News


ఈ ఏడాది చివరి నాటికి 10000 స్థాయికి నిఫ్టీ

Wednesday 28th August 2019
Markets_main1566982857.png-28074

ఈ ఏడాది చివరి నాటికి నిఫ్టీ-50 సూచీ 10,000 స్థాయికి దిగి వచ్చే  అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని జిమిత్‌ మోదీ అంచనా వేస్తున్నారు. నిఫ్టీలో టాప్‌-10 ఆర్థిక రంగ షేర్లలో ఏర్పడబోయే అదనపు దిద్దుబాటు ఇందుకు కారణమవచ్చని జీమీత్ చెప్పుకొచ్చారు. ఇందుకు ఫైనాన్షియల్‌ రంగంలోని టాప్‌ 10 స్టాకులు అధిక వాల్యూషన్ల వద్ద ఉండడమే కారణం కావచ్చన్నారు. ఈ స్థాయిలో వాల్యూషన్లు పెరగడానికి ఈ ఏడాది ఫైనాన్షియల్స్‌ జరిపిన భారీ ర్యాలీ కారణమని, అందువల్ల ఇవన్నీ చాలా ఎక్కువ వాల్యూషన్లకు చేరాయని చెప్పారు. అయితే మార్కెట్లు అసమతుల్యతను ఎక్కువకాలం కొనసాగించవని, అందువల్ల ఏదో ఒకసమయంలో ఇంత ర్యాలీకి సరిపడా కరెక‌్షన్‌ ఈ స్టాకుల్లో రాక తప్పదని హెచ్చరించారు. 

1997లో ఏర్పడిన సంక్షోభం తరువాత ఆరేళ్లపాటు వ్యవస్థలో మందగమనం కొనసాగిందని, ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న అనిశ్చితి పరిస్థితిని అంత త్వరగా 1997 సంక్షోభంతో పోల్చలేమని జిమిత్‌ అన్నారు. మందగించిన ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు ఇటీవల కేంద్రం ఆయా రంగాలకు ప్యాకేజీ ప్రకటనలను, జీఎస్‌టీ రేట్ల తగ్గింపును, ఆర్‌బీఐ వడ్డీరేట్ల కోత తదితర ఉద్దీపన చర్యలను స్వాగతించారు. ఇలాంటి చర్యలు ఆర్థిక వ్యవస్థ త్వరగా కోలుకోనేందుకు ఉత్ర్సేరకాలు పనిచేస్తాయన్నారు. ఇన్వెస్టర్లు, ట్రేడర్ల సెంటిమెంట్‌ ఒక్కరోజులో మారదని, దానంతట అదే మారాలని చెప్పారు. ప్రస్తుత వృద్ధి అంచనాలను తలకిందులు చేసే శక్తి గ్లోబల్‌ సంక్షోభానికి ఉందని, కానీ ఇప్పటికైతే ఇలాంటి సంక్షోభానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. 

ప్రస్తుతం మార్కెట్‌ గరిష్టస్థాయి నుంచి భారీగా క్షీణించిన తరుణంలో దీర్ఘకాలం పెట్టుబడులు పెట్టేందుకు ఇది సరైన సమయమని జిమీత్‌ అన్నారు. తక్కువ రుణభారం, సమర్థవంతమైన పనితీరును కనబరిచే యాజమాన్యం వ్యవస్థ కలిగిన నాణ్యమైన స్టాకుల్లో దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన సూచించారు. ఏడాది కాలం పెట్టబడులు పెట్టాలనుకునేవారు కొంతకాలం పాటు వేచిచూడటం ఉత్తమని తెలిపారు. షార్ట్‌టర్మ్‌ ట్రేడర్లు టైట్‌ స్టాప్‌లాస్‌తో లాంగ్‌ బెట్‌ తీసుకోవచ్చని ఆయన సూచించారు. అలాగే తొలి త్రైమాసికంలో మెరుగైన ఫలితాలను ప్రకటించిన కంపెనీ షేర్లను కొనుగోలు చేయమని సలహానిచ్చారు. 
 
