News


నిఫ్టీలో ర్యాలీ సంకేతాలు!

Saturday 12th October 2019
Markets_main1570869614.png-28844

దేశీయ మార్కెట్లు ఈ వారం వివిధ విభాగాల్లో ట్రెండ్‌ రివర్సల్‌ చూశాయి. ప్రభుత్వం తీసుకుంటున్న అనేక చర్యలు క్రమంగా ఫలితాలు చూపుతున్నట్లు కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ చర్యలకు ఆర్‌బీఐ రేట్‌కట్‌ మూడ్‌ తోడవడంతో సెంటిమెంట్‌ క్రమంగా పాజిటివ్‌ దిశగా మరలుతోంది. ఇది సిప్‌ నిధుల ప్రవాహం పెరగడంలో వెల్లడవుతోంది. ఆగస్టులో రూ. 8200 కోట్ల నిధులు సిప్‌ రూపంలో ఈక్విటీల్లోకి వచ్చాయి. మరోవైపు ఎఫ్‌పీఐల పెట్టుబడుల ఉపసంహరణ వేగం కూడా తగ్గుతున్న సూచనలున్నాయి. టీసీఎస్‌ ఫలితాలు బాగాలేకపోవడం యూఎస్‌ ఎకానమీలో బలహీనతను చూపుతుందని నిపుణులు భావిస్తున్నారు. ట్రేడ్‌వార్‌ ముగింపు ఆవశ్యకతను యూఎస్‌ జీడీపీ తగ్గడం ఎత్తి చూపుతోంది. త్వరలో ఈ సంక్షోభానికి ముగింపు పలకకపోతే యూఎస్‌లో మాంద్యం తప్పదనే సంకేతాలు బలంగా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొనే తాజాగా ట్రంప్‌ ట్రేడ్‌డీల్‌ పాక్షికంగా కుదిరేందుకు పావులు కదిపారు. ఈ నేపథ్యంలో వారం చివర్లో ప్రపంచ ఈక్విటీలన్నీ సందడి చేశాయి. ఇదే వచ్చే వారం కూడా కొనసాగే ఛాన్సులున్నాయి. 


టెక్నికల్స్‌
గత ర్యాలీ నుంచి నిఫ్టీ 50 శాతం పతనమై తిరిగి బౌన్స్‌ చూపింది. ఈ బౌన్స్‌ మరికొంత కాలం కొనసాగవచ్చని టెక్నికల్‌ నిపుణులు చెబుతున్నారు. కానీ గత ర్యాలీతో పోలిస్తే ఈసారి ర్యాలీ నెమ్మదిగా ఉంటుందంటున్నారు. నిఫ్టీ మరోమారు 11670 పాయింట్ల రేంజ్‌ను తాకే అవకాశాలున్నాయి. ప్రస్తుతానికి తగ్గినప్పుడు కొను సూత్రాన్ని పాటించవచ్చు. లాంగ్స్‌కు 11000 పాయింట్లను స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలి. ఇకపై కార్పొరేట్‌ ఫలితాలు సూచీల స్థితిగతులను నిర్ధారిస్తాయి. క్యు2లో కంపెనీలు మిశ్రమ ఫలితాలు ప్రకటించే అవకాశాలున్నాయి. మార్కెట్లు బాగా కరెక్టయి ఉన్నందున, ఎర్నింగ్స్‌ సీజన్‌ అనంతరం క్రమంగా రిటైలర్లు, ఎఫ్‌ఐఐలు కొనుగోళ్ల మూడ్‌లోకి వస్తారని అంచనా. ఇన్వెస్టర్లు ప్రైవేట్‌బ్యాంక్స్‌, మెటల్స్‌, కన్జూమర్స్‌, నిర్మాణరంగాలపై దృష్టి పెట్టవచ్చని నిపుణుల సూచన.



You may be interested

రికార్డు స్థాయికి ఫారెక్స్‌ నిల్వలు

Saturday 12th October 2019

రిజర్వుబ్యాంక్‌ వద్దనున్న ఫారెక్స్‌ నిల్వలు(విదేశీ మారక ద్రవ్య నిల్వలు) అక్టోబర్‌ 4తో ముగిసిన వారంలో రికార్డుస్థాయికి చేరుకున్నాయి. తాజాగా ముగిసిన వారంలో విదేశీ మారక నిలవ్లు 4.24 బిలియన్‌ డాలర్లు పెరిగి 437.83 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నట్లు ఆర్‌బీఐ(రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) ఓ నివేదికలో పేర్కొం‍ది. ఈ వారానికి ముందు వారంలో ఈ నిల్వలు 5.02 బిలియన్‌ డాలర్లు పెరిగి 433.59 బిలియన్‌ డాలర్లకు చేరుకోవడం గమనార్హం. విదేశీ కరెన్సీ(ఎఫ్‌సీఏ) నిల్వలు పెరగడంతో

రూ. 38,000 దిగువకు ఎంసీఎక్స్‌ గోల్డ్‌!

Saturday 12th October 2019

  యుఎస్‌-చైనా మధ్య పాక్షిక వాణిజ్య ఒప్పందం కుదరడంతో పాటు, బ్రెక్సిట్‌ పురోగతి సాధించడంతో బంగారం ధరలు శుక్రవారం నష్టపోయాయి. యుఎస్‌ గోల్డ్‌ ప్యూచర్స్‌ 0.50 శాతం పడిపోయి 1,489.80 డాలర్లకు చేరుకుంది. అదే విధంగా దేశీయ ఎంసీఎక్స్‌ బంగారం 0.82 లేదా రూ. 314 నష్టపోయి రూ. 37845.00 వద్ద ముగిసింది. ‘యుఎస్‌-చైనా మధ్య పాక్షిక ఒప్పందం కుదరడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ బలపడింది. ఫలితంగా రిస్క్‌ ఉన్న ఆస్తులలో

Most from this category