News


సెన్సెక్స్‌ లాభం 100 పాయింట్లు

Friday 2nd August 2019
Markets_main1564740876.png-27505

ట్రేడింగ్‌లో లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు వారాంతాన్ని స్వల్ప లాభంతో ముగించాయి. సెన్సెక్స్‌ 100 పాయింట్లు లాభపడి 37,118.22 స్థిరపడింది. నిఫ్టీ 17పాయింట్లు పెరిగి 10,997.00 వద్ద ట్రేడింగ్‌ను ముగించింది. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన నిఫ్టీ ఇండెక్స్‌ అరశాతం నష్టపోయి 28,204.95 వద్ద స్థిరపడింది. అటో, ఐటీ, ఆర్థిక, ఫైనాన్‌ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది, మెటల్‌, మీడియా, బ్యాంకింగ్‌, రియల్టీ రంగ షేర్లు నష్టాల్లో ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 762 పాయింట్ల రేంజ్‌లో 36,607.41 - 37,375.16 శ్రేణిలో, నిఫ్టీ 231 పాయింట్ల రేంజ్‌లో 10,848.95- 11,080.15 స్థాయిలో కదలాడింది. ఈ వారం మొత్తం సెన్సెక్స్‌ 765 పాయింట్లు నష్టపోగా, నిఫ్టీ 287 పాయింట్లను కోల్పోయింది.
సెన్సెక్స్‌ 762 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌:-
చైనాపై అమెరికా మరోసారి ట్రేడ్‌వార్‌ ప్రకటించడంతో అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్లు భారీ పతనాన్ని చవిచూసాయి. అక్కడి నుంచి బలహీన సంకేతాలను అందుకుపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు నష్టంతో ట్రేడింగ్‌ ప్రారంభించింది. దీనికి దేశీయంగా నెలకొన్న బలహీన సంకేతాలు తోడవ్వడంతో సూచీలు భారీ నష్టాన్ని చవిచూసాయి. ఇటీవల దేశీయంగా నమోదైన బలహీన ఆర్థిక గణాంకాలు, నిన్న పలు అటో కంపెనీలు వెల్లడించిన జూలై మాసపు విక్రయ గణాంకాలు నిరుత్సాహపరడటం, నెలరోజుల నుంచి ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో పాటు ఇటీవల పలు కంపెనీలు ప్రకటించిన క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర అంశాలు మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఈ మిడ్‌సెషన్‌ కల్లా సెన్సెక్స్‌ 411 పాయింట్లను కోల్పోయి 36,607.41 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లును నష్టపోయి 10,848.95    వద్ద ఇంట్రాడే కనిష్టాన్ని నమోదుచేశాయి. అనంతరం బడ్జె్‌ట్‌లో సంపన్న వర్గాలపై విధించిన సర్‌ ఛార్జీ పన్నుపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ, ప్రధాని కార్యలయం అధికారులతో చర్చిస్తున్నారనే వార్తలు వెలుగులోకి రావడంతో సూచీల పతనం ఆగిపోయింది. అలాగే ఇటీవల మార్కెట్లో భారీ పతనంతో కనిష్టస్థాయిలకు పతనమైన షేర్లు చౌక ధరలకు లభిస్తుండంతో ఇన్వెస్టర్లు, ట్రేడర్లు కొనుగోళ్లకు పూనుకున్నారు. పలితంగా సూచీలు ఉదయం నష్టాలను పూడ్చుకొని లాభాల్లోకి మళ్లాయి. అటో, ఫార్మా, ఆర్థిక రంగ షేర్లు కొనుగోళ్లకు మద్దతు లభించడంతో నిఫ్టీ ఇంట్రాడే కనిష్టం(10,848.95) నుంచి 231 పాయింట్ల రికవరినీ సాధించి 11,080.15 వద్ద, సెన్సెక్స్‌ కనిష్టస్థాయి(36,607.41) నుంచి 668 పాయింట్ల పెరిగి 11,080.15 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని నమోదు చేశాయి. అయితే, మిడ్‌సెషన్‌ అనంతరం విడుదలైన ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సూచీలు లాభాలు కొంతమేరకు హరించుకుపోయాయి. చివరికి సెన్సెక్స్‌ 100 పాయింట్లను, నిఫ్టీ 17 పాయింట్ల లాభంతో 11000ల దిగువున 10,997.35 వద్ద స్థిరపడింది. 
విప్రో, కోల్‌ ఇండియా, ఎస్‌బీఐ, టాటాస్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ఫైనాన్స్‌ 2.50శాతం నుంచి 8.5శాతం నష్టపోగా, మారుతి, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐషర్‌మోటర్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌ షేర్లు 2.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. You may be interested

భారీగా పడిపోయిన ఇండియాబుల్స్‌

Friday 2nd August 2019

రూ.లక్ష​కోట్ల మోసానికి పాల్పడిందనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేరు శుక్రవారం ట్రేడింగ్‌లో 8.61 శాతం నష్టపోయి రూ. 477.00 వద్ద ముగిసింది. ఇండియాబుల్స్‌ రూ.1 లక్ష కోట్ల మోసం చేసినట్లు ఆరోపిస్తూ బిజెపి నాయకుడు సుబ్రమణియన్ స్వామి పిఎం మోడీకి లేఖ పంపిన విషయం తెలిసిందే. కాగా ఈ ఆరోపణలను కంపెనీ ఖండించింది. నేషనల్‌ హౌసింగ్‌ బోర్డు నుంచి రూ. లక్ష కోట్లను మోసం  చేసిందనే సుబ్రమణ్యం

5ఏళ్ల కనిష్టస్థాయికి అశోక్‌లేలాండ్‌

Friday 2nd August 2019

దేశీయ వాణిజ్య వాహన తయారీ దిగ్గజం అశోక్‌లే లాండ్‌ కంపెనీ షేర్లు శుక్రవారం ట్రేడింగ్‌లో 5ఏళ్ల కనిష్టానికి పతనమయ్యాయి. కంపెనీ జూలై మాసపు వాహన విక్రయ గణాంకాలు ఆశించిన స్థాయిలో నమోదుకాకపోవడం ఇందుకు కారణమైంది. నేడు బీఎస్‌ఈలో ఈ కంపెనీ రూ.68.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. నిన్న(ఆగస్ట్‌ 01) కంపెనీ జూలై విక్రయాలు గణాంకాలను విడుదల చేసింది. ఈ జూలైలో మొత్తం అమ్మకాలు 28శాతం క్షీణించి 10927 యూనిట్లను విక్రయించింది.

Most from this category