News


నిఫ్టీ చార్టుల్లో బేరిష్‌క్యాండిల్‌!

Saturday 5th October 2019
Markets_main1570250309.png-28730

11100 పాయింట్ల వద్ద కీలక మద్దతు
శుక్రవారం సూచీల్లో అమ్మకాల ఒత్తిడి కొనసాగింది. దీంతో ఉదయం లాభాలను కోల్పోయిన సూచీలు చివరకు భారీ నష్టాల్లో ముగిశాయి. నిఫ్టీ కీలకమైన 11200 పాయింట్ల దిగువకు చేరింది. ఆర్‌బీఐ తాజా ప్రకటనలో వృద్ధి అంచనాలను తగ్గించడమే మార్కెట్లో భయానికి కారణమని నిపుణులు భావిస్తున్నారు. తాజా క్షీణతతో నిఫ్టీ తన 200 రోజుల డీఎంఏ దిగువకు చేరి చార్టుల్లో పెద్ద బేరిష్‌క్యాండిల్‌ ఏర్పరిచింది. వీక్లీ చార్టుల్లో సైతం నిఫ్టీలో బేరిష్‌ క్యాండిలే ఏర్పడింది. ఈ నేపథ్యంలో 11100 పాయింట్లు నిఫ్టీకి చాలా కీలకమని, దీన్ని కోల్పోతే పతనం వేగంగా ఉండొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 11400 పాయింట్లకు పైనే బుల్స్‌కు బలం వస్తుందని చెబుతున్నారు. మరోవైపు వీఐఎక్స్‌ సూచీ 17పైనే కదలాడుతోంది. వీఐఎక్స్‌ 15 దిగువకు వస్తే మార్కెట్లో బేరిష్‌నెస్‌ తగ్గుముఖం పడుతుంటుంది. నిఫ్టీల్లో పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పడడం, వరుసగా 5 సెషన్లు నిఫ్టీ నెగిటివ్‌గా ముగియడం వంటివి మార్కెట్‌పై బేర్స్‌ పట్టు బిగుస్తుందనేందుకు నిదర్శనమని చార్ట్‌వ్యూ ఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ చెప్పారు. నిఫ్టీకి దిగువన మద్దతు లభించకుంటే 10875 పాయింట్ల వరకు పతనం ఉండొచ్చన్నారు. ప్రస్తుతానికి లాంగ్స్‌ జోలికి వద్దని, స్వల్ప పుల్‌బ్యాక్స్‌ ఏర్పడితే 11300 పాయింట్లకు అటుఇటుగా కానీ, 11100 పాయింట్లను కోల్పయినా కానీ కచ్ఛితమైన స్టాప్‌లాస్‌తో షార్ట్స్‌ తీసుకోవచ్చన్నారు.

ఆప్షన్‌ డేటా ప్రకారం అధికంగా 11000, 11200 పాయింట్ల వద్ద పుట్స్‌, 11500, 12000 పాయింట్ల వద్ద కాల్స్‌ ఉన్నాయి. కొత్తగా 11800 వద్ద కాల్‌రైటింగ్‌, 11200 వద్ద పుట్‌రైటింగ్‌ కనిపించింది. బ్యాంకునిఫ్టీ సైతం బేరిష్‌గా కనిపిస్తోంది. బ్యాంకునిఫ్టీకి 27500- 27250 పాయింట్ల రేంజ్‌లో మద్దతు లభించే ఛాన్సుందని మోతీలాల్‌ ఓస్వాల్‌ అంచనా వేసింది. 



You may be interested

27 పాయింట్ల లాభంతో ముగిసిన ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ

Saturday 5th October 2019

విదేశాల్లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఇండెక్స్‌ శుక్రవారం రాత్రి లాభంతో ముగిసింది. ఇది 11,242.00 వద్ద స్థిరపడింది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ శుక్రవారం ముగింపు స్థాయి 11215.15 పాయింట్లతో పోలిస్తే 27 పాయింట్ల లాభంతో ఉంది. ఆర్‌బీఐ పరపతి విధాన సమీక్ష సందర్భంగా జీడీపీ అంచనానలను తగ్గించడం, డిమాండ్ పడిపోవడంతో సెప్టెంబర్‌లో దేశీయంగా సేవల రంగం కార్యకలాపాలు మందగించడంతో ఐహెచ్‌ఎస్‌ మార్కిట్‌ ఇండియా సేవల వ్యాపార కార్యకలాపాల సూచీ (పీఎంఐ)

పండుగ సీజన్లో గోల్డ్‌ బాండ్‌ ధమాకా

Saturday 5th October 2019

సోమవారం ఇష్యూ ప్రారంభం గ్రాము ధర రూ.3,788 న్యూఢిల్లీ: పండుగ సీజన్‌లో భౌతిక పసిడి కొనుగోళ్లను తగ్గించి, ఆ మొత్తాలను పూర్తిస్థాయి ఇన్వెస్ట్‌మెంట్‌గా మార్చడానికి కేంద్రం కీలక నిర్ణయం ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా అక్టోబర్‌ 7వ తేదీన సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌ స్కీమ్‌ 2019-20- సిరీస్‌ 5కు శ్రీకారం చుట్టింది. ఈ సిరీస్‌లో పసిడి గ్రామ్‌ ఇష్యూ ధర రూ.3,788గా నిర్ణయించింది. అక్టోబర్‌ 7 నుంచి 11వ తేదీ వరకూ ఈ స్కీమ్‌

Most from this category