News


మళ్లీ లాభాల ముగింపు

Thursday 26th September 2019
Markets_main1569494350.png-28570

  • 11550 పైన ముగిసిన నిఫ్టీ
  • 396 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్‌ 

ఒకరోజు పతనం అనంతరం మార్కెట్‌ మళ్లీ లాభాల బాట పట్టింది. గురువారం సెన్సెక్స్‌ 396.22 పాయింట్లు పెరిగి 38,990 వద్ద, నిఫ్టీ 131 పాయింట్లు లాభపడి 11,571.20 వద్ద స్థిరపడ్డాయి. మార్కెట్‌ ప్రారంభం నుంచి ఒక్క ఐటీ తప్ప మిగిలిన అన్ని అన్నిరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ముఖ్యంగా బ్యాంకింగ్‌, ఆర్థిక, మెటల్‌ రంగ షేర్లలో ఎక్కువగా కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేట్‌రంగ బ్యాంక్‌ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1.50శాతం లాభపడి 30,003.30 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిప్టీ 11,466.35 - 11,610.85 రేంజ్‌లో కదలాడగా, సెన్సెక్స్‌  38,676.11 - 39,158.07 శ్రేణిలో కదలాడింది. 

జీ లిమిటెడ్‌, ఐఓసీ, కోల్‌ ఇండియా, ఎంఅండ్‌ఎం, వేదాంత షేర్లు 4.50శాతం నుంచి 7శాతం లాభపడ్డాయి. విప్రో, హిందూస్థాన్‌యూనిలివర్‌, ఇన్ఫోసిస్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైన్సా్‌న్‌, యస్‌బ్యాంక్‌ షేర్లు అరశాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. 

మార్కెట్‌ ర్యాలీకి కారణమైన అంశాలేవే..!
 

మళ్లీ చిగురించిన అమెరికా చైనా వాణిజ్య ఒప్పందపు ఆశలు...
అమెరికా-చైనా వాణిజ్య పోరుకు త్వరలో ముగింపు పడవచ్చనే ఆశావహన అంచనాలు ఇన్వెస్టర్లలో మళ్లీ మొదలయ్యాయి. చైనాతో వాణిజ్య ఒప్పందాన్ని అనుకున్న సమయానికికంటే ముందుగానే కుదుర్చుకునే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ నిన్నరాత్రి ప్రకటించారు. ఒకవేళ ఒప్పందం విజయమంతమైనట్లైతే... దాదాపు 15నెలల సుదీర్ఘ వాణిజ్య యుద్ధానికి ముగింపు పడటంతో పాటు చైనాతో సహా అంతర్జాతీయ వృద్ధి ఆందోళనలను తగ్గుముఖం పట్టిస్తుందని మార్కెట్‌ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిన్నటి రోజున ఆసియాలో మరో ప్రధాన దేశమైన జపాన్‌తో అమెరికా పలు వాణిజ్య ఒ‍ప్పందాలను కుదుర్చుకుంది. ట్రంప్‌, జపాన్‌ ప్రధాన మంత్రి  షింజో అబేలు ఇరుదేశాలకు చెందిన వ్యవసాయ, యంత్ర పరికరాలతో పాటు ఇతర ఉత్పత్తులపై సుంకాలను తగ్గించే పరిమిత వాణిజ్య ఒప్పందంపై సంతకం చేశారు. 
మరిన్ని ఆర్థిక సంస్కరణలు:- 
కేంద్రం ప్రభుత్వం వ్యవస్థలో మరిన్ని ఆర్థిక సంస్కరణలు చేపట్టే అవకాశం ఉందనే అంచనాలు దలాల్‌ స్ట్రీట్స్‌లో మొదలయ్యాయి. ఆర్థిక మందగమనానికి అడ్డుకట్ట వేసేందుకు దేశీయ కంపెనీలకు రూ. 1.45 లక్షల కోట్ల ఉద్దీపనలకు ప్రకటించిచన సంగతి తెలిసిందే. న్యూయార్క్‌లో జరిగిన నిన్న జరిగిన బ్లూంబర్గ్‌ వ్యాపార సదస్సులో ప్రధాని మోదీ మాట్లాడుతూ... భారత్‌ అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు స్వర్గధామమని, ఆర్థిక సంస్కరణలకు తమ ప్రభుత్వం ఇప్పుడే ప్రారంభించిదని, రానున్న రోజుల్లో మరిన్ని ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఎఫ్‌డీఐ, ఎఫ్‌పీఐల వాటాను పెంచడం, కొన్ని ప్రభుత్వరంగ కంపెనీల ప్రైవేటీకరణపై ప్రభుత్వం కృషి చేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ రంగ ఐదు ప్రభుత్వ రంగ సంస్థలలో వ్యూహాత్మక వాటా అమ్మకాన్ని ప్రభుత్వం యోచిస్తోంది. బీపీసీఎల్‌, కంటైనర్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా, షిప్పింగ్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియాలో వాటాల విక్రయానికి కేంద్రం కేబినేట్‌ ఆమోదం కోసం ప్రయత్నిస్తున్నదనే వార్తలు వెలుగులోకి వచ్చాయి.
తగ్గిన ముడిచమురు ధరలు:- 
వరుసగా రెండో రోజూ ముడిచమురు ధరలు పతనమయ్యాయి. అమెరికా చమురు నిల్వలు అనూహ్యంగా పెరగడం, చైనాతో అతి తొందరలోనే వాణిజ్య ఒ‍ప్పందాన్ని కుదుర్చుకుంటామని ట్రంప్‌ ప్రకటనతో డిమాండ్‌ తగ్గే అవకాశం ఉందనే అంచనాలు ఇందుకు కారణయ్యాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఫ్యూచర్‌ బారెల్‌ ధర 65డాలర్ల నుంచి 62డాలర్లకు దిగివచ్చింది. తగ్గిన ముడిచమురు ధరలు భారత్‌లాంటి వర్థమాన దేశాలకు కలిసొచ్చే అంశం. 
ఎఫ్‌ అండ్‌ ఓ ఎక్స్‌పైరీ:- 
నేడు సెప్టెంబర్‌ ఎఫ్‌అండ్‌ఓ ఎక్స్‌పైరీ నేపథ్యంలో బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, అటో షేర్లకు భారీ డిమాండ్‌ పెరిగింది. రానున్న రోజుల్లో ఆటో కంపెనీలకు డిమాండ్ పునరుద్ధరణతో పాటు బ్యాంకుల ఆస్తి నాణ్యత, రుణ ప్రవాహం పెరుగుదల జరగవచ్చనే మార్కెట్‌ విశ్లేషకుల అంచనాలు ఈ రంగ షేర్లకు డిమాండ్‌ను పెంచాయి. బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్, ఫైనాన్షియల్‌ సర్వీసెన్‌ ఇండెక్స్‌లు 2శాతానికి మించి పెరిగాయి. అటో, మెటల్‌, రియల్టీ రంగ షేర్లు 1శాతానికి పైగా ర్యాలీ చేశాయి. 
సాంకేతిక అంశాలు:- 
నిఫ్టీ ఇండెక్స్‌ ఇంట్రాడేలో 11,600 స్థాయిని తిరిగి అందుకుంది. అలాగే డైలీ ఛార్ట్‌లో బుల్లిష్‌ క్యాండిల్‌ను ఏర్పాటు చేసింది. ఇండెక్స్‌ 11600-11650 రేంజ్‌లో కీలక మద్దతు స్థాయి అని ఒకవేళ ఆ స్థాయిని అధిగమిస్తే రానున్న రోజుల్లో 11,800-11,900 స్థాయికి చేరుకుంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. You may be interested

