News


మూడురోజుల లాభాలకు బ్రేక్‌...!

Tuesday 20th August 2019
Markets_main1566297281.png-27901

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు నష్టాలతో ముగిశాయి. ఫలితంగా మార్కెట్‌ మూడురోజుల వరుస లాభాలకు మంగళవారం ముగింపు పడినట్లైంది. సెన్సెక్స్‌ 74 పాయింట్ల నష్టంతో 37328 వద్ద, నిఫ్టీ 37 పాయింట్లను కోల్పోయి 11017 వద్ద స్థిరపడింది. ఐటీ, అటో, ఫార్మా షేర్ల తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయాయి. బ్యాంకింగ్‌, రియల్టీ, ఎఫ్‌ఎంజీసీ, ఫైనాన్స్‌, మెటల్‌, రియల్టీ షేర్ల అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోన్నాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 203 పాయింట్ల నష్టపోయి 27,982.45 వద్ద స్థిరపడింది. ఆర్థిక మాంద్య పరిస్థితులను అధిమించే దిశగా పలు దేశాల సెంట్రల్‌ బ్యాంకులు ఉద్దీపన చర్యలను ప్రకటించడంతో మార్కెట్‌ నేడు కూడా లాభంతో ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్‌ 40 పాయింట్ల లాభంతో 37,441 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల పెరిగి 11,064 పాయింట్ల మొదలయ్యాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 291 పాయింట్ల రేంజ్‌లో 37,219.90 -37,511.55 శ్రేణిలో కదలాడగా, నిఫ్టీ 109 పాయింట్ల శ్రేణిలో 10,985.30 - 11,076.30 స్థాయిలో కదలాడింది.  

ఇండస్‌ఇండ్‌, ఆల్ట్రాటెక్‌, బ్రిటానియా, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ ఫైనాన్స్‌, యస్‌ బ్యాంక్‌ షేర్లు 2.50శాతం నుంచి 6.50శాతం నష్టపోగా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటామోటర్స్‌, మారుతి షేర్లు 2శాతం నుంచి 4శాతం లాభపడ్డాయి. 



You may be interested

ప్రారంభం ఫ్లాట్‌

Wednesday 21st August 2019

క్రితం రోజు ఫ్లాట్‌గా ప్రారంభమై రోజంతా హెచ్చుతగ్గులకు లోనైన తర్వాత స్వల్పనష్టాలతో ముగిసిన భారత్‌ స్టాక్‌ సూచీలు బుధవారం సైతం ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ క్రితం ముగింపుతో పోలిస్తే దాదాపు స్థిరంగా 37,320 పాయింట్ల సమీపంలోనూ, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 11,018 పాయింట్ల సమీపంలోనూ మొదలయ్యాయి. 

ఫండ్‌ మేనేజర్లు అధికంగా ‘బై’, ‘సెల్‌’ చేసిన స్టాకులు

Tuesday 20th August 2019

ఈ ఏడాది జులై నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌(ఎంఎఫ్‌) నికరంగా రూ. 14,846.75 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశాయని ఐసీఐసీఐ డైరక్ట్‌ తెలిపింది. అంతేకాకుండా జులై నెలలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నుంచి ఈక్విటీ ఫండ్స్‌లోకి ఇన్‌ఫ్లో జూన్‌ నెలతో పోల్చుకుంటే 6 శాతం పెరిగిందని, జూన్‌ నెలలో ఈ ఇన్‌ఫ్లో రూ. 7,663 కోట్లుండగా, జులై నెలలో రూ. 8,113 కోట్లకు పెరిగిందని వివరించింది. సిప్‌(సిస్టమేటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌) ఇన్‌ఫ్లో

Most from this category