News


మార్చి నాటికి నిఫ్టీ@ 12,800!

Wednesday 1st January 2020
Markets_main1577862400.png-30585

హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా
కొత్త ఏడాది తొలి త్రైమాసికం చివరకు నిఫ్టీ 12800 పాయింట్లను చేరుతుందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అంచనా వేసింది. బీఎఫ్‌ఎస్‌ఐ, మెటల్స్‌, ఆయిల్‌, ఆటో, నెట్‌ ఆధారిత రంగాలకు చెందిన షేర్లు కొత్త ఏడాది మంచి ప్రదర్శన చూపవచ్చని అభిప్రాయపడింది. లార్జ్‌క్యాప్స్‌, మిడ్‌ మరియు స్మాల్‌క్యాప్స్‌ మధ్య ప్రదర్శనలో అంతరం కొనసాగుతుందని తెలిపింది. అయితే గతంతో పోలిస్తే ఈ అంతరం కొంత తగ్గవచ్చని పేర్కొంది. దేశీయ మార్కెట్లు రిటైల్‌, హెచ్‌ఎన్‌ఐ నిధులపై కాకుండా ఫండ్స్‌(డీఐఐ, ఎఫ్‌ఐఐ)పై ఆధారపడినంతకాలం పెద్ద స్టాక్స్‌ హవానే కొనసాగుతుందని తెలిపింది. గతంలో ఎన్‌పీఏలకు కారణమైన రంగాల నుంచి మొండి బకాయిలు తగ్గుతాయని, ఇదే సమయంలో కొత్తగా టెలికం, ఎన్‌బీఎఫ్‌సీ, ముద్ర, రిటైల్‌ రంగాల నుంచి ఎన్‌పీఏలు పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. వచ్చే మే నుంచి ఎంఎస్‌సీఐ వెయిటేజ్‌పెరగడం, కంపెనీల్లో ఎఫ్‌పీఐ నిధుల పరిమితి ఏప్రిల్‌ నుంచి పెరగడంతో మరిన్ని విదేశీ నిధులు దేశీయ ఈక్విటీల్లోకి వస్తాయని పేర్కొంది. రూరల్‌ వ్యయాలు, ఇన్‌ఫ్రా వ్యయాల్లో పెరుగుదలకు బడ్జెట్లో ప్రతిపాదనలుండవచ్చని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయం మందకొడిగా పెరుగుతున్నందున విత్త పరిమితులకు లోబడే ఉద్దీపన చర్యలుంటాయని తెలిపింది. 
రిస్కులివే..
వరుసగా రెండు త్రైమాసికాల పాటు వృద్ధి రేటు 5 శాతం దిగువన నమోదు కావడం, వర్షపాతం సాధారణ స్థాయిల కన్నా తక్కువగా ఉండడం, విత్త పరిస్థితులు కట్టుతప్పడం, రూపీ మరింత క్షీణించడం వంటివి కొత్త ఏడాది ఈక్విటీలకు రిస్కులుగా హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ తెలిపింది. అంతర్జాతీయంగా భౌగోళికరాజకీయ ఉద్రిక్తతలు పెరగడం, ట్రేడ్‌వార్‌ పెచ్చురిల్లడం వంటివి మార్కెట్‌ను నెగిటివ్‌గా ప్రభావితం చేయవచ్చని పేర్కొంది. ఈ రిస్కులను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టర్లు కొంత మొత్తాన్ని డెట్‌, బంగారం వంటి సురక్షిత సాధనాల్లో పెట్టుబడిగా పెట్టడం మంచిదని సూచించింది. ఈక్విటీ ఇన్వెస్టర్లు నాణ్యతకే పెద్దపీట వేయాలని సూచించింది. సమయానుగుణంగా ప్రాఫిట్‌బుకింగ్‌ చేస్తూ అప్రమత్తంగా వ్యవహరించాలని సలహా ఇచ్చింది. You may be interested

డిసెంబర్‌లో ఆటో అమ్మకాలు వీక్‌

Wednesday 1st January 2020

మారుతీ వాహన విక్రయాలు 3.9 శాతం అప్‌ మహీంద్రా అండ్‌ మహీంద్రా అమ్మకాల వెనకడుగు గడిచిన డిసెంబర్‌ నెలలో దేశీ ఆటో రంగ అమ్మకాలు అంతంతమాత్రంగానే నమోదయ్యాయి. కొత్త ఏడాది ప్రారంభంకానున్న నేపథ్యంలో కస్టమర్లు కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, వడ్డీ రేట్ల తగ్గుదలపై అంచనాలు వంటి అంశాలు ప్రధానంగా ప్రభావం చూపినట్లు ఆటో రంగ నిపుణులు పేర్కొంటున్నారు. డిసెంబర్‌లో వివిధ ఆటో దిగ్గజాల వాహన విక్రయ గణాంకాలు చూద్దాం.. మారుతీ సుజుకీ కార్ల తయారీ దిగ్గజం

రానున్న 6 నెలల్లో నాణ్యమైన షేర్లదే హవా

Wednesday 1st January 2020

ఆటో రంగ కౌంటర్లు వెలుగులో నిలిచే చాన్స్‌ క్యాపిటల్‌ గూడ్స్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగాలపై దృష్టి మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ్‌ ఖేమ్కా రానున్న ఆరు నెలల కాలంలో అత్యంత నాణ్యమైన, అధిక విలువ కలిగిన కౌంటర్లకే డిమాండ్‌ కొనసాగనున్నట్లు మోతీలాల్‌ ఓస్వాల్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్ధ్‌ ఖేమ్కా తాజాగా అంచనా వేశారు. ఆటో విభాగంలో మారుతీ వంటి పెద్ద కంపెనీలు స్వల్ప వృద్ధిని సాధించవచ్చని అభిప్రాయపడ్డారు. ఒక ఆంగ్ల చానల్‌కు

Most from this category