News


ముందున్నది మరింత పెయిన్‌?

Monday 8th July 2019
Markets_main1562608388.png-26905

సూచీలు సోమవారం భారీగా నష్టపోయాయి. బడ్జెట్‌ ప్రతిపాదనలపై ఎంతో ఆశపెట్టుకోగా, కొత్త విత్తమంత్రి నిరాశకు గురి చేయడంతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలను కూడా కోల్పోయింది. అయితే, ఇంకాస్త పతనం మిగిలి ఉందంటున్నారు విశ్లేషకులు.

 

నిఫ్టీ-50 గత శుక్రవారంతో పోలిస్తే సోమవారం భారీ భేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. 50రోజుల ఎక్స్‌పొన్షియల్‌ మూవింగ్‌ యావరేజ్‌నూ కూడా కోల్పోయి, బేరిష్‌ బెల్ట్‌ హోల్డ్‌ ప్యాటర్న్‌ను డైలీ చార్ట్‌లో ఏర్పాటు చేసింది. దీంతో బుల్స్‌ పొజిషన్లు కవర్‌ చేసుకునేందుకు పోటీ పడ్డారన్నది విశ్లేషణ. నిఫ్టీ కీలక మద్దతు స్థాయిలు 11,650-, 11600ను కోల్పోయి 35 రోజుల తర్వాత మళ్లీ దిగువ స్థాయిల్లో క్లోజ్‌ అయిందని మోతీలాల్‌ ఓస్వాల్‌ సెక్యూరిటీస్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు. ‘‘నిఫ్టీ-50 సూచీ 50 రోజుల ఈఎంఐకు దిగువన క్లోజయింది. 11,650 దిగువన ఉన్నంత కాలం నిఫ్టీ 11,420 దిశగా పతనాన్ని చూస్తుంది’’ అని తపారియా తెలిపారు. 

 

సూచీ 252 పాయింట్లు పడిపోయి (2.14 శాతం) 11,558 వద్ద క్లోజయింది. 100 రోజుల ఎస్‌ఎంఏ అయిన 11,495 తక్షణ మద్దతు స్థాయిగా నిలవనుంది. ‘‘నిఫ్టీ-50 11,625 దిగువన డైలీ చార్ట్‌లో డబుల్‌ టాప్‌ బ్రేక్‌డౌన్‌ చూసింది. మరింత నష్టం ఉంటుందన్న హెచ్చరిక ఇది. ఇండెక్స్‌కు 11,500, 11426 బలమైన మద్దతు స్థాయిలు. తక్షణ బలమైన నిరోధాలు 11,620, 11,690 దగ్గర ఎదురు కావచ్చు’’ అని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌ సీనియర్‌ టెక్నికల్‌ అనలిస్ట్‌ రోహిత్‌సింగ్రే తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్‌కు చెందిన నీరజ్‌ శెట్టి... నిఫ్టీకి 11,600 - 11425 మధ్య మద్దతు రావచ్చని, డౌన్‌ట్రెండ్‌ ఈ శ్రేణిలో ఆగిపోవచ్చన్నారు. సూచీలు ఒకవేళ 11,625, 11,700 దిశగా ర్యాలీ చేస్తే ట్రేడర్లు తాజా షార్ట్‌ పొజిషన్లకు వెళ్లొచ్చని చార్ట్‌వ్యూ ఇండియాకు చెందిన మజర్‌ మహమ్మద్‌ సూచించారు. 11,800పైన ముగిస్తే తప్ప సూచీ బలం చూపలేదన్నారు. You may be interested

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు డౌన్‌

Tuesday 9th July 2019

కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించిన పన్నుల పట్ల అసహనంగా క్రితం రోజు భారీ నష్టాల్ని చవిచూసిన భారత్‌ సూచీలు మంగళవారం సైతం నెగిటివ్‌గా మొదలయ్యే సంకేతాల్ని ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ అందిస్తోంది. ఈ ఉదయం 8.50 గంటలకు ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 20 పాయింట్లు తగ్గింది. ఇక్కడి ఎన్‌ఎన్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌కు అనుసంధానంగా సింగపూర్‌లో ట్రేడయ్యే ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 11,546 పాయింట్ల వద్ద కదులుతోంది. శుక్రవారం ఇక్కడ ఎన్‌ఎస్‌ఈ జూలై నిఫ్టీ ఫ్యూచర్‌ 11,566 పాయింట్ల వద్ద ముగిసింది. ప్రపంచ సూచీల క్షీణత.. అమెరికా కేంద్ర

ఈ భారీ పతనం వెనుక...ఏమై ఉండొచ్చు?

Monday 8th July 2019

ఆర్థిక మం‍త్రి నిర్మలా సీతారామన్‌ ఆదాయపన్ను సర్‌ చార్జీ పెంచుతూ బడ్జెట్‌లో చేసిన ప్రకటన సోమవారం భారీ నష్టాలకు దారి తీసి ఉండొచ్చన్న విశ్లేషణ వినిపిస్తోంది. బడ్జెట్‌ కాపీ చూసిన తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) లాభాల స్వీకరణకు పోటీపడి ఉంటారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధానంగా ఇండెక్స్‌ స్టాక్స్‌లో ఎక్కువ అమ్మకాలు చోటు చేసుకున్నాయి.    బడ్జెట్‌లో ఆదాయపన్ను సర్‌ చార్జీని పెంచుతున్నట్టు మంత్రి ప్రకటించారు. దీనివల్ల విదేశీ ఇన్వెస్టర్ల దీర్ఘకాలిక

Most from this category