News


నిఫ్టీలో బేరిష్‌ క్యాండిల్‌!

Saturday 4th January 2020
Markets_main1578112918.png-30669

ఇరాన్‌ సంఘటనలతో దేశీయ మార్కెట్లు శుక్రవారం బేర్స్‌ పట్టులోకి జారాయి. చమురు ధర ఒక్కమారుగా పెరగడంతో దేశీయ సూచీలు నష్టాల బాట పట్టాయి. నిఫ్టీ 12250 పాయింట్ల దిగువకు వచ్చింది. ఇంట్రాడేలో నిఫ్టీ బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పరిచింది. ఒకదశలో నిఫ్టీ కీలక 12191 పాయింట్ల వరకు దిగజారింది. చివర్లో కొనుగోళ్ల మద్దతుతో కాస్త కోలుకుంది. అయితే తాజా క్యాండిల్‌ ఏర్పడడం తప్ప చార్టుల్లో ఎలాంటి ఫార్మేషన్లు ఏర్పడలేదని, సంఘటన వార్తల ఆధారంగా కేవలం ఒక బ్లాక్‌ క్యాండిల్‌ మాత్రమే ఏర్పడిందని జెమ్‌స్టోన్‌ రిసెర్చ్‌ అనలిస్టు మిలాన్‌వైష్ణవ్‌ చెప్పారు. గురువారం పొడవైన బుల్లిష్‌ కాండిల్‌ పక్కన శుక్రవారం చిన్నపాటి బేరిష్‌ కాండిల్‌ మాత్రమే ఏర్పడింది. ఇది రేంజ్‌బౌండ్‌ కదలికలను చూపుతోందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌ అనలిస్టు నాగరాజు షెట్టి చెప్పారు. స్వల్పకాలానికి నిఫ్టీ పరిమిత రేంజ్‌లో కదలాడవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఒకవేళ నిఫ్టీ సోమవారం 12191 స్థాయిని క్లోజింగ్‌ సమయానికి కాపాడుకోలేకపోతే  కరెక‌్షన్‌లోకి జారవచ్చని చార్ట్‌వ్యూఇండియా ప్రతినిధి మజార్‌ మహ్మద్‌ చెప్పారు. ఈ పతనం తొలి టార్గెట్‌ 12070 పాయింట్లన్నారు. ఒకవేళ సోమవారం సూచీలు పాజిటివ్‌గా కదలాడితే 12293 పాయింట్లను బలంగా దాటాల్సిఉంటుందని, అలాంటి బ్రేకవుట్‌ వస్తే నిఫ్టీ 12400 పాయింట్ల వరకు పెరగవచ్చని తెలిపారు. బ్యాంకునిఫ్టీకి కీలక మద్దతు 31900 పాయింట్ల వద్ద ఉందని ఇండియా బుల్స్‌ అనలిస్టు అమిత్‌ షా చెప్పారు. దీన్ని కోల్పోతే ప్రాఫిట్‌ బుకింగ్‌ ఉధృతమవుతుందన్నారు. ఎగువన 32500- 32600 పాయింట్ల వద్ద నిరోధం ఎదురవుతుందన్నారు. 



You may be interested

ఇకపై ఐసీఐసీఐ, యాక్సిస్‌ దూకుడు

Saturday 4th January 2020

ప్రయివేట్‌ రంగ బ్యాంకులకు రీరేటింగ్‌ విదేశీ బ్రోకింగ్‌ సంస్థ నోమురా అంచనా ప్రయివేట్‌ రంగ కార్పొరేట్‌ బ్యాంకులకు ఇకపై మరింత రీరేటింగ్‌ లభించనున్నట్లు గ్లోబల్‌ బ్రోకింగ్‌ కంపెనీ నోమురా తాజాగా అభిప్రాయపడింది. దీనిలో భాగంగా ఫైనాన్షియల్‌ దిగ్గజాలు ఐసీఐసీఐ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ కౌంటర్లకు భవిష్యత్‌లో డిమాండ్‌ పెరగనున్నట్లు అంచనా వేసింది. ఇతర వివరాలు చూద్దాం.. టార్గెట్‌ ధరల పెంపు ఇటీవల యాక్సిస్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లు ర్యాలీ చేసినప్పటికీ ఇకపై మరింత దూకుడు

ఈ నెల 29న ఇండిగో ఈజీఎమ్‌

Saturday 4th January 2020

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ, ఇండిగోను నిర్వహిస్తున్న ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ కంపెనీ  ఈజీఎమ్‌(అసాధారణ సమావేశం) ఈ నెల 29న జరగనున్నది. ప్రమోటర్లలో ఒకరైన రాకేశ్‌ గంగ్వాల్‌ అభ్యర్థన మేరకు ఈ ఏజీఎమ్‌ జరుగుతోంది. కంపెనీ షేర్ల బదిలీ, టేకోవర్‌, సంబంధించి ‘రైట్‌ ఆఫ్‌ ఫస్ట్‌ రెఫ్యూజల్‌’, ‘ట్యాగ్‌ ఎలాంగ్‌ రైట్‌’ తదితర  అంశాలను తొలగించడానికి  ఆర్టికల్స్‌ ఆఫ్‌ అసోసియేషన్‌(ఏఓఏ)లో సవరణ కోసం ఈ ఈజీఎమ్‌ను ఉద్దేశించారు.  ఇండిగో కంపెనీలో నిర్వహణ పరంగా అవకతవకలు

Most from this category