News


మరికొంత కరెక్షన్‌కు అవకాశం!

Tuesday 11th February 2020
Markets_main1581361490.png-31668

నిఫ్టీ వరుసగా రెండో సెషన్‌లో సోమవారం నష్టపోయింది. అయితే కీలకమైన 12,050 స్థాయిలకు దిగువకు వచ్చేసి 12,031 వద్ద క్లోజయింది. దీంతో సూచీ 50 ఈఎంఏ, 20ఈఎంఏ, 13ఈఎంఏలను కోల్పోయినట్టయింది. దీంతో నిఫ్టీకి 12,100 నిరోధ స్థాయిగా పనిచేస్తుందని, ఇది అధిగమించి క్లోజయితే మరికొంత ర్యాలీకి అవకాశం ఉంటుందని, దిగువ వైపున 11,970-11,890 మద్దతు స్థాయిలుగా ఉన్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

 

‘‘నిర్మాణాత్మకంగా చూస్తే నిఫ్టీ పుల్‌బ్యాక్‌ (ఇటీవలి నష్టాల తర్వాత ర్యాలీ) 61.8 శాతం రీట్రేస్‌మెంట్‌ మార్క్‌ వద్ద ఆగిపోయింది. దీంతో మరో విడత పతనం ఆరంభమైంది. సోమవారం బుల్స్‌ 12,000 మార్క్‌ను కాపాడుకోగలిగాయి. కానీ, ఇది ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చు. గత వారం రికవరీ తర్వాత మార్కెట్లు అలసిపోయినట్టు సంకేతాలిస్తున్నాయి’’ అని షేర్‌ఖాన్‌కు చెందిన గౌరవ్‌ రత్నపార్కి తెలిపారు. ‘‘డైలీ చార్ట్‌లో మధ్య స్థాయి బోలింగర్‌ బ్యాండ్‌ వద్ద మూడు రోజుల పాటు ఒత్తిడి ఎదుర్కొన్న అనంతరం సూచీ మళ్లీ వెనుదిరిగినట్టు కనిపిస్తోంది. మధ్యస్థాయి బోలింగర్‌ బ్యాండ్‌ దిగువన ఉన్నంత వరకు సూచీ దిగువ స్థాయి బోలింగర్‌ బ్యాండ్‌ 11,741 వరకు వెళ్లొచ్చు. ఇక్కడ ఫిబ్రవరి 4న బుల్లిష్‌ గ్యాప్‌ జోన్‌ 11,789-749 మధ్య నెలకొంది’’ అని చార్ట్‌వ్యూ ఇండియాకు చెందిన మజర్‌ మహమ్మద్‌ తెలిపారు. ఒకవేళ నిఫ్టీ 12,100పైన ముగిస్తే సూచీలో స్థిరీకరణకు అవకాశం ఉంటుందన్నారు.

 

నిఫ్టీ 12,100పైన నిలదొక్కుకుంటేనే ర్యాలీకి అవకాశం ఉంటుందని ఎల్‌కేపీ సెక్యూరిటీస్‌కు చెందిన రోహిత్‌ సింగ్రే తెలిపారు. లేకపోతే సూచీ పెరిగినప్పుడల్లా లాభాల ‍స్వీకరణ ఎదుర్కోవచ్చన్నారు. ‘‘డైలీ చార్ట్‌పై ఇండెక్స్‌ బేరిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. గత రెండు సెషన్లలో కనిష్టంలో గరిష్టం, కనిష్టంలో కనిష్టాలు నమోదవుతున్నాయి. తక్షణ మద్దతు స్థాయి 50డీఈఎంఏకు దిగువన క్లోజయింది. సూచీకి 11,950-11,900 స్థాయిల్లో మద్దతు లభించొచ్చు. ఎగువవైపున 12,100పైన క్లోజయితే 12,200-12,250 వరకు ర్యాలీ చేయవచ్చు’’ అని మోతీలాల్‌ ఓస్వాల్ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ అనలిస్ట్‌ చందన్‌ తపారియా తెలిపారు.



You may be interested

వాహన అమ్మకాలు... బే‘‘కార్‌’’..!

Tuesday 11th February 2020

జనవరిలో 6 శాతం తగ్గిన అమ్మకాలు కొనుగోలు భారం పెరగడం, మందగమనం కారణం సియామ్ నివేదికలో వెల్లడి గ్రేటర్ నోయిడా: దేశీయంగా వాహన విక్రయాల్లో మందగమనం కొనసాగుతోంది. కొత్త ఏడాదిలోనూ అమ్మకాలు పుంజుకోలేదు. జనవరిలో దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 6.2 శాతం క్షీణించాయి. వాహనాల కొనుగోలు భారం పెరగడం, స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి మందగించడం తదితర అంశాలు ఇందుకు కారణంగా నిల్చాయి. ఆటోమొబైల్ సంస్థల సమాఖ్య సియామ్ సోమవారం విడుదల చేసిన

కోటక్‌ ఎంఎఫ్‌ అంతర్జాతీయ స్కీమ్‌ల విలీనం 

Tuesday 11th February 2020

కోటక్‌ మ్యూచువల్‌ ఫండ్‌ సంస్థ.. కోటక్‌ యూఎస్‌ ఈక్విటీ ఫండ్‌ (కేయూఈఎఫ్‌), కోటక్‌ వరల్డ్‌ గోల్డ్‌ (కేడబ్ల్యూజీ) ఫండ్‌లను కోటక్‌ గ్లోబల్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ (కేజీఈఎం) స్కీమ్‌లో విలీనం చేయాలని నిర్ణయించింది. ఇది ఫిబ్రవరి 26 నుంచి అమల్లోకి వస్తుంది. దీంతో ఇప్పుడు విడిగా నడిచే ఈ పథకాల పెట్టుబడుల లక్ష్యాల్లో మార్పులకు అవకాశం లేకపోలేదు. కనుక ఇన్వెస్టర్లు తమ లక్ష్యాలకు అనుగుణంగా పోర్ట్‌ఫోలియోలో మార్పులు చేసుకోవాల్సి రావచ్చు.   విలీనమయ్యేవి.. కోటక్‌ యూఎస్‌

Most from this category