మార్చి నాటికి 43,000కు సెన్సెక్స్‌!?

Friday 27th September 2019

దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్థానిక, అంతర్జాతీయ అంశాల కారణంగా ఇంత కాలం పాటు ప్రతికూల పనితీరు చూపించినట్టు చెప్పారు గ్లోబ్‌ క్యాపిటల్‌ మార్కెట్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ హిమాన్షుగుప్తా. కానీ, ప్రభుత్వ కార్పొరేట్‌ పన్ను తగ్గింపు, ఆర్‌బీఐ వడ్డీ రేట్ల కోత, మంచి వర్షాలు తాజా పెట్టబడులను ఆకర్షించగలవన్నారు. దీంతో వచ్చే మార్చి నాటికి నిఫ్టీ 12,500ను పరీక్షిస్తుందని తెలిపారు. సెన్సెక్స్‌ 43,000 లక్ష్యాన్ని చేరుతుందన్నారు. 11,800 స్థాయి నిఫ్టీకి కీలకమని,

ఎల్‌ఐసీ పోర్టుఫోలియోలో టాప్‌లేపిన మిడ్‌క్యాప్స్‌!

Thursday 26th September 2019

 అతి పెద్ద దేశీయ సంస్థాగత ఇన్వెస్టర్‌ లైఫ్‌ ఇన్సురెన్స్‌ కార్పోరేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఎల్‌ఐసీ) పోర్టుపోలియోలోని  షేర్లు సెప్టెంబర్‌ నెలలో అద్భుత ప్రదర్శనను చేశాయి. ఈ ఏడాది జూన్‌ 30 నాటికి ఎల్‌ఐసీ పోర్టుపోలియోలో మొత్తంగా 240 కంపెనీల షేర్లుండగా, అందులో 162 కంపెనీలు పాజిటివ్ రిటర్న్‌లను ఇవ్వడం గమనార్హం. రియల్‌ ఎస్టేట్‌, హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ వ్యాపారాలలో ఉన్న టెక్స్‌మాకో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్‌ హోల్డింగ్స్ (సెప్టెంబర్‌ 1 నుంచి సెప్టెంబర్‌ 24

Most from this category