News


నిఫ్టీకి 12000 పాయింట్ల వద్ద మద్దతు!

Saturday 8th February 2020
Markets_main1581136404.png-31619

నిఫ్టీకి తక్షణ మద్దతు 12000- 12080 పాయింట్ల వద్ద లభిస్తుందని, పైన 12160- 12200 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందని టెక్నికల్‌ నిపుణులు విశ్లేషిస్తున్నారు. శుక్రవారం నిఫ్టీ వెనుకంజ వేసి 12100 పాయింట్ల దిగువన క్లోజయింది. దీంతో 50 రోజుల డీఎంఏ మద్దతు కోల్పోయినట్లయింది. నిఫ్టీ చార్టుల్లో ప్రస్తుతం బేరిష్‌ ఎంగల్ఫింగ్‌ క్యాండిల్‌(డైలీ చార్టుల్లో), బుల్లిష్‌ క్యాండిల్‌(వీక్లీచార్టుల్లో) ఏర్పడ్డాయి. ప్రస్తుతం నిఫ్టీ కీలక స్థాయిల వద్ద ఉందని, బేర్స్‌, బుల్స్‌ రెండూ తదుపరి అడుగులకు సమాయత్తం అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. వేవ్‌ నిర్మితి ప్రకారం తాజా పుల్‌బ్యాక్‌ వేవ్‌బీ కిందకు వస్తుందని, దీని అనంతరం డౌన్‌సైడ్‌కు వేవ్‌ సీ పొంచి ఉందని చెప్పారు. ఒకవేళ వేవ్‌ బీ బలంగా కొనసాగితే అప్పుడు కొత్త గరిష్ఠాలను చేరవచ్చన్నారు. వీక్లీ చార్టుల్లో బుల్లిష్‌ పియర్సింగ్‌ ప్యాట్రన్‌ ఏర్పడుతోందని, దీంతో మద్దతు స్థాయిలు క్రమంగా పైకి పెరుగుతున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. నిఫ్టీ 12050 పాయింట్లను కాపాడుకున్నంత వరకు 12200 పాయింట్లను చేరే అవకాశాలుంటాయన్నారు. ఈ స్థాయిని బలంగా దాటితే మరింత అప్‌మూవ్‌ ఉండొచ్చన్నారు. 



You may be interested

బీమా షేర్లు భేష్‌: జెఫరీస్‌ క్రిస్‌వుడ్‌

Saturday 8th February 2020

బడ్జెట్‌.. యాంటీక్లయిమాక్స్‌ రియల్టీ, ఆటో రంగాలకు మొండిచేయి క్రిస్టోఫర్‌ ఉడ్‌, ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌, జెఫరీస్‌  అంచనా వేసినట్లుగానే కేంద్ర బడ్జెట్‌ యాంటీక్లయిమాక్స్‌గా నిలిచిందని జెఫరీస్‌ ఈక్విటీ స్ట్రాటజీ గ్లోబల్‌ హెడ్‌ క్రిస్టోఫర్‌ ఉడ్‌ వ్యాఖ్యానించారు. జపాన్‌మినహా ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇండియా మార్కెట్‌కు రెడ్యూస్‌డ్‌ ఓవర్‌వెయిట్‌ రేటింగ్‌ను ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్‌బీఎఫ్‌సీలతోపాటు రియల్టీ, ఆటో తదితర రంగాలపై ఒక ఇంటర్వ్యూలో పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వివరాలు చూద్దాం..  ప్రభావం తక్కువే ఆర్థిక వ్యవస్థ పుంజుకునేందుకు

బైజుస్‌లో జనరల్‌ అట్లాంటిక్‌ పెట్టుబడులు

Saturday 8th February 2020

1,420 కోట్ల మేర పెట్టుబడులు !  న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ టెక్నాలజీ సంస్థ, బైజుస్‌ తన ప్రస్తుత ఇన్వెస్టర్లలో ఒకటైన జనరల్‌ అట్లాంటిక్‌  నుంచి భారీ మొత్తంలో నిధులను సమీకరించింది. ఎంత మొత్తంలో జనరల్‌ అట్లాంటిక్‌ ఇన్వెస్ట్‌ చేసింది బైజుస్‌ వెల్లడించలేదు. అయితే ఈ సంస్థ బైజుస్‌లో రూ.1,420 కోట్లు(20 కోట్ల డాలర్లు) మేర ఇన్వెస్ట్‌ చేసిందని సమాచారం. టైగర్‌ గ్లోబల్‌ కూడా ఇదే రేంజ్‌లో ఇన్వెస్ట్‌ చేసి ఉంటుందని సంబంధిత వర్గాలు

Most from this category