నిఫ్టీ చార్టుల్లో బేరిష్బెల్ట్ హోల్డ్ ప్యాట్రన్
By D Sayee Pramodh

నిఫ్టీ శుక్రవారం దాదాపు వంద పాయింట్లు నష్టపోయి 12050 పాయింట్ల స్థాయి వద్ద ముగిసింది. డైలీ చార్టుల్లో నిఫ్టీలో బేరిష్బెల్ట్ హోల్డ్ ప్యాట్రన్ ఏర్పడిందని నిపుణులు చెబుతున్నారు. ఇంట్రాడేలో నిఫ్టీ తన తక్షణ మద్దతు 10990 పాయింట్లను కాపాడుకుంది, కానీ స్వల్పకాలిక మూవింగ్ యావరేజ్ స్ధాయి దిగువన ముగిసి బలహీనత సూచిస్తోంది. అయితే వీక్లీ చార్టుల్లో మాత్రం నిఫ్టీ బుల్లిష్ క్యాండిల్ ఏర్పడింది. కానీ మొత్తం మీద బుల్లిష్ ట్రెండ్‌లో బలహీనత కనిపిస్తోందని నిపుణులు భావిస్తున్నారు. నిఫ్టీ నెల మొత్తం స్వల్ప356 పాయింట్ల రేంజ్లో కదలాడినందున బుల్స్ బలంపై సందేహాలు వస్తున్నాయని చార్ట్‌వ్యూఇండియా అనలిస్టు మజార్ మహ్మద్ చెప్పారు. ఒకవేళ సూచీ 10990 పాయింట్ల దిగువన క్లోజయితే కరెక్షన్ స్పీడందుకుంటుందన్నారు. అలాంటప్పుడు 11800 పాయింట్ల వరకు నిఫ్టీ దిగజారవచ్చన్నారు. పైన 12160 పాయింట్ల వద్ద నిరోధం ఉందన్నారు. నిఫ్టీ 12000 పాయింట్ల రేంజ్‌ను కాపాడుకున్నంత వరకు బలంగా ఉన్నట్లే భావించాలని ఇండియా బుల్స్ వెంచర్స్ అనలిస్టు మానవ్చోప్రా చెప్పారు. విస్తృతమైన అప్‌ట్రెండ్ బలంగానే ఉంటుందని, దిగువకు వచ్చినప్పుడు కొనుగోళ్లను పరిశీలించవచ్చని చెప్పారు. మార్కెట్ పతనమైనా మార్కెట్ విస్తృతి చాలా స్వల్ప నెగిటివ్‌గా ఉండడమనేది సూచీల్లో బలానికి సంకేతమన్నారు. వరుసగా మూడు డోజీలు వీక్లీ చార్టుల్లో ఏర్పడడం తదుపరి అప్‌మూవ్ కొనసాగడమనేది పాజిటివ్ సంకేతమని మోతీలాల్ ఓస్వాల్ అనలిస్టు చందన్ తపారియా చెప్పారు. నిఫ్టీ 11980- 12000 రేంజ్ కాపాడుకున్నంత వరకు పాజిటివ్ ధృక్పథం కొనసాగుతుందని, 12250 పాయింట్ల వరకు పరుగులుండొచ్చని అంచనా వేశారు.
You may be interested
2 బిలియన్ డాలర్ల సమీకరణలో యస్ బ్యాంక్
Saturday 30th November 2019(అప్డేట్) ముంబై: ప్రైవేట్ రంగ యస్ బ్యాంక్ తాజాగా 2 బిలియన్ డాలర్లు సమీకరిస్తోంది. షేర్ల ప్రిఫరెన్షియల్ అలాట్మెంట్ ప్రాతిపదికన ఇన్వెస్ట్ చేసేందుకు పలు సంస్థలు ఆసక్తి వ్యక్తం చేసినట్లు బ్యాంకు వెల్లడించింది. శుక్రవారం బోర్డు సమావేశం అనంతరం స్టాక్ ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఎర్విన్ సింగ్ బ్రెయిచ్/ఎస్పీజీపీ హోల్డింగ్స్ (ఇంకా చర్చలు జరుగుతున్నాయి) 1,200 మిలియన్ డాలర్లు, అమెరికాకు చెందిన ఒక ఫండ్ సంస్థ 120 మిలియన్ డాలర్లు
పసిడి నగలకు ‘హాల్ మార్క్’
Saturday 30th November 20192021 జనవరి 15 నుంచీ తప్పనిసరి వచ్చే జనవరి 15న నోటిఫికేషన్ వ్యాపారులకు ఏడాది పాటు సమయం కేంద్ర మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ ప్రకటన న్యూఢిల్లీ: దేశంలో బంగారం ఆభరణాలు, బంగారంతో చేసిన కళాకృతులకు హాల్ మార్కింగ్ ధ్రువీకరణను 2021 జనవరి 15 నుంచి తప్పనిసరి చేయనున్నట్టు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌విలాస్ పాశ్వాన్ శుక్రవారం ప్రకటించారు. ‘‘ఇందుకు సంబంధించి రాబోయే జనవరి 15న నోటిఫికేషన్ విడుదల చేస్తాం. ఆభరణాల వ్యాపారులు తమ వద్దనున్న