News


కన్సాలిడేషన్‌ దశలో నిఫ్టీ

Saturday 28th September 2019
Markets_main1569646733.png-28599

నిఫ్టీ 50 శుక్రవారం ట్రేడింగ్‌లో లాభాల్లో ప్రారంభమైనప్పటికి 11,600 స్థాయి వద్ద నుంచి  వెనుతిరిగింది. చివరికి రోజువారి చార్టులో బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచి 11,500 సమీపంలో ముగిసింది. గత సెషన్‌లో నిఫ్టీ 58.80 పాయింట్లు కోల్పోయి 11,512 వద్ద క్లోజయిన విషయం తెలిసిందే.
‘‘స్వల్పకాలానికి గాను ​‘పతనమయినప్పుడు కొనుగోలు చేయడమనే’ వ్యూహాన్ని నిఫ్టీ విషయంలో అనుసరించడం మంచిది. పోజిషన్స్‌ తీసుకునే ట్రేడర్లు నిఫ్టీ 11,400-11,380 స్థాయి వద్ద కొత్తగా లాంగ్‌పోజిషన్‌లను తీసుకోవచ్చు. ఎగువన నిఫ్టీ స్వల్పకాల లక్ష్యంగా తాజా గరిష్ఠమయిన 11,694 స్థాయి పనిచేస్తుంది. దీంతో పాటు 11,790 కూడా ఎగువన నిఫ్టీ లక్ష్యంగా ఉండగలదు’ అని షేరఖాన్‌, గౌరవ్‌ రత్నపర్ఖి అన్నారు.
స్పిన్నింగ్‌ టాప్‌ నమూనా..
  నిఫ్టీ, వారపు చార్టులో ‘స్పిన్నింగ్‌ టాప్‌’ క్యాండిల్‌ నమూనాను ఏర్పాటు చేసిందని, దీనిని బట్టి నిఫ్టీపై బుల్స్‌, బేర్స్‌ సమానంగా ప్రభావం చూపుతున్నారని సాంకేతిక నిపుణులు తెలిపారు. కాగా ఈ వారం ప్రారంభం‍లో భారీ గ్యాప్‌ అప్‌తో నిఫ్టీ ప్రారంభమైనప్పటికి ఈ నమూనా ఏర్పడడం గమనించవలసిన విషయం.
‘తాజా నిఫ్టీ కదలికలను గమనిస్తే, నిఫ్టీ కన్సాలిడేషన్‌ దశలో ఉందనే విషయం తెలుస్తుంది. ఫలితంగా నిఫ్టీ కొత్తగా బ్రేక్‌ ఔట్‌ కోసం చూస్తోంది. 11,695 స్థాయిపైన నిఫ్టీ ముగియగలిగితే ఈ బ్రేక్‌ ఔట్‌ ఏర్పడే అవకాశం ఉం‍ది. వారపు చార్జులో దిగువన 11,416-11,382 స్థాయి పరిధిలో నిలదొక్కుకోవడం నిఫ్టీకి చాలా అవసరం’ అని చార్ట్‌వ్యూఇండియా.ఇన్‌, మజ్హర్‌ మహమ్మద్‌ అన్నారు. నిఫ్టీ ముమెంటమ్‌ ఆస్కిలేటర్స్‌ అమ్మకం మోడ్‌లో ఉన్నాయని, నిఫ్టీ 11,695 స్థాయిని దాటేంత వరకు కొత్తగా లాంగ్‌పొజిషన్‌లను ట్రేడర్లు తీసుకోవద్దని ఆయన సలహాయిచ్చారు.You may be interested

అమెరికా నుంచి భారీ చమురు దిగుమతులు

Saturday 28th September 2019

ఏప్రిల్‌-ఆగస్టు మధ్య 72 శాతం అప్‌ మొదటి స్థానం ఇరాక్‌దే మొత్తంగా తగ్గిన దిగుమతులు న్యూఢిల్లీ: అమెరికా నుంచి భారత్‌కు చమురు దిగుమతులు గణనీయంగా పెరుగుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) మొదటి ఐదు నెలలూ- ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకూ చూస్తే, (2018 ఇదే కాలంతో పోల్చి) చమురు దిగుమతులు 72 శాతం పెరిగాయి. అయితే చమురు దిగుమతుల విషయంలో మొదటి స్థానంలో ఇరాక్‌ నిలిచింది.  భారత్‌ సాంప్రదాయకంగా మధ్యప్రాశ్చ్య దేశాల నుంచే

చిన్న పరిశ్రమలకు డబ్బు కొరత రానీయం!

Saturday 28th September 2019

ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ వివిధ మంత్రిత్వశాఖల నుంచి రూ.40,000 కోట్ల బకాయిలు చెల్లింపు అక్టోబర్‌ మొదటివారంలోపు మిగిలిన బకాయిల బదలాయింపు మంత్రిత్వశాఖల వ్యయ ప్రణాళికలకు సూచన  తద్వారా ఆర్థిక వృద్ధికి జోష్‌ న్యూఢిల్లీ: చిన్న లఘు మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్‌ఎంఈ) నిధుల కొరత రాకుండా తగిన అన్ని చర్యలనూ కేం‍ద్రం తీసుకుంటుందని ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. వస్తు, సేవల సరఫరాలకు సంబంధించి వివిధ మంత్రిత్వశాఖలు, విభాగాల నుంచి ఎంఎస్‌ఎంఈలకు రూ.40,000 కోట్ల బకాయిలను

Most from this category