News


నిఫ్టీ చార్టులో సెల్‌ సిగ్నల్‌!

Tuesday 8th October 2019
Markets_main1570474126.png-28762

నిఫ్టీ సోమవారం తీవ్ర అస్థిరతల మధ్య పై స్థాయిలో నిలదొక్కుకునేందుకు ప్రయత్నించినా కానీ సఫలం కాలేదు. చివర్లో అమ్మకాల కారణంగా సూచీలు నష్టపోయాయి. ముఖ్యంగా సెప్టెంబర్‌ త్రైమాసికం ఫలితాలపై ఆందోళనలు తాజా అమ్మకాలకు కారణమయ్యాయి. అయితే, నిఫ్టీ వరుసగా ఆరో రోజూ తక్కువ స్థాయిల్లో క్లోజయింది. తద్వారా డైలీ చార్టుల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పాటు చేసిందని నిపుణులు చెబుతున్నారు. 

 

నిఫ్టీ 11,196 వద్ద ప్రారంభమై 200 రోజుల సగటు ఈఎంఏ(11,218)ను అధిగమించేందుకు ప్రయత్నించి ఇంట్రాడేలో 11,233.85 వరకు వెళ్లింది. కానీ తర్వాత బేర్‌ ప్రతాపంతో 11,112.65 వరకు పడిపోయి చివర్లో 11,126.40 వద్ద క్లోజయింది. రోజంతా నిర్దేశిత శ్రేణి పరిధిలోనే ట్రేడ్‌ అయినా లేదా రోజులో కనిష్ట స్థాయి వద్ద క్లోజయిన సందర్భాల్లో బేరిష్‌ క్యాండిల్‌ ఏర్పడుతుంది. అయితే, కీలకమైన 11,100 మద్దతు స్థాయిను కోల్పోలేదు. ఒకవేళ ఇది కోల్పోతే అమ్మకాలు ఎక్కువవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక డైలీ చార్టుల్లో ఎంఏసీడీ సెల్‌ సిగ్నల్‌ ఇవ్వడం బుల్స్‌కు ఆందోళన కలిగించే అంశంగా పేర్కొంటున్నారు. ఈ సిగ్నల్‌ను తోసిపుచ్చడానికి లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

 

‘‘బేర్స్‌ పట్టు కొనసాగుతోంది. ఇంట్రాడేలో 200 రోజుల ఈఎంఏ వద్ద అధిక అమ్మకాలు ఎదురుకావడం ఇదే సూచిస్తోంది. ఈ క్రమంలో సూచీ అన్ని కీలక మధ్య, దీర్ఘకాల సగటు చలనాలకు దిగువన క్లోజయింది. దీనికి డైలీ ఎంఏసీడీ చార్ట్‌లో సెల్‌ సిగ్నల్‌ కూడా తోడైంది. దీంతో బేరిష్‌ సెంటిమెంట్‌ మరింత బలపడింది. క్లోజింగ్‌లో 11,100 కీలకమైన మద్దతు స్థాయి. దీన్ని కోల్పోతే ఇటీవలి బ్రేకవుట్‌ విఫలం కావడాన్ని ధ్రువీకరిస్తుంది. ఇదే జరిగితే 10,875 టార్గెట్‌ అవుతుంది’’ అని చార్ట్‌వ్యూ ఇండియా టెక్నికల్‌ రీసెర్చ్‌ చీఫ్‌ స్ట్రాటజిస్ట్‌ మజర్‌ మహమ్మద్‌ పేర్కొన్నారు. ఎగువ వైపున 11,400మించి వెళ్లకపోవచ్చన్నారు. మరోవైపు ఇండియా వీఐఎక్స్‌ (వొలటాలిటీ ఇండెక్స్‌) 1.42 శాతం పెరిగి 17.83కు చేరింది. You may be interested

ఎస్‌బీఐ నుంచి డెబిట్‌కార్డ్‌ ఈఎంఐ 

Tuesday 8th October 2019

ముంబై: పండుగల సమయంలో ఎస్‌బీఐ తన కస్టమర్లకు డెబిట్‌ కార్డుపైనా ఈఎంపై సదుపాయాన్ని తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 1500కు పైగా పట్టణాల్లోని స్టోర్లలో ఉన్న 4.5 లక్షల పైన్‌ల్యాబ్స్‌ బ్రాండ్‌ పీవోఎస్‌ మెషిన్ల వద్ద డెబిట్‌ ద్వారా ఈఎంఐ కింద కొనుగోళ్లు చేసుకోవచ్చని ఎస్‌బీఐ తన ప్రకటనలో తెలిపింది. 6 నెలల నుంచి 18 నెలల కాలానికి చెల్లించే ఆప్షన్‌ ఎంచుకోవచ్చు. డాక్యుమెంటేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజులు ఉండవని, ఇందుకోసం బ్యాంకు శాఖలకు

మంచి వర్షాలతో లాభపడే కంపెనీలు!

Tuesday 8th October 2019

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ రానున్న రోజుల్లో పుంజుకుంటుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి. మంచి వర్షాలతో రబీ పంటల సాగు బలంగా ఉండడం ఇందుకు ప్రధాన కారణం. నైరుతి రుతుపవన కాలంలో వర్షపాతం 25 ఏళ్లలోనే కనిష్ట స్థాయికి ఈ ఏడాది చేరిన విషయం తెలిసిందే. 1994 తర్వాత అత్యధిక వర్షపాతం నమోదైనట్టు భారత వాతావరణ విభాగం ప్రకటించింది. పంట ఉత్పాదకత అధికం కావడం, గ్రామీణ ‍ప్రాంతాల్లో ప్రభుత్వ అధిక వ్యయాలు

Most from this category