నిఫ్టీ-50 ఇండెక్స్‌ ఆగస్ట్‌లో అరశాతం క్షీణించినప్పటికీ.., నిఫ్టీ అటో ఇండెక్స్‌ మాత్రం 1.50శాతం ర్యాలీ చేసింది. ఈ పరిణామం అటోరంగ షేర్ల రంగ షేర్లలో ధరల నష్టం పూర్తిందనే అంశాన్ని సూచిస్తుందన్నారు. పండుగ సీజన్‌లో అమ్మకాలు క్షీణత కొనసాగితే మాత్రం అటోరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం డెరివేట్స్‌ విభాగంలో ఎక్కువగా షార్ట్స్‌ ఉన్న కారణంగా డౌన్‌సైడ్‌ ట్రెండ్‌ పరిమితమయినట్లు కనిపిస్తుంది. నిఫ్టీ అటో ఇండెక్స్‌ గతేడాది సెప్టెంబర్‌ 1 నుంచి 37.5శాతం క్షీణించగా, ఇది కాలంలో నిఫ్టీ ఇండెక్స్‌ 6.4శాతం క్షీణించింది. 

ప్రస్తుతం ఆర్థిక చక్రీయ వలయంలో మందగమనం దశ ఆరంభమైనట్లుందని జిమిత్‌ పేర్కోన్నారు. ఇప్పుడు నిఫ్టీ పతనమైనది కాబట్టి అందరు ఇప్పుడు మందగమనం గురించి మాట్లాడుకుంటున్నారు. నిజానికి ఆర్థిక వ్యవస్థలో మందగమనం 18 నెలల క్రితమే ప్రారంభమైందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక వ్యవస్థ కుంటుపడుతుందనే అంశాన్ని ముందుగానే ఆర్థిక గణాంకాలు తెలియజేస్తాయని ఆయన పేర్కోన్నారు.You may be interested

మూడురోజుల లాభాలకు చెక్‌!

Wednesday 28th August 2019

ఆర్థిక మాంద్య భయాలు మార్కెట్‌లో లాభాల ర్యాలీకి చెక్‌ చెప్పాయి. బుధవారం ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 189.43 పాయింట్లు పతనమైన 37,451.84 వద్ద, నిఫ్టీ 59.25 పాయింట్ల నష్టంతో 11,046.10 వద్ద స్థిరపడ్డాయి. అమెరికా, చైనా మధ్య వాణిజ్య వివాదాల కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మాంద్యం బారిన పడే వీలున్నట్లు పెరిగిన ఆందోళనలతో నిన్న అమెరికా మార్కెట్లు, నేడు ఆసియా మార్కెట్లు నష్టాల బాట పట్టాయి. అలాగే బ్రెగ్జిట్‌కు

ఆటో, మిడ్‌ క్యాప్‌ ఇండెక్స్‌లో 1000 పాయింట్ల రికవరి!

Wednesday 28th August 2019

-అనిశ్చితిలో బ్యాంకింగ్‌ సెక్టార్‌ -జేఎం ఫైనాన్సియల్‌, గౌతమ్‌ షా   ‘గత కొన్ని వారాలలో మార్కెట్‌ భారీగా నష్టపోయింది. కానీ ఆల్‌టైం గరిష్ఠం నుంచి మార్కెట్‌ 12 శాతం పడిపోవడం పెద్ద క్షీణతగా అనుకోవడం లేదు’ అని జేఎం ఫైనాన్సియల్‌, గౌతమ్‌ షా ఓ ఇంటర్యూలో తెలిపారు. కాగా ఈ ఏడాది జూన్‌ 3 న నిఫ్టీ 50 ఆల్‌ టైం గరిష్ఠమయిన 12,103 ను తాకింది. అక్కడి నుంచి ప్రస్తుత 11,100

Most from this category