News


10,981కు దిగువనే ఉంటే మరింత క్షీణత..

Thursday 29th August 2019
Markets_main1567101723.png-28097

నిఫ్టీ కీలకమైన 200 డీఎంఏ 11,207కు దిగువనే కొనసాగుతండడం, ఆ లోపు నిరోధ స్థాయిలను కూడా అధిగమించలేకపోవడంతో తదుపరి సెషన్లలో కదలికలను గమనించాల్సి ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. నిఫ్టీ 11,000 మార్క్‌పైన కొసాగలేకపోయిందని, 11,150 స్థాయి, 200 డీఎంఏను దాటనంత వరకు స్థిరమైన అప్‌సైడ్‌కు అవకాశం లేదని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. 

 

‘‘నిఫ్టీ ఎగువవైపు 11,150, దిగువవైపు 10,780 మధ్య శ్రేణిని ఏర్పాటు చేసింది. డైలీ చార్టుల్లో నిర్మాణం అస్పష్టంగా ఉంది. బేరిష్‌ వైపుగా అస్థిరతలతో కొనసాగొచ్చు. నిఫ్టీ మునుపటి గరిష్టమైన 11,150తోపాటు 200డీఎంఏ అయిన 11,207ను అధిగమించనంత వరకు స్థిరమైన ర్యాలీకి అవకాశం లేదు. కీలకమైన నిరోధాలను అర్థవంతంగా అధిగమించనంత వరకు అధిక స్థాయిల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతుంది. నిఫ్టీ 20డీఎంఏ అయిన 10,981 దిగువకు పడిపోయింది. సోమవారం మార్కెట్‌కు సెలవు. ఎక్కువ రోజుల విరామం నేపథ్యంలో ఇన్వెస్టర్లు వేచి చూసే ధోరణి అనుసరించినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అధిక ఎక్స్‌పోజర్‌కు వెళ్లకుండా, లాభాలను కాపాడుకునే ధోరణిలో వెళ్లాలని ట్రేడర్లకు సూచన’’అని మిలాన్‌ వైష్ణవ్‌ సూచించారు.  

 

నిఫ్టీకి 11,080-11,140 తక్షణ నిరోధాలు అవుతాయని, త్వరలోనే వీటిని దాటాల్సి ఉంటుందని ఏంజెల్‌ బ్రోకింగ్‌కు చెందిన రుచిత్‌జైన్‌ పేర్కొన్నారు. ‘‘మునుపటి స్థాయిలోనే సూచీ స్థిరపడి, పెద్దగా ధరల పరంగా నష్టం లేకపోతే... ఇన్వర్టడ్‌ హెడ్‌ అండ్‌ షోల్డర్‌ను ఏర్పాటు చేసేందుకు అధిక అవకాశాలు ఉంటాయి. ప్రస్తుత కరెక్షన్‌ రివర్సల్‌ ప్యాటర్న్‌ దిశగా సరైన షోల్డర్‌ను ఏర్పాటు చేస్తోంది. 11,142ను అధిగమించడం ద్వారానే ఇది ధ్రువీకరణ అవుతుంది. ట్రేడర్లు తటస్థంగా ఉండడం మంచిది’’ అని చార్ట్‌వ్యూ ఇండియాకు చెందిన మజర్‌ మహమ్మద్‌ వివరించారు. ‘‘నిఫ్టీ-50కి 10,880-10,850 మద్దతు స్థాయిలు. 11,080-11,141 దిశగా వెళ్లాలంటే సూచీ 11,000ను దాటడంతోపాటు పైన నిలదొక్కుకోవాలి’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌కు చెందిన చందన్‌ తపారియా సూచించారు.



You may be interested

మార్కెట్లకు కొత్త శిఖరాలు ఇప్పట్లో లేనట్టే..!??

Thursday 29th August 2019

నిపుణుల అంచనాలు ‘దేశీయ స్టాక్స్‌ వచ్చే ఏడాది పెరగొచ్చు.. కానీ ఇటీవలి నష్టాలను పూడ్చుకునే స్థాయిలో కాదు’... రాయిటర్స్‌ సంస్థ నిర్వహించిన పోల్‌లో ఎక్కువ మంది నిపుణులు చెప్పిన అభిప్రాయం ఇది.  ప్రస్తుత ఆర్థిక మందగమనం, బలహీన కార్పొరేట్‌ ఎర్నింగ్స్‌ విషయంలో వీరు ఆందోళన వ్యక్తం చేశారు. బీఎస్‌ఈ ఈ ఏడాది ఇప్పటి వరకు 4 శాతం పెరగ్గా... జూన్‌లో జీవితకాల గరిష్ట స్థాయి నుంచి చూస్తే 10 శాతం పడిపోయింది.

రెండోరోజూ కొనసాగిన నష్టాలు

Thursday 29th August 2019

383 పాయింట్లు నష్టపోయి సెన్సెక్స్‌ 10950 దిగువన ముగిసిన నిఫ్టీ  ఆర్థిక మందగమన, అమెరికా-చైనాల మధ్య వాణిజ్య భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో మార్కెట్‌ పతనం రెండోరోజూ కొనసాగింది. ఫలితంగా సెన్సెక్స్‌ 383 పాయింట్ల నష్టంతో 37,068.93 వద్ద, నిఫ్టీ 98 పాయింట్లను కోల్పోయి 10,948 వద్ద స్థిరపడింది. నేడు ఆగస్ట్‌ ఎఫ్‌ఎండ్‌ఓ కాంటాక్టు గడువు ముగింపు నేపథ్యంలో ట్రేడర్లు తమ పొజిషన్లను సెప్టెంబర్‌ సిరీస్‌కు రోలోవర్‌ మార్చుకోనున్న నేపథ్యంలో సూచీలు తీవ్ర

Most from this category