News


11700 దిగువన నిఫ్టీ ముగింపు

Monday 24th June 2019
Markets_main1561371682.png-26534

బలహీన అంతర్జాతీయ సంకేతాలతో ట్రేడింగ్‌ ఆద్యంతం తీవ్ర ఒడిదుడుకులకు లోనైన సూచీలు చివరికి నష్టాలతో ముగిశాయి. నిఫ్టీ 24 పాయింట్ల నష్టంతో 11700 దిగువున 11,699 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌ 71 పాయింట్లను నష్టపోయి 39,123 వద్ద ముగిసింది. ఇరాన్‌ అమెరికా దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టకపోవడం, క్రూడాయిల్‌ ధరలు చల్లారకపోవడం తదితర బలహీన అంతర్జాతీయ సంకేతాలు దేశీయ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాన్ని చూపాయి. ఇక దేశీయంగా పరిణామాల విషయానికోస్తే... ఈ వారంలో ఎఫ్‌అండ్‌ఓ ముగింపు ఉండటం, వచ్చేవారంలో కేంద్రం లోక్‌సభలో బడ్జెట్‌ ప్రవేశపెట్టనుండటం, నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడటంతో ఇన్వెస్టర్లు అప్రమత్తత వహించారు. ఫలితంగా ట్రేడింగ్‌ ఆద్యంతం సూచీలు తీవ్రమైన ఒడిదుడుకులకు లోనయ్యాయి. ఇంట్రాడేలో ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 279 పాయింట్ల స్థాయిలో 39,021.70 - 39,300.02 శ్రేణిలో ట్రేడవగా, నిఫ్టీ 84పాయింట్ల రేంజ్‌లో 11,670.20 - 11,754.00 స్థాయిలో కదలాడింది. ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు, ఎఫ్‌ఎంసీజీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాలకు చెందిన షేర్లు నష్టాల్లోనే ముగిశాయి. అత్యధికంగా మెటల్‌, అటో రంగ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరో 2-3 ఏళ్లలో సాధరణ వాహనాల స్థానంలోనికి ఎలక్ట్రానిక్‌ వాహనాలను తీసుకొచ్చేందుకు తగిన ప్రణాళికను రూపొందించాలని అటో పరిశ్రమకు ప్రభుత్వం ఆదేశాలను జారీచేసింది. ఇందుకు ప్రణాళిక సమర్పణకు రెండువారాల గడువును విధించింది. ఫలితంగా అటోరంగ షేర్లు తీవ్రంగా అమ్మకాలు నెలకొన్నాయి. అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలతో పాటు అమెరికా - చైనాల మధ్య వాణిజ్యయుద్ధం తీవ్రతరం అవుతున్న తరుణంలో మెటల్‌ షేర్లలో సైతం అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోవడంతో ఎన్‌ఎస్‌ఈలోని కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 26.30 పాయింట్లను కోల్పోయి 30,602.05 వద్ద  స్థిరపడింది.  
బజాజ్‌ అటో, టాటాస్టీల్‌, ఓఎన్‌జీసీ, ఐషర్‌మోటర్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌ షేర్లు 2శాతం నుంచి 3.50శాతం నష్టపోగా, ఎస్‌బీఐ బ్యాంక్‌, టీసీఎస్‌, ఎంఅండ్‌ఎం, యస్‌ బ్యాంక్‌ షేర్లు 11శాతం నుంచి 5.50శాతం లాభపడ్డాయి. You may be interested

జలాన్‌ ప్యానెల్‌ నివేదిక వాయిదా!

Monday 24th June 2019

ఆర్‌బీఐ మిగులు నిధుల వినియోగంపై సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాటైన జలాన్‌ ప్యానెల్‌ నివేదిక విడుదల వాయిదా పడింది. తొలుత ఈ నివేదిక సోమవారం విడుదల చేయాలని భావించారు. అయితే నివేదిక విడుదల వాయిదా పడినట్లు రాయిటర్స్‌ వార్త సంస్థ తెలిపింది. ఇలా వాయిదా పడడం ఇది నాలుగోసారి. ప్యానెల్‌లో ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ జలాన్‌తో పాటు ఆరుగురు సభ్యులుంటారు. ఏప్రిల్‌లో ఈ ప్యానెల్‌ తన నివేదిక విడుదల చేయాల్సిఉంది. సభ్యుల

బడ్జెట్‌ ఎవరి వైపు?

Monday 24th June 2019

నరేంద్ర మోదీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టాక వచ్చే మొదటి బడ్జెట్‌లో నిర్మలా సీతారామన్‌ ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేసారు? ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేయబోతోంది? మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ పరుగులు పెట్టేనా?        వచ్చే ఐదేళ్లలో పెట్టుబడులను ఆకర్షించాడానికి, ప్రోత్సాహకాలందించి వినియోగాన్ని పెంచడానికి, సామాజిక మౌలిక వసతులపై ప్రజలను ఖర్చుపెట్టించడానికి భూమి, కార్మిక, మూలధనం, వ్యవస్థాగత తదితర రంగాలలో నిర్మాణాత్మక విధాన మార్పులను నిర్మలాసీతారామన్‌ తన

Most from this category