News


ఆరంభలాభాలు ఆవిరి

Thursday 25th July 2019
Markets_main1564051259.png-27317

 

  • ఆరోరోజూ ఆగని సూచీల పతనం

ఆరంభ లాభాలు ఆవిరి కావడంతో మార్కెట్‌ ఆరోరోజూ నష్టాలతో ముగిసింది.  సెన్సెక్స్‌ 16 పాయింట్లు నష్టపోయి 37831 వద్ద, నిఫ్టీ 9.50 పాయింట్లు క్షీణించి 11261 వద్ద స్థిరపడ్డాయి. నేడు జూలై డెరివేటివ్‌ సిరీస్‌ గడువు ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్ల స్క్వేరింగ్‌అప్‌ లావాదేవీల కారణంగా స్టాక్‌ సూచీలు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. అలాగే నేటి జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశ నిర్ణయాలు కోసం మార్కెట్‌ వర్గాల ఎదురుచూపులు, ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌ మారకంలో రూపాయి విలువ ఒడిదుడుకుల ట్రేడింగ్‌ సూచీలు ఆరంభలాభాలు ఆవిరయ్యేందుకు కారణమయ్యాయి. అలాగే పలు ప్రధాన కార్పోరేట్‌ కంపెనీల క్యూ1 ఫలితాలు ఆశించిన స్థాయిలో నమోదు కాకపోవడం, దేశీయ ఈక్విటీ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీ ఎత్తున పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుడటం తదితర అంశాలు సైతం మార్కెట్‌ సెంటిమెంట్‌ను బలహీన పరిచాయి. ప్రభుత్వరంగ బ్యాంక్‌ రంగ, మెటల్‌, ఎఫ్‌ఎంసీజీ, అటో ఇండెక్స్‌ అ‍మ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. మరోవైపు ఫార్మా, మీడియా, ఐటీ,, ఫైనాన్స్‌ సర్వీసెస్‌, రియల్టీ రంగ షేర్లకు స్వల్పంగా కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌ షేర్లు లాభపడటంతో ఎన్‌ఎస్‌ఈలో కీలకమైన బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 90 పాయింట్లు పెరిగి 29000 స్థాయిపైన 29,043.05 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో నిఫ్టీ 122 పాయింట్ల రేంజ్‌లో 11,239.35 - 11,361.40 శ్రేణిలోనూ, సెన్సెక్స్‌ 395 పాయింట్ల స్థాయిలో 37,775.51 - 38,169.87 రేంజ్‌లో ట్రేడయ్యాయి. ఈ ఆరు ట్రేడింగ్‌ సెషన్స్‌లో సెన్సెక్స్‌ 1448 పాయింట్లను, నిఫ్టీ 435 పాయింట్లను నష్టపోయింది.

395 పాయింట్లు రేంజ్‌లో సెన్సెక్స్‌:- 
ఐదురోజు భారీ పతనానికి బ్రేక్‌ వేస్తూ నేడు సూచీలు లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న సానుకూల సంకేతాలను అందుకు సహకరించాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 85 పాయింట్ల లాభంతో 37,935 పాయింట్ల వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 11,292 పాయింట్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం ట్రేడింగ్‌ సెషన్‌లో ఫార్మా, ప్రైవేట్‌రంగ బ్యాంక్‌, ఫైనాన్స్‌ సర్వీసు, ఎఫ్‌ఎంజీసీ రంగ షేర్ల ర్యాలీతో సూచీలు భారీగా లాభాలను ఆర్జించాయి. ఒక దశలో నిఫ్టీ ఇండెక్స్‌ 90 పాయింట్ల మేర పెరిగి 11,361.40 వద్ద, సెనెక్స్‌ 323 పాయింట్లు పెరిగి 38,170 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని అందుకున్నాయి. అయితే మిడ్‌సెషన్‌ నుంచి మార్కెట్లో మొదలైన అమ్మకాలు సూచీల లాభాల్ని క్రమంగా హరించివేశాయి. ముఖ్యంగా మెటల్‌, ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ షేర్లు పతనం సూచీలు భారీగా దెబ్బతీసింది. 

జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, కోల్‌ ఇండియా, బజాజ్‌ఫైనాన్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వీసెస్‌, టాటామోటర్స్‌ షేర్లు 2.50శాతం నుంచి 5శాతం నష్టపోగా, ఇండస్‌ఇండ్‌, సన్‌ఫార్మా, జీ లిమిటెడ్‌, సిప్లా, వేదాంత షేర్లు 2.50శాతం నుంచి 4.50శాతం నష్టపోయాయి. You may be interested

దివాలా చట్ట సవరణలు బ్యాంకింగ్‌కు సానుకూలం: మూడీస్‌

Thursday 25th July 2019

 కేంద్ర ప్రభుత్వం దివాలా చట్టంలో చేసిన ఏడు సవరణల వలన ఈ చట్ట ప్రభావం మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఈ చర్య ఇండియా బ్యాంకులకు సానుకూలంగా పనిచేస్తుందని మూడీస్‌ ఇన్వెస్ట్‌ర్స్‌ సర్వీసెస్‌ తెలిపింది. ప్రభుత్వం దివాలా చట్టంలో భాగంగా కార్పోరేట్‌  రిజల్యూషన్‌ పక్రియ పూర్తిచేయడానికి 330 రోజుల డెడ్‌లైన్‌ను విధించింది. ఈ సమయంలోనే వివాదాలు, న్యాయ సంబంధ విషయాలను క్లియర్‌ చేసుకోవాలని తెలిపింది. అంతేకాకుండా దివాలా కంపెనీలోని వాటాదారులపై పరిష్కార ప్రణాళికను

సెంటిమెంట్‌ మెరుగవ్వకపోతే మరో 8 శాతం పతనం!

Thursday 25th July 2019

మార్కెట్‌పై నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ అంచనా ఎకానమీ, మార్కెట్లలో సెంటిమెంట్‌ మెరుగుపడకుంటే సూచీలు మరో 6- 8 శాతం పతనం కావడం ఖాయమని నార్నోలియా ఫైనాన్షియల్‌ అడ్వైజర్స్‌ సీఐఓ శైలేంద్ర కుమార్‌ అభిప్రాయపడ్డారు. సెంటిమెంట్‌ పాజిటివ్‌గా మారాలంటే ఎన్‌పీఏ కేసులు కొన్నైనా పరిష్కారం కావడం, ఆర్‌బీఐ భారీగా రేట్లను తగ్గించడం లాంటివి అవసరమన్నారు. ఎకానమీలో లిక్విడిటీ సమస్య పరిష్కారానికి బడ్జెట్లో ప్రకటించిన చర్యలు బాగున్నాయని, వీటి ప్రభావం కనిపించడానికి మరో 4-5

Most from this category