స్ట్రైక్‌ ప్రైస్ వద్ద ఒక కాల్‌ను విక్రయిస్తారు. డెరివేటివ్‌ సాధనం పరిమిత అప్‌మూవ్‌ చూపితే ఈ వ్యూహం మంచి లాభాలనిస్తుంది.
నిఫ్టీలో ఈ వ్యూహాన్ని కింది విధంగా పాటించవచ్చు...

ట్రేడర్లు పెట్టుబడికి ముందు సొంత అధ్యయనం తప్పక చేయాలి.



You may be interested

ఎఫ్‌ఎంసీజీ, ఐటీ రంగ షేర్లే మంచి చాయిస్‌!

Monday 12th August 2019

‘ప్రస్తుత పరిస్థితులలో ఎఫ్‌ఎంసీజీ(ఫాస్ట్‌ మూవింగ్‌ కన్జ్యూమర్‌ గూడ్స్‌), ఐటీ సెక్టార్‌ షేర్లు మిగిలిన రంగాల షేర్ల కంటే ఆకర్షిణియంగా ఉన్నాయి. ప్రైవేట్‌ బ్యాంకింగ్‌ సెక్టార్లో కొన్ని సెలక్టివ్‌ స్టాకులను ఎంచుకోవడం మంచిదే’ అని రిలిగేర్‌ బ్రోకింగ్‌ రిసెర్చ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌, అజిత్‌ మిశ్రా ఓ ఇంటర్యూలో తెలిపారు. ఇంటర్యూలోని ముఖ్యంశాలు ఆయన మాటల్లోనే.. మార్కెట్ల బౌన్‌బ్యాక్‌కు పరిమితి.. ఆర్‌బీఐ రేట్ల కోత కాకుండా ప్రభుత్వం ఆర్థిక చర్యలను తీసుకుంటుందనే వార్తలు మీడియాలో వస్తుండడంతో

రిలయన్స్‌ పెట్రో రిటైలింగ్‌ వాటా కోసం బీపీ రూ.7000 కోట్ల చెల్లింపు

Monday 12th August 2019

బ్రిటన్‌ ఇంధన దిగ్గజ కంపెనీ రిలయన్స్‌ బీపీ లిమిటెడ్‌ ఫ్యూయెల్‌ రీటైలింగ్‌ నెట్‌వర్క్స్‌లో 49శాతం వాటా కొనుగోలుకు రూ.7000 కోట్లను చెల్లించనున్నట్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేష్‌ అంబానీ సోమవారం ప్రటించారు. దేశవ్యాప్తంగా పెట్రోల్‌ బంకుల ఏర్పాటుతో పాటు విమాన ఇంధనాన్ని కూడా విక్రయించేందుకు బీపీ లిమిటెడ్‌తో కలిసి జాయింట్‌ వెంచర్‌ ఏర్పాటు చేస్తున్నట్లు గతవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. నేడు జరిగిన కంపెనీ 42 ఏజీఎం సమావేశంలో ముఖేష్‌

Most from this category