News


నిఫ్టీ వీక్లీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌

Saturday 26th October 2019
Markets_main1572063224.png-29150

స్వల్పరేంజ్‌లో కదలికలు
సంవత్‌ 20175ను సూచీలు పేలవంగా ముగించాయి. నిఫ్టీ శుక్రవారం తీవ్ర ఒడిదుడుకులు చూసి చివరకు ఫ్లాట్‌గా ముగిసింది. నిఫ్టీ కీలకమైన 11600 పాయింట్ల దిగువన ముగియడంతో పాటు వీక్లీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పడింది. వారం మొత్తానికి నిఫ్టీ 0.7 శాతం నష్టపోయింది. ప్రస్తుతం నిఫ్టీ రేంజ్‌ బౌండ్‌లో ఉందని, దీన్ని దాటితేనే తదుపరి కదలికలుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 11500- 11700 పాయింట్ల మధ్యనే నిఫ్టీ ఐదు రోజులుగా తిరుగుతోంది. దిగువన 11500 పాయింట్లను కోల్పోతే క్రమంగా నిఫ్టీ 11400 పాయింట్ల వరకు రావచ్చని, అక్కడ కూడా మద్దతు దొరకకపోతే 11000 పాయింట్లను చూడవచ్చని నిపుణుల అంచనా. ఎగువన 11700 పాయింట్లను దాటితే క్రమంగా 12000- 12100 పాయింట్ల వరకు ఎగబాకవచ్చు.

నిఫ్టీ 11500 పాయింట్లను కోల్పోనంతవరకు జాగ్రత్తగా లాంగ్స్‌ను కొనసాగించవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ నిఫ్టీ సంవత్‌ 2076 ఆరంభదినాన 11490 దిగువన కదలాడుతుంటే కొత్త షార్ట్స్‌ తీసుకోవచ్చని చెప్పారు. ఆప్షన్‌ డేటా పరిశీలిస్తే 11000, 11500 పాయింట్ల వద్ద పుట్స్‌, 12000, 11000 పాయింట్ల వద్ద కాల్స్‌ అధికంగా ఉన్నాయి. కొత్తగా 11600 వద్ద కాల్‌రైటింగ్‌, 11550 వద్ద పుట్‌రైటింగ్‌ కనిపించింది. ప్రస్తుతం వీఐఎక్స్‌ 15.31 వద్ద ఉంది. ఇది 16పైకి రానంత వరకు పెద్దగా పతనాలు ఉండకపోవచ్చు. బ్యాంకునిఫ్టీ 29200 పాయింట్లపైన ఉన్నంతవరకు 29700 పాయింట్లకు వెళ్లే అవకాశాలున్నాయి. దిగువకు వస్తే 28800-29000 పాయింట్ల వద్ద మద్దతు కనిపిస్తోంది.



You may be interested

ఆరు రెట్లు పెరిగిన ఎస్‌బీఐ లాభం

Saturday 26th October 2019

రూ.3,375 కోట్లకు ఎగసిన నికర లాభం  కలసివచ్చిన బీమా వెంచర్‌లో వాటా విక్రయం  మెరుగుపడిన రుణ నాణ్యత  న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ నికర లాభం(కన్సాలిడేటెడ్‌) ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో దాదాపు ఆరు రెట్లు పెరిగింది. గత క్యూ2లో రూ.576 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.3,375 కోట్లకు పెరిగిందని ఎస్‌బీఐ తెలిపింది. తమ అనుబంధ కంపెనీ, ఎస్‌బీఐ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీలో 4.5

కొత్త సంవత్‌లో గోల్డ్‌ రన్‌..

Saturday 26th October 2019

- రూ. 41,500కు చేరే అవకాశాలు అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, భౌగోళిక.. రాజకీయ ఆందోళనలు, బ్రెగ్జిట్‌పై తొలగని అనిశ్చితి... ఇవన్నీ 2019లో పసిడికి లాభించాయి. ఐఎంఎఫ్, వరల్డ్‌ బ్యాంక్‌ లాంటి సంస్థలు ప్రపంచ దేశాల వృద్ధి రేటు అంచనాలను కుదిస్తుండటంతో .. వివిధ దేశాల సెంట్రల్‌ బ్యాంకులు బంగారం నిల్వలు మరింత పెంచుకున్నాయి. దేశీయంగా అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి క్షీణించడం పుత్తడికి కలిసొచ్చింది. మొత్తం మీద గత

Most from this category