News


పట్టు నిలుపుకోలేకపోతున్న బుల్స్‌!

Monday 11th February 2019
Markets_main1549874841.png-24135

నిఫ్టీలో ఫాల్స్‌ బ్రేకవుట్‌
జాగ్రత్తగా ఉండాలంటున్న నిపుణులు
కొన్ని వారాలుగా కన్సాలిడేట్‌ అవుతున్న నిఫ్టీ గతవారం 11వేల పాయింట్లను దాటి బ్రేకవుట్‌ ఇచ్చినట్లు కనిపించింది. కానీ వెనువెంటనే వెనుకంజ వేసి ప్రస్తుతం 10900 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది. దీంతో గతవారం బ్రేకవుట్‌ తప్పుదోవ పట్టించే సూచనా? అని ఇన్వెస్టర్లు భయపడుతున్నారు. నిఫ్టీ 11వేల పాయింట్ల పైన నిలదొక్కుకోనంత వరకు బుల్స్‌కు పట్టు చిక్కదని నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. 
నిఫ్టీపై వివిధ అనలిస్టుల అంచనాలు
1. సెంట్రమ్‌ బ్రోకింగ్‌కు చెందిన జైపురోహిత్‌:
గతవారం మొదటి నాలుగు సెషన్లు భారీ పుట్‌రైటింగ్‌ కనిపించింది. కానీ 11000 పాయింట్ల వద్ద అత్యధిక కాల్స్‌ ఉన్నాయి. అందువల్ల ఈ స్థాయిని కాల్‌రైటర్లు కాపాడుకుంటున్నారు. అయితే టెక్నికల్‌గా చార్టులు పాజిటివ్‌ మూడ్‌లో ఉన్నాయి. కానీ స్వల్పకాలానికి సందిగ్ధతే రాజ్యమేలుతుంది. డైలీ చార్టుల్లో ఈవెనింగ్‌స్టార్‌ క్యాండిల్‌ ఏర్పడడం వల్ల స్వల్పకాలిక పతనం ఉండొచ్చు. కొన్ని వారాల పాటు నిఫ్టీ 10800-11100 పాయింట్ల రేంజ్‌లోనే ఉండొచ్చు. ఈ నేపథ్యంలో ట్రేడర్లు స్వల్ప పొజిషన్లను ఉంచుకోవడం మంచిది. 10800 పాయింట్ల దిగువకు వస్తే బేర్స్‌ పట్టు మరింత బిగియవచ్చు. స్మాల్‌, మిడ్‌క్యాప్‌ స్టాకుల్లో ఎలాంటి రికవరీ కనిపించడం లేదు. అందువల్ల సాధ్యమైనంతవరకు వేచిచూడడమే మంచిది.
2. జైథాకర్‌, ఆనంద్‌రాఠీ రిసెర్చ్‌:
ఫిబ్రవరి సీరిస్‌ ఆరంభం బాగనే ఉంది. కానీ సాధించిన బ్రేకవుట్‌ను నిఫ్టీ నిలబెట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో నిఫ్టీ 10000- 11110 పాయింట్ల వరకు జరిపిన ర్యాలీకి 38.2 శాతం రిట్రేస్‌మెంట్‌ స్థాయి 10690- 10700 పాయింట్ల వరకు వెనుకంజ వేయవచ్చు. పైస్థాయిలో 11118 పాయింట్ల వద్ద అతి గట్టి నిరోధం ఉంది. దీన్ని ఇప్పట్లో నిఫ్టీ దాటలేకపోవచ్చు. 
3. జియోజిత్‌కు చెందిన ఆనంద్‌ జేమ్స్‌:
గతవారం నిఫ్టీ కష్టపడి సాధించిన బ్రేకవుట్‌ ఫాల్స్‌ బ్రేకవుట్‌గా మిగిలింది. ఆప్షన్‌ రైటర్ల యాక్టివిటీ పరిశీలిస్తే త్వరలో వేగవంతమైన పతనాలు ఉండే ఛాన్సులున్నాయి. ఈ వారం గడిస్తే కానీ మరింత స్పష్టత రాదు. 11000 పాయింట్లు బుల్స్‌కు కొరకరాని కొయ్యగా మారింది. బలమైన మద్దతు 10700 పాయింట్ల వద్ద ఉంది. కానీ ఈ వారం అనంతరం క్రమంగా నిఫ్టీ అప్‌మూవ్‌ కొనసాగించే అవకాశాలున్నాయి. బుల్‌కాల్‌ స్ప్రెడ్‌ వ్యూహాన్ని అవలంబించవచ్చు. పొజిషన్లకు 10700 పాయింట్లను స్టాప్‌లాస్‌గా ఉంచుకోవాలి. వినిమయం, ఐటీ, ఓఎంసీ రంగాల షేర్లను పరిశీలించవచ్చు. స్వల్పకాల కరెక‌్షన్‌ను తట్టుకునేందుకు రక్షణాత్మక రంగాలైన ఫార్మా వంటి రంగాల షేర్లను ఎంచుకోవచ్చు. 11118 పాయింట్లను దాటనంతవరకు బుల్స్‌కు ఎలాంటి పాజిటివ్‌ మద్దతు దొరకదు. 


 You may be interested

పీఎస్‌యూ బ్యాంక్‌ షేర్లు డౌన్‌

Monday 11th February 2019

 సోమవారం ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు భారీగా నష్టపోయాయి. ఎన్‌ఎస్‌ఈలో ఈ రంగ షేర్లకు ప్రాతినిథ్యం వహించే నిఫ్టీ పీఎస్‌యూ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 2.50శాతం నష్టపోయింది. నేడు ఈ ఇండెక్స్‌ 2,895.35ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారభించింది. ఇంట్రాడేలో ఈ సూచీలో భాగమైన  ఐడీఐబీ అత్యధికంగా 3.50శాతం నష్టపోయింది. ఇండియన్‌ బ్యాంక్‌, సిండికేట్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా షేర్లు 2.50శాతం పతనమయ్యాయి. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, జమ్మూ&కాశ్మీర్‌ షేర్లు 2శాతం

మెటల్‌ షేర్లలో అమ్మకాలు

Monday 11th February 2019

ప్రపంచమార్కెట్లో పతనమవుతున్న మెటల్‌ షేర్ల పతనానికి అనుగుణంగా దేశీయ మార్కెట్లో మెటల్‌ షేర్లు నష్టాల బాటపట్టాయి. మెటల్‌ షేర్లలో అధిక పరిమాణం గల నాల్కో, వేదాంత, వెల్‌స్పాన్‌ కార్పోరేషన్‌, జిందాల్‌ స్టీల్‌, మెయిల్‌ షేర్ల క్షీణతతో నిఫ్టీ మెటల్‌ ఇండెక్స్‌ సోమవారం ట్రేడింగ్‌లో 2శాతం నష్టపోయింది. అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి మందగమనం, చైనా-అమెరికాల మధ్య వాణిజ్య చర్చలు ఇంకా ఓ కొలిక్కి రాకపోవడం, అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్‌ ఆందోళన కొనసాగుతుండం

Most from this category