News


నిఫ్టీ.. మరికొంత దిద్దుబాటు!

Wednesday 11th December 2019
Markets_main1576005587.png-30158

నిఫ్టీ మంగళవారం అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నది. ఉదయం సానుకూలంగా ప్రారంభమైనప్పటికీ లాభాలను కాపాడుకోలేకపోయింది. సెషన్‌లో ఎక్కువ సమయం పాటు నష్టాల్లోనే కొనసాగింది. ఈ క్రమంలో 11,883 స్థాయిలో ఉన్న స్వల్ప మద్దతును కోల్పోయి దిగువన 11,856 వద్ద ముగిసింది. నికరంగా 80 పాయింట్లు 0.68 శాతం నష్టపోయింది. సోమవారం అనిశ్చయాన్ని సూచించే డోజి ఏర్పాటు తర్వాత ట్రెండ్‌ రివర్సల్‌కు నిఫ్టీ సంకేతం ఇవ్వలేదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో రానున్న సెషన్లలో మరికాస్త దిద్దుబాటు ఉంటుందని అంచనా వేస్తున్నారు. 

 

‘‘నిఫ్టీ-50 ఇండెక్స్‌ చార్ట్‌లో బ్లాక్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. క్రితం సెషన్‌లో ఏర్పాటు చేసిన స్మాల్‌బాడీని మంగళవారం బిగ్‌బ్లాక్‌ బాడీ అధిగమించింది. సోమవారం డోజీ ఏర్పాటు తర్వాత లాభాల స్వీకరణ కొనసాగింది. దీంతో సమీప కాలంలో ఎగువవైపు ర్యాలీ అవకాశాలు తగ్గాయి. దిద్దుబాటు లేదా స్థిరీకరణకు అవకాశం ఉంది’’ అని ఇండియాబుల్స్‌ వెంచర్స్‌ ఈక్విటీ రీసెర్చ్‌ హెడ్‌ మానవ్‌చోప్రా తెలిపారు. లాభపడిన, నష్టపోయిన స్టాక్స్‌ నిష్పత్తి (మార్కెట్‌బ్రెడ్త్‌) ప్రతికూలంగా ఉందని, మొత్తం మీద ధోరణి బలహీనంగా ఉన్నట్టు ఇది తెలియజేస్తోందన్నారు. నిఫ్టీకి 11,800 ఆ తర్వాత 11,700 వద్ద మద్దతు ఉందని చెప్పారు. సమీప కాలానికి మార్కెట్‌ పతనం ఇక్కడ ఆగిపోవచ్చని అభిప్రాయపడ్డారు. సాంకేతికంగా చూస్తే మార్కెట్‌ ప్రయాణం బలహీనంగా కనిపిస్తోందని ఇతర విశ్లేషకులు భావిస్తున్నారు. 

 

బుధవారం నిఫ్టీ 11,854 దిగువన 30 నిమిషాలకు పైన ట్రేడ్‌ అయితే తర్వాత 50 రోజుల ఎస్‌ఎంఏ 11,749ను పరీక్షించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అక్కడ కొనుగోళ్ల మద్దతు రావచ్చని చార్ట్‌వ్యూ ఇండియా చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ అంచనా వేశారు. 11,953పైన క్లోజ్‌ అయితే తప్ప స్థిరత్వం ఉండకపోవచ్చన్నారు. ‘‘బుధవారం సెషన్‌లో నిఫ్టీ సాంకేతికంగా వెనక్కి వచ్చే అవకాశాలున్నాయి. 11,915, 11,960 నిరోధాలుగా పనిచేస్తాయి. మద్దతు స్థాయిలు 11,810-11,750. మార్కెట్లలో కొంచెం రికవరీ కనిపించినా అమ్మకాలు చోటు చేసుకోవచ్చు. మంగళవారం చార్ట్‌ల్లో పెద్ద బ్లాక్‌ బాడీ ఏర్పాటైంది. 100డీఎంఏ 200 డీఎంఏకు దిగువకు రావడం స్వల్పకాలానికి మార్కెట్లలో ర్యాలీ ముగిసినట్టుగా సంకేతం ఇస్తోంది’’ అని జెమ్‌స్టోన్‌ ఈక్విటీ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ సర్వీసెస్‌ వ్యవస్థాపకుడు మిలాన్‌ వైష్ణవ్‌ తెలిపారు. You may be interested

ఎంతో ర్యాలీ చేసినా.. ఇంకా సత్తా..!

Wednesday 11th December 2019

మన మార్కెట్లో మల్టీ బ్యాగర్‌ స్టాక్స్‌ (ఎన్నో రెట్లు పెరిగినవి) ఎన్నో ఉన్నాయి. 2001 నుంచి 2019 డిసెంబర్‌ మధ్య కాలంలో 173 స్టాక్స్‌ పది రెట్లకు పైగా వృద్ధి చెందాయి. కొన్ని స్టాక్స్‌ 2,00,000 శాతం కూడా పెరిగాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభంతోపాటు మరెన్నో సంక్షోభాలను ఈ మధ్య కాలంలో మార్కెట్లు అధిగమించాయి. ఇదే కాలంలో ఈ స్టాక్స్‌ తమ సత్తా చూపించాయి. అయితే, వీటిలో కొన్నింటి పట్ల

11900 దిగువకు నిఫ్టీ

Tuesday 10th December 2019

ఐటీ, మెటల్‌, బ్యాంకింగ్‌ రంగ షేర్ల పతనంతో మంగళవారం మార్కెట్‌ నష్టాలను చవిచూసింది. ప్రధాన సూచీలైన సెన్సెక్స్‌ 247 పాయింట్లు నష్టపోయి 40,240 వద్ద, నిఫ్టీ 81 పాయింట్లను కోల్పోయి 11,857 వద్ద స్థిరపడింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి నెలరోజుల గరిష్టానికి ఎగిసిన నేపథ్యంలో ఐటీ షేర్లు అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అగ్రరాజ్యాలైన అమెరికా చైనాల మధ్య వాణిజ్య చర్చలపై సందిగ్ధత కొనసాగుతున్న తరుణంలో మెటల్‌ షేర్లలో విక్రయాలు

Most from this category