News


పడినప్పుడల్లా కొనుగోళ్లు: యాక్సిస్‌ సెక్యూరిటీస్‌

Monday 3rd June 2019
Markets_main1559585290.png-26071

నిఫ్టీ మీడియం టర్మ్‌ అప్‌ట్రెండ్‌లో ఉందని, సూచీలు పడినప్పుడల్లా కొనుగోళ్లు చేసుకోవచ్చని యాక్సిస్‌ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ అండ్‌ డెరివేటివ్స్‌ హెడ్‌ రాజేష్‌ పాల్వియా సూచించారు. వీక్లీ చార్ట్‌లో నిఫ్టీ బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచినట్టు చెప్పారు. గరిష్టంలో గరిష్టం, గరిష్టంలో కనిష్టం నమోదు సానుకూలమని పేర్కొన్నారు. నిఫ్టీ టార్గెట్‌ 12,100-12,230గా పేర్కొ‍న్నారు. ఒకవేళ నిఫ్టీ 11,800లోపు ముగిస్తే అమ్మకాలు పెరుగుతాయని, దాంతో సూచీలు 11,750-11,600 వరకు పడిపోవచ్చన్నారు. ఈ వారంలో నిఫ్టీ 12,150-11,800 శ్రేణిలో చలించొచ్చన్న అంచనా వ్యక్తం చేశారు. మీడియం టర్మ్‌లో బ్యాంకు నిఫ్టీ అప్‌ట్రెండ్‌లో ఉందని, పడినప్పుడల్లా కొనుగోలు చేసుకోవాలన్న మా విధానాన్ని కొనసాగిస్తున్నట్టు చెప్పారు. సమీప కాలంలో రాబడులను ఇవ్వగల పలు స్టాక్స్‌ను సాంకేతిక అంశాల ఆధారంగా ఆయన సిఫారసు చేశారు. 

 

హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌
రూ.438-430 శ్రేణిలో కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.423. టార్గెట్‌ రూ.451-460. వీక్లీ చార్ట్‌లో హారిజాంటల్‌ చానల్‌ను ముగింపు ప్రాతిపదికన అధిగమించింది. అధిక వ్యాల్యూమ్స్‌తో బ్రేకవుట్‌ జరిగినందున బుల్లిష్‌ సెంటిమెంట్‌ నెలకొంది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ రెండూ కూడా సానుకూల పరిధిలోనే ఉండడం స్వల్ప కాలంలో పెరుగుదల కొనసాగుతుందని సూచిస్తోంది.  

 

గోద్రేజ్‌ కన్జ్యూమర్‌ ప్రొడక్ట్స్‌
రూ.690-680 శ్రేణిలో కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.672. టార్గెట్‌ రూ.712-727. రోజువారీ చార్ట్‌లో ఈ స్టాక్‌ ఇన్వర్స్‌ హెడ్‌ అండ్‌ హోల్డర్‌ ప్యాటర్న్‌ను ఏర్పరిచింది. రూ.685-680 స్థాయిని ముగింపు ప్రాతిపదికన అధిగమించింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ రెండూ సానుకూల జోన్‌లోనే ఉండడం అప్‌సైడ్‌ కొనసాగుతుందనే దానికి సంకేతం. 

 

ఉజ్జీవన్‌ ఫైనాన్షియల్‌
రూ.361-355 శ్రేణిలో కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.346. టార్గెట్‌ రూ.372-383. వీక్లీ, డైలీ చార్ట్‌ల్లో రూ.357-355 మధ్య పలు నిరోధాలను అధిక వ్యాల్యూమ్స్‌తో చేధించుకుని పై స్థాయిలో క్లోజ్‌ అయింది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ రెండూ సానుకూల పరిధిలోనే ఉండడం బుల్లిష్‌నెస్‌కు సూచిక.  

 

వీగార్డ్‌ ఇండస్ట్రీస్‌
రూ240-236 మధ్య కొనుగోలు చేసుకోవచ్చు. స్టాప్‌లాస్‌ రూ.230. టార్గెట్‌ రూ.250-254. వీక్లీ చార్ట్‌లో ఈ స్టాక్‌ రూ.235-230 మధ్య పలు నిరోధాలను అధిగమించింది. పై స్థాయిలో క్లోజ్‌ అయింది. పైగా పెరిగిన వ్యాల్యూమ్స్‌తో క్లోజ్‌ అవడం బుల్లిష్‌ సెంటిమెంట్‌ను సూచిస్తోంది. ఆర్‌ఎస్‌ఐ, స్టోకాస్టిక్‌ రెండూ సానుకూల జోన్‌లో ఉండడం సమీప కాలంలో అప్‌సైడ్‌ కొనసాగుతుందని సూచిస్తోంది.

నోట్‌: ఇవి విశ్లేషకుల సూచనలు మాత్రమే. ఇన్వెస్ట్‌ చేసే ముందు ఎవరికి వారు స్వయంగా అధ్యయనం చేసిన తర్వాతే, వారి రిస్క్‌ స్థాయిలకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం సముచితం. You may be interested

స్మాల్‌క్యాప్‌లో ఇవి ఆకర్షణీయం..!

Monday 3rd June 2019

ఇన్వెస్టర్ల పెట్టుబడులను హరించే చౌక ధరలో లభించే స్టాక్స్‌ కంటే, అధిక నాణ్యత కలిగిన స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవడం... పెట్టుబడుల వృద్ధిలో కీలకమైన అంశం. ఈ విషయంలో ప్రఖ్యాత ఇన్వెస్టర్‌ వారెన్‌ బఫెట్‌ విధానాన్ని మార్చిన ఇన్వెస్టర్‌ చార్లీ ముంగర్‌. ఆకర్షణీయమైన ధరలో లభించే గొప్ప వ్యాపారం, చౌకగా లభించే చక్కని వ్యాపారం (కంపెనీ) కంటే బలమైనదన్నది చార్లీ ముంగర్‌ సూత్రీకరణ. స్మాల్‌క్యాప్‌ విభాగంలో ఆల్ట్‌మ్యాన్‌ జెడ్‌ స్కోరు 2.99

మూడు ఐటీ స్టాకులపై విశాల్‌మల్కాన్‌ బుల్లిష్‌

Monday 3rd June 2019

రాబోయే రోజుల్లో ఇన్ఫోసిస్‌, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ షేర్లపై బుల్లిష్‌గా ఉన్నామని ప్రముఖ అనలిస్టు విశాల్‌ మల్కాన్‌ చెప్పారు. ఈ మూడు స్టాకుల చార్టుల్లో అప్‌మూవ్‌ సంకేతాలున్నాయన్నారు. 1. ఇన్ఫోసిస్‌: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 802. స్టాప్‌లాస్‌ రూ. 700. చార్టుల్లో బుల్లిష్‌ ఎంగల్ఫింగ్‌ పాటర్న్‌ ఏర్పడింది. ఇటీవల డౌన్‌ట్రెండ్‌లో గత అప్‌మూవ్‌కు 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి వద్ద మద్దతు పొందింది. ప్రస్తుత స్థాయిల్లో లాంగ్స్‌ తీసుకోవచ్చు.  2. విప్రో: కొనొచ్చు.

Most from this category