News


12,216కు దిగువన మరింత బలహీనత

Monday 20th January 2020
Markets_main1579542353.png-31055

లాభాల స్వీకరణ కారణంగా నిఫ్టీ సోమవారం కీలకమైన 12,300 స్థాయి దిగువకు వచ్చేసింది. గత వారం మొత్తం 12,270-12,300 మధ్య ఇండెక్స్‌ మంచి మద్దతు తీసుకుంది. కానీ, అమ్మకాల ఒత్తిడితో ఈ వారం ఆరంభంలో దీన్ని కోల్పోయింది. డైలీ చార్ట్‌లలో పొడవైన బ్లాక్‌ డే ప్యాటర్న్‌ను పోలిన పెద్ద బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసిందని నిపుణుల విశ్లేషణ.

 

నిఫ్టీ ప్రారంభంలో 12,430.50 వద్ద నూతన గరిష్టాన్ని నమోదు చేసింది. కానీ, కొన్ని నిమిషాలకే అమ్మకాలతో బేర్స్‌ గుప్పిట్లోకి వెళ్లింది. అమ్మకాల ఒత్తిడి కొనసాగడంతో నిఫ్టీ 128 పాయింట్ల నష్టంతో రోజులో కనిష్ట స్థాయి 12,224 వద్ద ముగిసింది. తాజా ధోరణి స్వల్ప కాల కరెక్షన్‌ను సూచిస్తోందని, స్వల్పకాల ధోరణి బేర్స్‌కు అనుకూలంగా మారిందని చార్ట్‌వ్యూ ఇండియా టెక్నికల్‌ రీసెర్చ్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ పేర్కొన్నారు. మంగళవారం మార్కెట్లు వెనక్కి వస్తే 12,250-12,290 వద్ద తాజా షార్ట్స్‌కు అనుకూలమన్నారు. ఒకవేళ నిఫ్టీ 12,216ను కోల్పోతే ఈ కరెక్షన్‌ జనవరి 9న నమోదు చేసిన బుల్లిష్‌ గ్యాప్‌ జోన్‌ 12,132-12,044 వరకు వెళ్లొచ్చని విశ్లేషించారు. సమీప కాలానికి అప్‌ట్రెండ్‌ 12,400 వద్ద నిలిచిపోయినట్టేనన్నారు.

 

గత కొన్ని రోజులుగా నిఫ్టీ నమోదు చేసిన అన్ని క్యాండిల్స్‌ను తాజా పెద్దదైన బేరిష్‌ క్యాండిల్‌ మింగేసిందని, డైలీ, వీక్లీ చార్ట్‌లపై బేరిష్‌ ఎన్‌గల్ఫింగ్‌ ప్యాటర్న్‌ ఏర్పాటు చేసినట్టు నిపుణులు చెబుతున్నారు. మంగళవారం మార్కెట్‌ నష్టాలతో ప్రారంభమైతే మరింత బేరిష్‌నెస్‌ను సూచిస్తుందన్నారు. సోమవారం నాటి గరిష్ట స్థాయి ఎగువవైపున ట్రెండ్‌ రివర్సల్‌ (మారినట్టు)కు సూచిక అని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ టెక్నికల్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ నాగరాజ్‌ శెట్టి తెలిపారు. ‘‘నిప్టీ స్వల్పకాల ధోరణి ప్రతికూలంగా మారింది. సమీప కాలంలో మరింత బలహీనతకు అవకాశం ఉంది. తదుపరి కనిష్ట స్థాయి 12,100ను పరిశీంచాల్సి ఉంటుంది. తదుపరి కొన్ని సెషన్లలో ఇక్కడకు ఇండెక్స్‌ చేరుకోవచ్చు’’ అని నాగరాజ్‌ శెట్టి వివరించారు. ‘‘నిఫ్టీ 20డీఎంఏ వరకు నష్టపోయింది. రోజువారీ లోయర్‌ బోలింగర్‌ బ్యాండ్‌ 12,013 వరకు క్షీణించొచ్చు. ఏదైనా బౌన్స్‌ చోటు చేసుకుంటే 12,280-12,300 స్థాయిలో తాజా అమ్మకాలు ఎదురవుతాయి’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ అనలిస్ట్‌ చందన్‌తపారియా తెలిపారు.



You may be interested

భారత్‌ వృద్ధి 4.8 శాతమే!: ఐఎంఎఫ్‌

Tuesday 21st January 2020

దావోస్‌: భారత్‌ ఆర్థికవృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-2020) 4.8 శాతమే నమోదవుతుందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) అంచనావేసింది. ఇంతక్రితం ఈ వృద్ధి అంచనా 6.1 శాతం.  వరల్డ్‌ ఎకనమిక్‌ అవుట్‌లుక్‌ (డబ్ల్యూఈఓ) తాజా అంచనాలను ఐఎంఎఫ్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌ గీతా గోపీనాథ్‌ ఇక్కడ వెలువరిస్తూ, భారత్‌లో గ్రామీణ డిమాండ్‌ వృద్ధి పడిపోయిందని, బ్యాంకింగ్‌ రుణ వృద్ధి మందగించిందనీ పేర్కొన్నారు. ఆయా కారణాలు భారత్‌ వృద్ధిపై ప్రతికూల ప్రభావం

ఫండ్స్‌కు ఇవి వ్యాల్యూ బెట్స్‌!

Monday 20th January 2020

డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మ్యూచువల్‌ ఫండ్స్‌ పోర్ట్‌ఫోలియో గణాంకాలను పరిశీలిస్తే.. ఫండ్‌ మేనేజర్లు బాగా దిద్దుబాటుకు గురైన 15 స్టాక్స్‌లో వాటాల కొనుగోలుకు ఆసక్తి చూపించినట్టు అర్థమవుతోంది. వీటిల్లో కొన్ని గరిష్ట ధరల నుంచి 50 శాతం వరకు పడిపోయినవి. త్రైమాసికం వారీగా చూసుకుంటే ఈ స్టాక్స్‌లో చాలా వరకు ఫండ్స్‌ కనీసం ఒక శాతానికి పైనే వాటాలు పెంచుకున్నాయి.   బజాజ్‌ కన్జ్యూమర్‌ కేర్‌ స్టాక్‌ ఫండ్స్‌ను ఎక్కువగా ఆకర్షించింది. గతేడాది

Most from this category