News


నిఫ్టీ తక్షణ నిరోధం 11,710

Monday 15th April 2019
Markets_main1555301859.png-25125

వెల్లువలా వచ్చిపడుతున్న విదేశీ ఇన్వెస్టర్ల నిధుల కారణంగా వారం రోజుల క్రితమే సెన్సెక్స్‌, నిఫ్టీలు కొత్త రికార్డు సాధించినప్పటికీ, అటుతర్వాత ముందడుగు వేయలేకపోయాయి. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికలు ఇందుకు ఒక కారణమైతే, క్యూ4 ఫలితాల కోసం ఇన్వెస్టర్లు వేచిచూసే ధోరణిని అవలంబించడం మరో కారణం. గత శుక్రవారం మార్కెట్‌ ముగిసిన తర్వాత వెలువడిన ఐటి దిగ్గజాలు టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ల ఫలితాలు విశ్లేషకుల అంచనాల్ని అందుకోలేకపోయాయి. ఈ ఫలితాలపై మార్కెట్‌ ఇంకా స్పందించాల్సివుంది. మరిన్ని కీలక కంపెనీల ఫలితాలు ఈ వారం వెల్లడికానున్నాయి. మరోవైపు అమెరికా-చైనాల మధ్య వాణిజ్య చర్చలు తుదిదశకు చేరుకున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో స్టాక్‌ సూచీలు రికార్డుస్థాయిల్ని అధిక ట్రేడింగ్‌ పరిమాణంతో అధిగమించి, ముగిస్తేనే తదుపరి అప్‌ట్రెండ్‌ సాధ్యపడుతుందన్నది సాంకేతిక విశ్లేషకుల అంచనా.   ఇక మన సూచీల సాంకేతిక అంశాల విషయానికొస్తే... 

సెన్సెక్స్‌ సాంకేతికాలు...
ఏప్రిల్‌ 12తో ముగిసిన వారంలో కేవలం 1.5శాతం పరిమితశ్రేణిలో కదిలిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 95 పాయింట్ల నష్టంతో 38,767 పాయింట్ల వద్ద ముగిసింది. గత వారంలో హెచ్చుతగ్గులకు లోనైన 39,040-38,460 శ్రేణిని ఈ వారం ఎటువైపు ఛేదిస్తే అటు సెన్సెక్స్‌ కదిలే అవకాశం వుంటుంది. 39,040 పాయింంట్ల తొలి నిరోధాన్ని దాటితే 39,120-39,270 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. అటుపైన ముగిస్తే వేగంగా 39,500 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు.  ఈ వారం తొలి అవరోధాన్ని దాటలేకపోతే 38,555 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభిస్తున్నది. ఈ స్థాయి దిగువన వేగంగా 38,460 పాయింట్ల వద్దకు క్షీణించవచ్చు. ఈ స్థాయిని సైతం కోల్పోతే 38,150 పాయింట్ల వరకు తగ్గొచ్చు. 


నిఫ్టీ తక్షణ నిరోధం 11,710
ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ గతవారం 160 పాయింట్ల శ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనైన అనంతరం అంతక్రితం వారంతో పోలిస్తే 23 పాయింట్ల స్వల్పనష్టంతో 11,643 పాయింట్ల వద్ద ముగిసింది. గతవారం నిఫ్టీ కదలిన 11,550-11,710 పాయింట్ల శ్రేణిని ఈ వారం ఎటువైపు ఛేదిస్తే అటు సూచీలు ప్రయాణించవచ్చు. ఈ వారం మార్కెట్‌ పెరిగితే తొలుత 11,710 పాయింట్ల స్థాయి నిరోధించవచ్చు. ఈ స్థాయిని దాటితే 11,760 పాయింట్ల స్థాయి వద్ద గట్టి అవరోధం కలగవచ్చు.  డబుల్‌టాప్‌గా పరిణమించిన ఈ అవరోధంపైన వేగంగా 11,810-11,830 పాయింట్ల శ్రేణిని అందుకోవొచ్చు. ఈ వారం తొలి అవరోధాన్ని దాటలేకపోతే 11,605 పాయింట్ల వద్ద తక్షణ మద్దతు లభించవచ్చు. ఈ స్థాయిని కోల్పోతే 11,550 పాయింట్ల  వద్దకు తగ్గవచ్చు. ఈ స్థాయిని ముగింపులో వదులుకుంటే 11,450 పాయింట్ల వరకు క్షీణించొచ్చు.



You may be interested

వారం కనిష్టానికి పసిడి

Monday 15th April 2019

అంతర్జాతీయ మందగమన ఆందోళనలు తగ్గముఖం పట్టడంతో ప్రపంచమార్కెట్లో పసిడి ధర సోమవారం వారం రోజుల కనిష్టానికి పతనమైంది. ఆసియా మార్కెట్లో సోమవారం ఉదయం 3.25డాలర్లు క్షీణించి 1,291.95 వద్ద ట్రేడ్‌ అవుతోంది. చైనా ఆర్థిక గణాంకాలు మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలకు మించి నమోదు కావడంతో పాటు ఇటీవల అమెరికా విడుదల చేస్తున్న త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో అంతర్జాతీయ ఆర్థిక మందగమనం తగ్గుముఖం పట్టినట్లు విశ్లేషకులంటున్నారు. చైనా ఎగుమతి గణాంకాలు

క్యూ4 ఫలితాలు, ఆర్థిక గణాంకాలతో దిశా నిర్దేశం..

Monday 15th April 2019

- రిలయన్స్ ఇండస్ట్రీస్, విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఆర్‌బీఎల్ బ్యాంక్‌ ఫలితాలు ఈవారంలోనే.. - ఏప్రిల్‌ 18న జరిగే రెండో విడత పోలింగ్‌పై మార్కెట్‌ దృష్టి - సోమవారం వెల్లడికానున్న డబ్ల్యూపీఐ, బ్యాలెన్స్‌ ఆఫ్‌ ట్రేడ్‌ డేటా - గురువారం మానిటరీ పాలసీ మినిట్స్, శుక్రవారం విదేశీ మారక నిల్వల డేటా వెల్లడి - ఈవారంలో 3 రోజులకే పరిమితమైన మార్కెట్‌ ట్రేడింగ్‌ ముంబై: ఐటీ దిగ్గజాలైన టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌ ఫలితాల ప్రకటనతో గతేడాది క్యూ4 (జనవరి–మార్చి)

Most from this category