News


39000 దిగువన సెన్సెక్స్‌

Tuesday 21st May 2019
Markets_main1558434355.png-25867

  • మార్కెట్లో లాభాల స్వీకరణ
  • 119 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ

ముంబై: క్రితం ట్రేడింగ్‌లో భారీగా లాభపడిన సూచీల్లో నేడు లాభాల స్వీకరణ జరగడంతో మార్కెట్‌ నష్టాలతో ముగిసింది. బెంచ్‌మార్క్‌ సూచీలైన సెన్సెక్స్‌ 382 పాయింట్లను కోల్పోయి 39000 పాయింట్ల దిగువున 38,970, నిఫ్టీ 119 పాయింట్లు నష్టపోయి 11,709.10 పాయింట్ల వద్ద ముగిశాయి. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి ఒడిదుడుకుల ట్రేడింగ్‌ కూడా మార్కెట్‌ సెంటిమెంట్‌పై ప్రభావాన్ని చూపింది. ఫలితంగా సూచీల మూడురోజుల వరుస ర్యాలీకి నేడు ముగింపు పడినట్లైంది. ఇంట్రాడేలో అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టపోయినప్పటికీ... అటో, మెటల్‌, మీడియా రంగ షేర్ల ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్ల క్షీణతతో బ్యాంకు నిఫ్టీ ఇండెక్స్‌ 444 పాయింట్లను నష్టపోయి 30,317 వద్ద స్థిరపడింది.  

భాజపా తిరిగి అధికారాన్ని హస్తగతం చేసుకోబోతోందన్న ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలతో 10ఏళ్లలో అతిపెద్ద ర్యాలీ జరిపిన మార్కెట్‌ నేడు కూడా లాభంతో మొదలైంది. సెన్సెక్స్‌ 97 పాయింట్ల లాభంతో 39,500 వద్ద, నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో 11,863 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే అధిక వెయిటేజి కలిగిన హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టైటాన్‌ కంపెనీల షేర్లు రికార్డు ర్యాలీ చేయడంతో సెన్సెక్స్‌ 219 పాయింట్లు లాభపడి 39,571.73 వద్ద, నిఫ్టీ 55 పాయింట్లు పెరిగి 11,883.55 వద్ద వాటి కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. మిడ్‌సెషన్‌ వరకు సాఫీగా ర్యాలీ చేసిన సూచీల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ముఖ్యంగా టాటామోటర్స్‌ 6.50శాతం నష్టపోవడంతో అటోరంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఈ క్రమంలో సెన్సెక్స్‌ 468 పాయింట్లు నష్టపోయి 38,884 వద్ద, నిఫ్టీ 146 పాయింట్లను కోల్పోయి 11,682.80 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేసాయి. అయితే యూరప్‌ మార్కెట్ల లాభాల ప్రారంభంతో అ‍మ్మకాలు కొంతవరకు తగ్గాయి. మార్కెట్‌ ముగింపు సమయానికి సెన్సెక్స్‌ 38969 వద్ద, నిఫ్టీ 11,709.10 వద్ద స్థిరపడ్డాయి.

ఇండస్‌ ఇండ్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌, జీ లిమిటెడ్‌, టాటామోటర్స్‌ షేర్లు 3.50శాతం నుంచి 6.50శాతం నష్టపోగా, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, బ్రిటానియా, టైటాన్‌, ఇన్ఫ్రాటెల్‌, డాక్టర్‌ రెడ్డీస్‌ షేర్లు 1శాతం నుంచి 3శాతం వరకూ లాభపడ్డాయి. 



You may be interested

దూకుడొద్దు... కాస్త నిదానం..!

Wednesday 22nd May 2019

దేశీయ మార్కెట్లు సోమవారం చాలా దూకుడు ప్రదర్శించి మంగళవారం చల్లబడిపోయాయి. ఒక శాతం వరకు నష్టపోయాయి. ప్రధానంగా గరిష్టాల వద్ద విక్రయాలు చేయడం మార్కెట్ల నష్టాలకు కారణం. ఎన్నికల ఫలితాలకు ముందు ఇన్వెస్టర్లు ఒకింత అప్రమత్తత ప్రదర్శించినట్టు విశ్లేషకులు పేర్కొంటున్నారు. లాభపడి, నష్టపోయిన షేర్ల నిష్పత్తి సైతం సానుకూలంగా లేకపోవడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇక వోలటాలిటీ ఇండెక్స్‌ వీఐఎక్స్‌ 9.23 శాతం పెరిగి 25.86కు చేరిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల

2014 స్థాయి లాభాలు రిపీట్‌ కావు

Tuesday 21st May 2019

ప్రముఖ ఇన్వెస్టర్‌ రాకేశ్‌ ఝన్‌ఝన్‌వాలా ఎగ్జిట్‌ పోల్స్‌లో ఎన్‌డీఏ ప్రభుత్వం మరలా వస్తుందన్న అంచనాలు మార్కెట్లో జోష్‌ నింపాయి. దీంతో సోమవారం సూచీలు దాదాపు 4 శాతం లాభపడ్డాయి. కానీ ఒక్కరోజుకే ఈ ఉత్సాహం ఆవిరైంది. మంగళవారం సూచీలు దాదాపు ఒక్క శాతం నష్టపోయాయి. చాలా మంది ఇన్వెస్టర్లు అప్రమత్తతతో ప్రాఫిట్‌బుకింగ్‌కు దిగారు. ఈ నేపథ్యంలో గురువారం నిజ ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఎగ్జిట్‌ పోల్స్‌లో చెప్పినట్లు ఎన్‌డీఏ ప్రభుత్వం

Most from this category