News


నిఫ్టీ 10శాతం‍ క్రాష్‌... ట్రేడింగ్‌ నిలిపివేత..!

Friday 13th March 2020
Markets_main1584072130.png-32451

  • 45నిమిషాల​తరువాత ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభం

ప్రపంచఈక్విటీ మార్కెట్లలో అల్లకల్లోం సృష్టించిన కోవిద్‌-19 వ్యాధి శుక్రవారం భారత్‌ మార్కెట్‌ను కబళించింది. కోవిద్‌-19 వ్యాధి దెబ్బకు స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ నిలిచిపోయింది. మార్కెట్‌ ప్రారంభమైన 6నిమిషాలకే ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌, నిఫ్టీ సూచీలు 10శాతం నష్టాన్ని చవిచూడటంతో ట్రేడింగ్‌ను నిలిపివేస్తున్నట్లు ఎక్చ్సేంజీలు ప్రకటించాయి. సెన్సెక్స్‌ 9.50శాతం నష్టాన్ని చవిచూసి 29687.52 వద్ద,  నిఫ్టీ 10శాతం క్షీణించి 8624.05 వద్ద నిలిచిపోయాయి. ట్రేడింగ్‌ తిరిగి 45నిమిషాల తరువాత మొదలవుతుందని ఎక్చ్సేంజీలు తెలిపాయి. ప్రీ-ఓపెన్‌ సెషన్‌ గం.10:05ని.ల నుంచి 10:20ని.లకు మధ్య జరుగుతుందని, అనంతరం సాధారణ ట్రేడింగ్‌ మొదలవుతుంది. 

భారత్‌లో కరోనా వైరస్‌ వ్యాధి సోకిన వారి సంఖ్య 78కి చేరడంతో పాటు ఒకరు మృత్యవాత పడినట్లు వైద్యశాఖ అధికారులు ధృవీకరించారు. మరోవైపు నేడు ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ నిన్నటి ముగింపు(74.23) స్థాయిలో పోలిస్తే 17పైసలు బలహీనపడి 74.40 వద్ద మొదలైంది. దేశీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి పెట్టుబడులు తరిలిపోవడం ఆగిపోవడంలేదు. నిన్న విడుదలైన ఐఐపీ, సీపీఐ గణాంకాలు పర్వాలేదనిపించాయి.

ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ వ్యాధి బాధితుల సంఖ్య 134,670 చేరుకోగా, మొత్తం 4,973 మంది మరణించినట్లు తెలుస్తోంది. వ్యాధి రోజురోజూ మరింత ఉగ్రరూపం దాల్చడంతో అంతర్జాతీయంగా ఉత్పత్తి భారీగా తగ్గుముఖం పట్టింది. ప్రపంచఆర్థిక వ్యవస్థ సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లినట్లు పలువురు ఆర్థిక నిపుణులు చెబుతారు. అంతర్జాతీయ ఆర్థిక మందగన భయాలతో ప్రపంచఈక్విటీ మార్కెట్లు చిగురుటాకులా వణుకుతున్నాయి. నిన్నటి రోజున అమెరికా ప్రధాన సూచీలైన డోజోన్స్‌, ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ 10 శాతం నష్టపోగా, యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే మరింత అధికంగా 12 శాతం కుప్పకూలాయి. నేడు  ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. జపనీస్‌ ఇండెక్స్‌ నికాయ్‌ 10 శాతం పడిపోయింది. 40 నెలల కనిష్టాన్ని తాకింది. గడిచిన నెలరోజుల్లో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు దాదాపు నెలరోజుల్లో దాదాపుగా 30శాతం వరకు నష్టాన్ని చవిచూశాయి.

నిఫ్టీ -50 సూచీలో.... టెక్‌ మహీంద్రా, గెయిల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, బీపీసీఎల్‌, కోటక్‌ బ్యాంక్‌ షేర్లు 15శాతం నుంచి 20శాతం వరకు నష్టపోయాయి. ఏ ఒక్క షేరు కూడా లాభపడలేదు. You may be interested

స్టాక్స్‌, పసిడి, చమురు.. బేర్‌ బేర్‌

Friday 13th March 2020

కరోనా సునామీ.. 10 శాతం పతనమైన అమెరికన్‌ స్టాక్‌ మార్కెట్లు 12 శాతం పడిపోయిన యూరోపియన్‌ ఇండెక్సులు 10 శాతం కుప్పకూలిన జపనీస్‌ ఇండెక్స్‌ నికాయ్‌ బంగారం, చమురు ధరలు సైతం నేలచూపులో ఉన్నపళాన బిలియన్లకొద్దీ డాలర్లను పంప్‌ చేస్తున్న ఫెడ్‌ సెన్సెక్స్‌, నిఫ్టీ 10 శాతం పతనం- ట్రేడింగ్‌ నిలిపివేత వుహాన్‌లో పుట్టి ప్రపంచ దేశాలను ఉసూరుమనిపిస్తున్న కరోనా రక్కసి మరోసారి కోరలు చాస్తోంది. వెరసి ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లన్నీ అమ్మకాల బీపీతో కుప్పకూలుతున్నాయి. ఈ దెబ్బతో

మార్కెట్లలో నేడు మళ్లీ మహా పతనం?

Friday 13th March 2020

భారీ గ్యాప్‌ డౌన్‌తో ఓపెనింగ్‌ నేడు! ప్రపంచ మార్కెట్లలో కరోనా సునామీ 588 పాయింట్లు కుప్పకూలిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ  యూరప్‌, యూఎస్‌ మార్కెట్లు 12-10 శాతం డౌన్‌ 13 ఏళ్లలో అత్యధిక పతనం ఆసియా మార్కెట్లలోనూ అమ్మకాల వెల్లువ 40 నెలల కనిష్టానికి జపాన్‌- నికాయ్‌ 10 శాతం డౌన్‌ నేడు(శుక్రవారం) దేశీ స్టాక్‌ మార్కెట్లు మరోసారి పతనం(గ్యాప్‌ డౌన్‌)తో ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఉదయం  8.30 ప్రాంతం‍లో 588 పాయింట్లు పడిపోయి 8,892 వద్ద

Most from this category