News


11300 దిగువన ముగిసిన నిఫ్టీ

Friday 10th May 2019
Markets_main1557484017.png-25667

స్టాక్‌ మార్కెట్‌ వరుసగా 8వ రోజూ నష్టాలనే చవిచూసింది. మెటల్‌, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంజీసీ, అటో షేర్ల పతనంతో సెన్సెక్స్‌ 96 పాయింట్లు నష్టపోయి 37,462 వద్ద, నిఫ్టీ 23 పాయింట్లు నష్టపోయి 11,300ల దిగువున 11,279 వద్ద ముగిసింది. సూచీలకు ఇది వరుసగా ఎనిమిది రోజూ నష్టాల ముగింపు కావడం గమనార్హం. ఈ ఎనిమిది రోజుల్లో సెన్సెక్స్‌ 1603 పాయింట్లను కోల్పోగా, నిఫ్టీ 488 పాయింట్లను నష్టపోయింది. అమెరికా-చైనాల మద్య వాణిజ్య యుద్ధం తెరపైకి రావడం, దేశవ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇన్వెస్టర్ల అప్రమత్తత, ఇటీవల కంపెనీలు ప్రకటించిన త్రైమాసిక ఫలితాలు మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఆసియా మార్కెట్లను సానుకూల సంకేతాలను అందుకున్న మార్కెట్‌ నేడు లాభంతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ 73 పాయింట్ల లాభంతో 38632 వద్ద, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,314 పాయింట్ల వద్ద మొదలయ్యాయి. మిడ్‌ సెషన్‌ వరకు  కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు లాభాల్లో ట్రేడయ్యాయి. అనంతరం ఇన్వెస్టర్లు అమ్మకాలకు మొగ్గుచూపడంతో సూచీలు తిరిగి నష్టాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 287.39 పాయింట్ల రేంజ్‌  37,370 - 37,721.98 శ్రేణిలో ట్రేడవ్వగా, నిఫ్టీ 11,342.75 - 11,245 రేంజ్‌లో కదలాడింది.
ఐఓసీ, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌, యస్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటాస్టీల్‌ షేర్లు 2నుంచి 6.50శాతం నష్టపోగా, ఇండియాబుల్స్‌హౌసింగ్స్‌ ఫైనాన్స్‌, భారతీఎయిర్‌టెల్‌, టైటాన్‌, ఎస్‌బీఐ, జీ లిమిటెడ్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం వరకూ లాభపడ్డాయి. 



You may be interested

ఈ కంపెనీల్లో పెరిగిన ప్రమోటర్ల తనఖా

Friday 10th May 2019

బీఎస్‌ఈ-500 కంపెనీల ప్రమోటర్ల తనఖా వాటాలు డిసెంబర్‌ నాటితో పోలిస్తే మార్చి త్రైమాసికంలో కొంత తగ్గాయి. బీఎస్‌ఈ 500 కంపెనీలకు సంబంధించి ప్రమోటర్ల వాటాల తనఖా డిసెంబర్‌ నాటికి 2.98 శాతంగా ఉండగా, మార్చి క్వార్టర్‌లో 2.83 శాతానికి తగ్గింది. కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ నివేదిక ప్రకారం ప్రమోటర్లు తనఖాలో ఉంచిన వాటాల విలువ రూ.1.95 లక్షల కోట్లు. అయితే, వీటిల్లో ఓ 30 కంపెనీలకు సంబంధించి మాత్రం పరిస్థితి

ఓపిక ఉంటే మిడ్‌క్యాప్స్‌లో మంచి అవకాశాలు!

Friday 10th May 2019

దీర్ఘకాలిక ధృక్పథంతో వేచిచూసే మదుపరులకు మిడ్‌క్యాప్స్‌ మంచి అవకాశాన్నిస్తున్నాయని ఏగన్‌ లైఫ్‌ ఇన్స్యూరెన్స్‌ సీఐఓ సైబల్‌ ఘోష్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే మార్కెట్లో తీవ్రకదలికలు, లార్జ్‌క్యాప్స్‌ హవా అనే రెండు అంశాలు ఎలాంటి మార్పులేకుండా ఉన్నాయన్నారు. ఆర్థిక సంవత్సరం మారినా మార్కెట్లో నిర్దిష్ట దిశానిర్దేశం లేదన్నారు. దీంతో మదుపరులు ఎక్కువగా పెద్ద స్టాకులవైపు చూస్తున్నారని, అందువల్లే మొత్తం మార్కెట్‌ కన్నా లార్జ్‌క్యాప్స్‌ మాత్రమే మంచి ప్రదర్శన చూపుతున్నాయని

Most from this category