News


మిశ్రమంగా ముగిసిన మార్కెట్‌

Thursday 5th September 2019
Markets_main1567679672.png-28220

 మార్కెట్‌ గురువారం మిశ్రమంగా ముగిసింది. ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సెన్సెక్స్‌ 80 పాయింట్ల నష్టంతో 36,644.42 వద్ద, నిఫ్టీ 3.25 పాయింట్ల స్వల్పలాభంతో 10,847.90 ముగిశాయి. అటో, మీడియా, ఫార్మా,, ప్రభుత్వరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. ప్రైవేట్‌రంగ బ్యాంకింగ్‌, ఐటీ, ఎఫ్‌ఎంజీసీ, ఆర్థిక సర్వీసులు, రియల్టీరంగ షేర్లు అమ్మకాల ఒత్తిడికి ఎదుర్కోన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలను అందిపుచ్చుకున్న దేశీయ మార్కెట్‌ నేడు లాభంతో మొదలైంది. ఉదయం సెషన్‌లో ఇంధన, మెటల్‌, ఇన్ఫ్రా, అటోరంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 183 పాయింట్లు లాభాన్ని ఆర్జించి 36,898.99 వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు పెరిగి 10,920.10 వద్ద ఇంట్రాడే గరిష్టాలను నమోదు చేశాయి. బ్యాంకింగ్‌ రంగ షేర్లలో అనూహ్య అ‍మ్మకాలతో పాటు  ఎఫ్‌పీఐల అమ్మకాలు కొనసాగడంతో సూచీలు మిడ్‌సెషన్‌ కల్లా ఉదయం ఆర్జించిన లాభాల్ని కోల్పోయాయి. యూరప్‌ మార్కెట్ల మిశ్రమ ప్రారంభం ఇన్వెస్టర్లలో కొంత ఆందోళన కలిగింది. ఫలితంగా సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం(36,898.99)నుంచి 349 పాయింట్లును కోల్పోయి 36,541.88 వద్ద, నిఫ్టీ ఇండెక్స్‌ డే హై స్థాయి(10,920.10) నుంచి 114 పాయింట్లు నష్టపోయి 10,816.00 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదుచేశాయి. ట్రేడింగ్‌ ముగిసే వరకు సూచీలు లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరి మిశ్రమంగా ముగిశాయి. 

కోటక్‌బ్యాంక్‌, టీసీఎస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఇండియాబుల్స్‌హౌసింగ్‌ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు 1శాతం నుంచి 3శాతం వరకు నష్టపోగా, యస్‌బ్యాంక్‌, బీపీసీఎల్‌, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, టాటామోటర్స్‌ షేర్లు 4శాతం నుంచి 8శాతం లాభపడ్డాయి. 



You may be interested

రెండేళ్లలో రిలయన్స్‌ స్టాక్‌ రెట్టింపు..?

Friday 6th September 2019

జియో ఫైబర్‌ టారిఫ్‌లను ప్రకటించిన నేపథ్యంలో వచ్చే మూడేళ్లలో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ప్రస్తుత స్థాయి నుంచి రెట్టింపు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో ఫైబర్‌ సేవలను గురువారం కంపెనీ ఆరంభించింది. అలాగే, వివిధ రకాల ప్లాన్లను కూడా ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1,600 పట్టణాల్లో కంపెనీ గిగా ఫైబర్‌ సేవలు ఆరంభమయ్యాయి.    ‘‘ఇది నిజంగా మార్కెట్‌లో విధ్వంసం సృష్టించేది. వినియోగదారుల డేటాను పెద్ద లక్ష్యంగా చేసుకున్నారు. ఏఆర్‌పీయూ (ఓ వినియోగదారుని

కరెక‌్షన్‌లో కొనేస్తున్నారు!

Thursday 5th September 2019

వాటాలు పెంచేసుకుంటున్న ప్రమోటర్లు ఆగస్టు నెలలో మార్కెట్లో వచ్చిన కరెక‌్షన్‌ ప్రమోటర్లకు వరంగా మారింది. చాలామంది ప్రమోటర్లు ఈ పతనంలో తమ సొంత కంపెనీల షేర్లను తక్కువ ధరకు కొని వాటాను పెంచుకున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. కేవలంచిన్న కంపెనీల ప్రమోటర్లే కాకుండా పెద్ద కంపెనీల ప్రమోటర్లు కూడా ఇలా వాటాలు పెంచుకోవడం గమనార్హం. ఇలాంటివాటిలో యునైటెడ్‌ స్పిరిట్స్‌, జేఎస్‌డబ్ల్యు స్టీల్‌, వొడాఫోన్‌ ఐడియా, చోళ ఫైనాన్షియల్స్‌, దీపక్‌ నైట్రేట్‌, సంగమ్‌ ఇండియా,

Most from this category